రుచి

పుల్ల పుల్లగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేతగా వున్న చింతకాయల్ని నావ చింతకాయలంటారు. వీటికి పులుపు కొంచెం తక్కువగా ఉంటుంది. కాని రుచి బాగుంటుంది. ఈ చింతకాయలతోనూ వివిధ రకాల వంటలు చేసుకోవచ్చు. విటమిన్ సి ఎక్కువుగా ఉంటుంది. గర్భిణులు చాలా ఇష్టంగా తింటారు.

చింతకాయ మీల్‌మేకర్

మీల్‌మేకర్ -24
చింతగుజ్జు - 1 కప్పు
వెల్లుల్లి రేకలు - 12
నూనె - 2 చెంచాలు
ఆవాలు, జీలకఱ్ఱ-1 చెంచా
పచ్చిమిర్చి - 5
కొత్తిమీర - కొంచెం

విధానం: మీల్‌మేకర్ వేడినీళ్ళల్లో వేసి పిండి తియ్యాలి. బాణలిలో నూనె వేసి పోపులు వేయిం చింతకాయల గుజ్జు వేసి మగ్గనిచ్చి మీల్ మేకర్ ముక్కలు కలపాలి. ఇది అన్నంలోకి చపాతీకి కూడా మంచిది.

పెసర పులుసు

చింతకాయ రసం - 1 కప్పు
ఉడికించిన పెసర రసం - 2 కప్పులు
పచ్చిమిర్చి - 5
కొత్తిమీర - కొంచెం
ఆవాలు, జీలకఱ్ఱ - 1 చెంచా
ఉప్పు - 1 చెంచా
నూనె - 5 టీ.స్పూన్లు

విధానం: బాణీలో నూనె వేసి పోపులు వేయంచి పెట్టుకోవాలి. పోపులు వేగాక టమాటాలు, పచ్చిమిర్చి వేగనిచ్చి చింతపులుసు పోసి ఉడకనివ్వాలి. తరువాత పెసరపప్పు కలిపి 2పొంగులు రానిచ్చి దింపాలి.

కొబ్బరితో పచ్చడి

కొబ్బరి కోరు - 2 కప్పులు
చింతకాయలు - 100 గ్రా.
ఎండుమిర్చి - 12
ఆవాలు, జీలకఱ్ఱ - 1 చెంచా
నూనె - 5 చెంచాలు
ఉప్పు - 1 చెంచా
విధానం:పోపులు వేయించి పెట్టుకోవాలి. చింతకాయలు తొక్కి, కొబ్బరి చేర్చి రుబ్బుకోవాలి. ఈ పచ్చడి చాలా రుచిగా వుంటుంది.

పచ్చి పచ్చడి

చింతకాయలు - 1/4 కిలో
పచ్చిమిరప - 12
ఇంగువ - కొంచెం
కొత్తిమీర - 1 కట్ట
నూనె - 100 గ్రా.
ఆవాలు, మెంతులు, జీలకఱ్ఱ, మినప్పప్పు, శెనగపప్పు - 2 చెంచాలు
పసుపు - 1 చెంచా

విధానం: చింతకాయలను శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి. వాటిని ముద్దగా మిక్సీ పట్టాలి. నూనెలో పోపులు వేయించుకోవాలి. ఆ పోపును, చింతకాయల ముద్దను మళ్లీ మిక్సీ పట్టాలి. మిగిలిన నూనె కాచి అందులో ఈ రుబ్బిన పచ్చడి వేసి వేగనివ్వాలి. ఇది వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.

ఆనపకాయతో పులుసు

చింతకాయల రసం - 3 కప్పులు
ఉడికించిన ఆనప ముక్కలు - 1 కప్పు
ఎండుమిర్చి - 5
వెల్లుల్లి రెబ్బలు - 12
ఉప్పు - 1 చెంచా
బెల్లం - 1 చెంచా
పసుపు - 1/2 చెంచా
ఆవాలు, జీలకర్ఱ, మెంతులు- 1 చెంచా
నూనె -2 చెంచాలు
శెనగపిండి - 2 చెంచాలు

విధానం: బాణిలో నూనె వేసి పోపులు వేయించాలి. ఈ నూనెలో చింతపండు రసం వేసి కలపాలి. తరువాత శెనగపిండి కూడా కలపాలి. పొంగులు వస్తుండగా ఉడికించిన ఆనప ముక్కలు బెల్లం ఉప్పు కలపాలి.
చింత చింత కాయలతో పచ్చిపులుసు

చింతకాయలు- మూడు లేదా నాలుగు కాయలు
నూనె- రెండు స్పూన్లు
ఆవాలు-పావు చెంచా
జీలకర్ర- అర చెంచా
పసుపు- పావు చెంచా
కరివేపాకు - ఎనమిది ఆకులు
వెల్లుల్లి - రెండు రెబ్బలు

విధానం: ముందుగా చింతకాయలను ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన కాయలను అరకప్పు నీళ్లు పోసి పులుసువలే చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు కలుపుకోవాలి. బాణిలో నూన వేడి తాలింపు వేసుకోవాలి. ఈ పోపులో అన్ని కలుపుకున్న పులుసు పోసుకుంటే పుల్లటి పచ్చిపులుసు రెడీ.

-వాణీ ప్రభాకరి