రుచి

కట్ చేస్తే.. కమ్మగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిస్మస్‌తో పాటు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోబోతున్నాం. ఇప్పటికే క్రిస్మస్ చెట్టును అలంకరించేశాం. బంధుమిత్రులతో సందడిగా ఉండే ఇళ్లల్లో వచ్చే ఏడాది వరకు గుర్తుండేలా తియ్యటి కేకులు ఇంట్లో ఉండాల్సిందే. బేకరీల నిండా రకరకాల కేకులు ఊరిస్తాయి. అయితే మన ఇంట్లో కూడా
ఈ కేక్‌లు చేసుకోవచ్చు. ఇంటిల్లిపాదికీ వడ్డించేందుకు వీలుగా సులభంగా తయారుచేసుకోవచ్చు.
బొమ్మలు, చెట్లు రకరకాల షేపుల్లో చేసుకోవచ్చు.

డ్రైఫూట్స్‌తో..
బాదం పప్పులు - 24
జీడిపప్పులు - 24
కిస్‌మిస్‌లు - 1 కప్పు
ఏలకులు - 6
ఎండుకొబ్బరి కోరు - 1/2 కప్పు
మైదా - 4 కప్పులు
కోడిగ్రుడ్లు - 4
పంచదార మెత్తనిది - 4 కప్పులు
పాలు - 2 కప్పులు
వెన్న - 2 కప్పులు
డాల్డా - 2 కప్పులు
బేకింగ్ పౌడర్ -2 చెంచాలు
విధానం: మైదా, బేకింగ్ పౌడర్ జల్లించి ప్రక్కన పెట్టాలి. వెన్న, డాల్డా కరిగించి ఉంచాలి. మెత్తని పంచదార మైదాకు కలిపి, వెన్నను కరిగించి ఈ మిశ్రమంలో పోస్తూ కలపాలి. కోడిగ్రుడ్లు సొనను బాగా గిలకొట్టి పై మిశ్రమంలో పోసి మళ్లీ బాగా కలపాలి. దీన్ని మిక్సీ జార్‌లో పోసి ఏలకుల పొడి చేర్చి బాగా గ్రైండ్ చెయ్యాలి. బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్‌మిస్‌లు, ఎండుకొబ్బరి, కొంచెం వెన్నతో దోరగా వేయించినవి ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. గినె్నకు వెన్న బాగా పట్టించి ముందుగా సిద్ధం చేసిన గినె్నలో ఈ మిశ్రమం పోసి సర్ది ఓవెన్‌లో పోసి వేడి చెయ్యాలి. కమ్మని వాసన వస్తుంటే గ్యాస్ ఆపాలి. ఇదే ఎలక్ట్రికల్ ఓవెన్ అయితే టైము సెట్ చేసి పెట్టుకోండి. దీన్ని కొంచెం చల్లారాక పెద్ద ప్లేటులోకి తీసుకోండి. దీనిపై వెన్న క్రీమ్ రాసి డిజైన్‌లతో అలంకరించండి.