రుచి

పసందుగా పాయసం.. ( ఓట్స్ పాయసం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నపిల్లలకు పాయసం అంటే ఎంతో ఇష్టపడతారు. పుట్టిన రోజునాడు ఇంట్లో పాయసం తప్పనిసరిగా చేసుకుంటారు. ఇంటికి వచ్చిన అతిథులకు పాయసం వడ్డించేందుకు వీలుగా ఇవి తయారు చేసుకోండి.

ఓట్స్ పాయసం

ఓట్స్ - 2 కప్పులు
చిక్కని పాలు - 1 లీటరు
పంచదార - 250గ్రా.
నెయ్యి - 5 చెంచాలు
ఏలకులు - 6
బాదం, పిస్తా, జీడిపప్పులు - 1 కప్పు
కొబ్బరి కోరు - 5 చెంచాలు
కండెన్స్‌డ్ మిల్క్ - 2 కప్పులు
విధానం:ముందుగా ఓట్స్ నేతిలో వేయించాలి. డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించి ఉంచాలి. పాలు మరగనిచ్చి దానిలో ఓట్స్ వేసి మరగనివ్వాలి. మెత్తగా ఉడికాక కండెన్స్‌డ్ మిల్క్, కొబ్బరి, పంచదార, మిగిలిన నెయ్యి వేసి మరగబెట్టి, ఏలకులపొడి డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి దింపాలి. వేడి వేడిగా కప్పుల్లో పోసి త్రాగండి.

-నారుమంచి వాణీప్రభాకరి