రుచి

తీపి.. కారాల సంక్రాంతి (నేతి అరిసెలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి కొత్త రుచుల సంగమం. కొత్త పంటలు చేతికి వస్తాయి. కొత్త బియ్యం పిండితో చేసిన నేతి అరిసెలూ, బూరెలు, సకినాలు, నువ్వులు, పప్పులతో చేసిన వంటలతో ఇంటిల్లిపాదీ సంతోషంగా మూడు రోజులపాటు సంబరాలు చేసుకునే పండుగ. భోగిమంటలపై చేసిన పాయసం మధురంగా అతిథులకు ఆహ్వానం పలుకుతుంది. సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఏటా చేసుకునే వాటితో ఈ రుచులు ప్రయత్నించండి.

నేతి అరిసెలు
బియ్యం - 1 కేజీ
బెల్లం - 1/2 కేజి
నెయ్యి - 1 కప్పు
నూనె, 500 గ్రా.,
ఏలకులు - 8
అరిసె చెక్కలు - 1
నువ్వులు - 100 గ్రా.
ప్లాస్టిక్ పేపర్ - 1
విధానం: బియ్యం ఒక రోజు ముందు నానబెట్టాలి. మర్నాడు పిండి పట్టించి జల్లెడ పట్టాలి. బెల్లంలో 2 కప్పుల నీరు పోసి పాకం పట్టుకోవాలి. ఉండ పాకం వచ్చాక దానిలో మెత్తని పిండి కొంచెం కొంచెం వేస్తూ కలపాలి. కొంచెం నెయ్యి, ఏలకుల పొడి చేర్చి బాగా కలిపి చల్లార్చాలి. బాణలిలో నెయ్యి, నూనె వేసి కాగనివ్వాలి. ప్లాస్టిక్ పేపర్‌పైగాని, అరటి ఆకుపైగని పిండి ఉండ బంగాళాదుంప సైజు తీసుకుని వత్తి నూనెలో వదిలే ముందు రెండు వైపులా నువ్వులు అద్ది వేయించాలి మెత్తగా కావాల్సినవారు. బంగారు వనె్నవచ్చాక తీస్తే చాలు. ఇది కరకర కావాల్సినవారు బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఇంకా ముదురు కాపు రానివ్వాలి. ఇలా అన్ని అరిసెలు చేసుకోవాలి. ఇదే పిండి వుండల్లా చేసి వేయిస్తే పాకం ఉండలంటారు. ఇవి నెలకిపైగా నిల్వ ఉంటాయి.