రుచి

పాల బూరెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బియ్యం పిండి - 2 కప్పులు
పాలు - 1 కప్పు
బెల్లం తరుగు - 1 కప్పు
పంచదార - 1/2 కప్పు
కొబ్బరి కోరు - 1 కప్పు
ఏలకులు - 5
గసగసాలు - 2 చెంచాలు
నూనె - 250 గ్రా.
ఉప్పు - చిటికెడు
నెయ్యి - 5 చెంచాలు
బేకింగ్ పౌడర్ - 1 చెంచా
వంటసోడా - 1/2 చెంచా
విధానం:బియ్యం నానబెట్టి తడి పిండి పట్టించుకోవాలి. బెల్లం తరుగుకోవాలి. ఇప్పుడు బియ్యంపిండిలో ఈ బెల్లం పాకం పోసి, పంచదార పోసి బాగా కలపాలి. కరిగిన నెయ్యి, పాలు పోసి దీన్ని బజ్జీల పిండిలా కలుపుకోవాలి. దీనికి బేకింగ్ పౌడర్, వంటసోడా, కొబ్బరి, ఏలకులు, గసగసాలు కలిపి ఒక ప్రక్కన ఉంచాలి. 5, 6 గంటలు నానితే బాగుంటుంది. ఉదయం కలిపి మధ్యాహ్నం చేసుకుంటే సరి. పిండి మళ్లీ బాగా కలుపుకొని కాగిన నూనెలో గుంట గరిటెతో పిండి తీసుకొని నూనె మధ్యలో పోస్తే బాగా పొంగిన బూరె తయారు అవుతుంది. ఇలా మూకుడు సైజును బట్టి 1 లేక 3 బూరెలు వేసి వేయించాలి. కొబ్బరి చేర్చాము గనుక ఒక వారం నిల్వ ఉంటాయి. ఏ పొరకాపొర పూరీ మాదిరి విడిపోయి, తినడానికి రుచిగా ఉంటాయి.