రుచి

మధుర పూరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైదా - 2 కప్పులు
బియ్యం పిండి - 1 కప్పు
పల్లీలు - 2 కప్పులు
బెల్లంకోరు - 1 కప్పు
ఏలకులు - 6
నూనె - 250 ఘ్రా.
కొబ్బరి - 1/2 కప్పు
నెయ్యి - 1/2 కప్పు
పంచదార - 2 కప్పులు
కుంకుమ పువ్వు - 1 చెంచా
నిమ్మ ఉప్పు - 1 చెంచా
విధానం: మైదాలో నెయ్యి వేసి బియ్యం పిండి వేసి ముద్దగా కలపాలి. చిన్న తడి బట్టకప్పి 2 గంటలు నాననివ్వాలి. ఈలోగా పల్లీలు వేయించి మిక్సీ పట్టాలి. దీనికి బెల్లం, కాచిన నెయ్యి, ఏలకులపొడి, కొబ్బరి చేర్చి బాగా ముద్దగా కలుపుకోవాలి. ఇది కొంచెం జారుగానే ఉండాలి.మైదా పిండితో పూరీ చేసుకుని ఈ ముద్ద ఉంచి సర్ది అంచులు మడిచి వంకీలుగా నొక్కుకోవాలి. ఇలా అన్ని పూరీలు చంద్రవంకల్లా చేసుకోవాలి. పంచదారకి 2 కప్పుల నీరు చేర్చి పాకం రానిచ్చి నిమ్మ ఉపు, కుంకుమ పువ్వు వేసి కలపాలి. నిమ్మ ఉప్పువల్ల పాకం తొందరగా గడ్డకట్టదు. బాణలిలో నూనె కాగిన తరువాత ఈ పూరీలు వేయించి, తీసి పాకంలో వేసి పీల్చనివ్వాలి. ఇలా అన్ని పూరీలు పాకంలో ఊరనిచ్చి తియ్యాలి. ఈ మధుర పూరీలు లేక చంద్రవంకలు ఎంతో రుచిగా ఉంటాయి.

-నారుమంచి వాణీ ప్రభాకరీ