రుచి

కారం కారంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బియ్యం పిండితో చేసే పిండి వంటలు పిల్లలు ఇష్టంగా తింటారు. సాయంత్రం స్కూలు నుంచి రాగానే వారికి కారంకారంగా..తియ్యతియ్యగా ఏదైనా చేసి పెడితే ఆవురావురమంటూ తింటారు.పిల్లలకు ఇష్టమైన ఈ చిరుతిండి చేసిపెట్టండి.

రాగి, మినప సున్నుండలు
పొట్టు మినప్పప్పు - 2 కప్పులు
రాగిపిండి - 1 కప్పు
బెల్లం తరుగు - 2 కప్పులు
పల్లీలు - 1 కప్పు
నెయ్యి - 2 కప్పులు

విధానం:మినుములు దోరగా వేయిచాలి. రాగిపిండి నేతిలో దోరగా వేయించాలి. పల్లీలు దోరగా వేయించి, మినుములు, పల్లీలు మిక్సీ పట్టి రాగి పిండి, బెల్లం చేర్చి మళ్లీ మిక్సి పట్టాలి. కాచిన నెయ్యి కలిపి ఉండలు చేసుకోవాలి. ఇవి నెలకుపైగా నిల్వ ఉంటాయి.

పుట్నాల పప్పు మురుకులు
వేయించిన శెనగపప్పు - 4 కప్పులు
జీలకఱ్ఱ - 4 చెంచాలు
కారం - 5 చెంచాలు
సగ్గుబియ్యం - 1 కప్పు
బియ్యం - 2 కప్పులు
ఉప్పు - 2 చెంచాలు
నూనె - 500 గ్రా.
వాము - 2 చెంచాలు
బేకింగ్ పౌడర్ - 2 చెంచాలు
వెనె్న - 1 కప్పు

విధానం:ముందుగా శనగపప్పు, జీలకఱ్ఱ, బియ్యం, సగ్గుబియ్యం దోరగా వేయించాలి. ఇవన్నీ మెత్తగా మిక్సి పట్టాలి. జల్లించి, మళ్లీ మిక్సీ పట్టాలి. దీనికి కారం, వెన్న, బేకింగ్ పౌడర్, ఉప్పు చేర్చి ముద్దగా కలుపుకోవాలి. నూనె కాగనిచ్చి మురుకుల గొట్టలో ఈ పిండి పెట్టి నూనెలో వత్తాలి. ఇవి వేగాక అట్లకాడతో తీసి పళ్ళెంలో పెట్టాలి. ఇలా మొత్తం పిండిఅంతా మురుకులుగా చేసుకుని గాలి చొరరాని డబ్బాలో పెట్టాలి. నెలపైగా నిల్వ ఉంటాయి.

పాల చెక్క వడలు
బియ్యం పిండి - 2 కప్పులు
మైదా -1 కప్పు
పలా - 2 కప్పులు
ఉప్పు - 2 చెంచలా
శెనగపప్పు - 1/2 కప్పు
అల్లం మిర్చి పేస్ట్ - 1/2 కప్పు
నూనె - 500 గ్రా.
జీలకఱ్ఱ - 4 చెంచాలు
వంటసోడా- 1 చెంచా
కొత్తిమీర తరుగు - 1 కప్పు
విధానం: బియ్యపిండికి 1 కప్పు మైదా చేర్చి, అల్లం మిర్చి పేస్ట్ కలపాలి. తరువాత ఉప్పు, జీలకఱ్ఱ ,సోడ ఉప్పు వేసి ఒక కప్పు వేడి నీటితో కలపాలి. ఇప్పుడు కాచిన వేడిపాలు, కొత్తిమీర చేర్చి ముద్దగా కలపాలి. దీన్ని నిమ్మకాయంత ఉండలు చేసి నానిన శెనగపప్పు అద్ది వడగా చేసుకోవాలి. వీటిని కాగిన నూనెలో వేయించాలి. పాలు పోయడంవల్ల మరింత రుచి!

- వాణీప్రభాకరీ