రుచి

కరకర.. కూరల పకోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరకరలాడే వేడి వేడి పకోడీలు చూస్తే వెంటనే తినేయాలనిపిస్తోంది. సాయంత్రం పిల్లలు స్కూలు నుంచి రాగానే వీటిని చేసి పెడితే కమ్మగా తింటారు. శనగపిండితోపాటు ఆకుకూరలు, కాయగూరలు కలిపి చేసే పకోడీలు బలవర్థకమైనవి. మరి మీరు ప్రయత్నించండి.
*
అరటికాయతో..
పుట్నాల పొడి - 2 కప్పులు
సన్నగా తరిగిన చిన్న చిన్న అరటి ముక్కలు - 4 కప్పులు
నూనె - 250 గ్రా.
ఉప్పు - 1 చెంచా
కారం - 2 చెంచాలు
ఉల్లిపాయలు - 2
జీలకఱ్ఱ - 1 చెంచా
ముందుగా అరటి కాయను పుట్నాల పొడిలో కారం, జీలకఱ్ఱ, ఉప్పు, అన్నీ చేర్చి కలుపుకోవాలి. నూనె కాగాక చిన్న చిన్న పకోడీలుగా పోసుకోవాలి. వేగాక నూనె వాడ్చి తియ్యాలి. ఇది పిల్లలకి స్నాక్సుగాను, పెద్దలకి అన్నంలోకి బాగుంటాయి.
*
తోటకూరతో..
తోటకూర తరుగు - 4 కప్పులు
పచ్చిమిర్చి - 8
ఉల్లిముక్కలు - 1 కప్పు
ఉప్పు -1 చెంచా
జీలకఱ్ఱ - 1 చెంచా
సోయాపిండి - 1 కప్పు
బియ్యంపిండి - 4 చెంచాలు
ముందుగా మిర్చి, ఉల్లి, జీలకఱ్ఱ, సోయా, బియ్యంపిండి అన్నీ కలిపి నూనె కాగాక పకోడీలుగా వదలాలి. ఈవిధంగా మెంతికూర, పాలకూరతో చేసుకోవచ్చును. పుదీనాను కూడా చేర్చాలి.
*
చిక్కుడుకాయతో
చిక్కుడు కాయలు తరిగిన ముక్కలు - 4 కప్పులు
శెనగపిండి - 1 కప్పు
మైదా - 1/2 కప్పు
ఉప్పు, జీలకఱ్ఱ - 2 చెంచాలు
నూనె - 250 గ్రా.
సోడా - 1/2 చెంచా
ముందుగా పిండులన్నీ కలిపి నీరు చేర్చి, చిక్కుడు ముక్కలు చేర్చి కలిపి కాగిన నూనెలో పకోడీలుగా వేసుకోవాలి.
*
దొండకాయతో..
దొండకాయలు - 100 గ్రా.
మైదా - 1 కప్పు
సోయ - 2 చెంచాలు
బియ్యపిండి - 2 చెంచాలు
నూనె - 250 గ్రా.
ఉప్పు - 1 చెంచా
కారం, జీలకఱ్ఱ - 2 చెంచాలు
దొండకాయలు కోల ముక్కల్లా తరుగుకోవాలి. పిండిలన్నీ కలిపి అందులో ముంచి నూనెలో వదలాలి. బాగా వేగాక తీసి పళ్ళెంలో పెట్టండి.
*
బెండకాయతో..
బెండకాయలు - 100 గ్రా.
కార్న్‌ఫ్లోర్- 1/2 కప్పు
బియ్యంపిండి - 4 చెంచాలు
శెనగపిండి - 1 కప్పు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
కారం - 5 చెంచాలు
నూనె - 2250 గ్రా.
ముందుగా బెండకాయలు కడిగి ముక్కలుగా తరుగుకోవాలి. పిండిలన్నీ కలిపి బెండ ముక్కలు కలిపి నూనె కాగాక పకోడీలుగా వదులుకోవాలి.
*
ఉల్లి పకోడీలు
ఉల్లిముక్కలు - 2 కప్పులు
కరివేప - కొంచెం
పచ్చిమిర్చి - 12
నిమ్మరసం - 1 కప్పు
జీలకఱ్ఱ - 1 చెంచా
శెనగపిండి - 1 కప్పు
ఉప్పు - 2 చెంచాలు, వేరుశెనగపప్పు - 1 కప్పు
ముందుగా అన్ని పదార్థాలు కలుపుకొని నూనె కాగాక పకోడీలుగా వేసుకోవాలి.
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-వాణీ ప్రభాకరీ