రుచి

రుచిగా రొయ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్టినాడ్
*
కావాల్సిన పదార్థాలు:
రొయ్యలు: అరకిలో
బంగాళాదుంపలు: మూడు
కొబ్బరి తురుము: పావు కప్పు
గరంమసాలా: రెండు టీ స్పూన్లు
అనాసపువ్వు: ఒకటి
సోంపు: ఒక టీ స్పూన్
మిరియాలు: ఒక టీ స్పూన్
ఎండుమిర్చి: నాలుగు
మరాఠీమొగ్గ: రెండు
పథర్‌కే పూల్: కొద్దిగా
ధనియాలు: రెండు టీస్పూన్లు
జాజికాయపొడి: చిటికెడు
జీరకర : ఒక టీ స్పూన్
ఉల్లిపాయలు: రెండు
టొమాటో: ఒకటి
కరివేపాకు రెబ్బలు: రెండు
పసుపు: అరచెంచా
ఉప్పు: తగినంత
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం:
స్టవ్‌పై బాణలి పెట్టి కొబ్బరి తురుము, గరంమసాలా, సోంపు, మిరియాలు, ఎండుమిర్చి, మరాఠీమొగ్గ, పథర్‌కే ఫూల్, ధనియాలు, అనాసపువ్వు, జాజికాయపొడి, జీలకర నూనె వేసుకోకుండా వట్టిగా వేయించాలి. చల్లారాక వీటిని మిక్సీలో మెత్తని ముద్దలా చేసిపెట్టుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. అందులో కరివేపాకు రెబ్బలు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. రెండు నిముషాల తర్వాత టొమాటో ముక్కలు వేయాలి. అవి వేగాక బంగాళాదుంప ముక్కలు వేయాలి. అవి కూడా వేగాక ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా ముద్దను వేసి బాగా వేయించాలి. బంగాళాదుంప ముక్కలు మెత్తబడ్డాక శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేయాలి. అవి మెత్తగా అయ్యాక తగినంత ఉప్పు వేసి దింపేయాలి. అంతే చెట్టినాడ్ రొయ్యలు రెడీ.. ఇది అన్నంలోకే కాదు చపాతీలోకి, ఇడియాప్పంలోకి కూడా బాగుంటుంది.
*
ఇగురు
*
కావాల్సిన పదార్థాలు
రొయ్యలు: అరకిలో
ఉల్లిపాయలు: రెండు
అల్లంవెల్లుల్లి: రెండు టీస్పూన్లు
టొమాటో: ఒకటి
కరివేపాకు: రెండు రెబ్బలు
ఆవాలు: అరటీస్పూన్
పనుపు: కొద్దిగా
కారం: రెండు టీ స్పూన్లు
ధనియాలపొడి: రెండు టీ స్పూన్లు
గరంమసాలా: అర టీ స్పూన్
మిరియాల పొడి: పావు టీ స్పూన్
నిమ్మరసం: ఒక దబ్బ
నూనె: సరిపడా
ఉప్పు: తగినంత
తయారీ విధానం:
రొయ్యల్ని శుభ్రంగా కడిగి ఉప్పు, మిరియాలపొడి, పసుపు, నిమ్మరసం వేసి పక్కన పెట్టాలి. విడిగా బాణలిలో నూనె వేసి వేగాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి అవి ఉడికేవరకూ ఉంచి పసుపు, కారం, ధనియాలపొడి, గరంమసాలా వేసి కలిపి నూనె తేలేవరకూ వేయించాలి. ఇప్పుడు పక్కన పెట్టి ఉంచిన రొయ్యలు వేసి రెండు నిముషాలపాటు బాగా వేయించాలి. తరువాత కొద్దిగా నీళ్ళు పోసి, ఉప్పు వేసి మంట సిమ్‌లో పెట్టి మూతపెట్టి ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తురుము వేస్తే రొయ్యల ఇగురు రెడీ.
*
మామిడితో..
*
కావలసిన పదార్థాలు
రొయ్యలు: అరకిలో
పసుపు: కొద్దిగా
కారం: అర టీ స్పూను
ఉప్పు: తగినంత
మామిడికాయ: ఒకటి
పచ్చికొబ్బరి: ఒక కప్పు
చింతపండు: చిన్న నిమ్మకాయంత
ఎండుమిర్చి: మూడు
ధనియాలు: టీ స్పూను
ఉల్లిపాయ: ఒకటి
నూనె: సరిపడా
తయారీ విధానం:
రొయ్యల్ని శుభ్రంగా కడిగి పసుపు, కారం, ఉప్పు పట్టించి సుమారు అరగంటసేపు అలాగే ఉంచాలి. పచ్చి మామిడికాయను తొక్కతీసి చిన్న ముక్కలుగా కోయాలి. పచ్చికొబ్బరి, పసుపు, చింతపండు, ధనియాలు, ఎండుమిర్చిని కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి. అడుగు మందంగా ఉన్న పాన్‌ను తీసుకుని రొయ్యలు, మామిడికాయ ముక్కలు, అరకప్పు నీళ్ళు పోసి కాసేపు ఉడికించాలి. తరువాత మిక్సీపట్టిన మిశ మాన్ని వేసి, కొద్దిగా నీళ్ళు పోసి మీడియం మంటపై మరో పది నిముషాలు ఉడికించాలి. తరువాత మరో పాన్‌లో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయముక్కల్లి వేసి వేయించాలి. తరువాత దాన్ని కూరలో వేసి కలిపితే సరి.
*
కిచిడి
*
కావలసిన పదార్థాలు:
రొయ్యలు: అరకిలో
పసుపు: కొద్దిగా
సాంబారుపొడి: చెంచా
పచ్చిమిర్చి: రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీ స్పూన్
కరివేపాకు రెబ్బలు: రెండు
టొమాటో: ఒకటి
బంగాళాదుంప: ఒకటి
కొబ్బరి తురుము: రెండు చెంచాలు
ఉల్లిపాయలు: రెండు
బియ్యం: రెండు కప్పులు
నానబెట్టిన పెసరపప్పు: ఒక టేబుల్ స్పూన్
నానబెట్టిన మినపప్పు: ఒక టేబుల్ స్పూన్
నెయ్యి: రెండు టేబుల్ స్పూన్స్
ఉప్పు: తగినంత
తయారీ విధానం:
రొయ్యల్ని శుభ్రం చేసి పసుపు, ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్‌ని స్టవ్‌పై ఉంచి నెయ్యి వేయాలి. అందులో తగిరిన ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. వేగాక అందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కరివేపాకు, టొమాటో ముక్కలు, కొబ్బరి తురుమూ, బంగాళాదుంపముక్కలు, రొయ్యలు వేయాలి. రొయ్యలు కొద్దిగా వేగాక కడిగిన బియ్యం, పెసరపప్పు, మినపప్పు, తగినంత ఉప్పు, పసుపు, సాంబారుపొడి వేసి వేయించాలి. తరువాత దీనికి నాలుగు కప్పుల నీళ్ళుపోసి కుక్కరు మూతపెట్టి మూడు విజిల్స్ రానిస్తే రొయ్యల కిచిడీ తయారైనట్లే.