రుచి

ఉప్పు అధికమయితే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పులేని ఆహార పదార్థాలు రుచిగా వుండవు. ఉప్పు బాగా తక్కువయినా ఆ పదార్థం నోటికి రుచించదు. ఉప్పు ఆహార పదార్థాల్లో అధికమయితే పదార్థం నోట పెట్టలేరు. రుచి లేకపోయినా ఉప్పు తక్కువగా వాడటమే మంచిదంటున్నారు వైద్యులు. ఉప్పు అధికమయితే ఎనె్నన్నో అనారోగ్యాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. రాళ్ళ ఉప్పు, టేబుల్ సాల్ట్, అయోడైజ్డ్ ఉప్పు, నల్ల ఉప్పు, గ్రేసాల్ట్ లభిస్తున్నాయి. అయితే ఆరోగ్యానికి ఏ ఉప్పయినా బాగా తగ్గించవలసిందే.
ఉప్పు అధికంగా వేసి నిలవ చేసిన ఊరగాయలను ప్రతిరోజూ తినకూడదు. ముఖ్యంగా ఊరగాయ అయిపోయే చివరి రోజుల్లో దాన్ని అసలు తినకూడదు. ఎందుకంటే అందులో ఉప్పు అధికంగా వుంటుంది. అంతేకాదు, చిప్స్, ఫాస్ట్ఫుడ్స్ కూడా దేహంలో ఉప్పును పెంచుతాయి. ఉప్పును తగ్గించమని వైద్యులు ఎందుకు సలహా ఇస్తున్నదీ, ఆరోగ్యం మీద ఉప్పు ప్రభావం ఏ విధంగా ప్రసరిస్తుందన్నదీ తెలుసుకుంటే ప్రతివారూ తప్పనిసరిగా ఉప్పును తగ్గిస్తారు.
- ఉప్పును అధికంగా తినేవారిలో హైపర్ టెన్షన్ ఏర్పడుతుంది. ఉప్పును అధికంగా వాడేవారికి బ్లడ్‌ప్రెషర్ ఎక్కువవుతుందని నిర్థారించబడింది.
- శరీరానికి కావలసినదానికంటే అధిక శాతంలో ఉప్పును తీసుకుంటే యూరిన్ ద్వారా ఉప్పు విసర్జింపబడే సమయంలో శరీరం కాల్షియాన్ని కూడా నష్టపోవలసి వస్తుంది. దేహం కాల్షియాన్ని నష్టపోవడంతో ఎముకలు బలహీనపడుతాయి. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడే సమస్య కలుగవచ్చు.
- హైబిపి వున్నవారు, తాము తీసుకునే పదార్థాల్లో ఉప్పును తగ్గిస్తే బి.పి. నియంత్రణలో వుండటం వైద్యులు గమనించారు.
- ఆస్త్మాతో బాధపడేవారు ఉప్పును అతి తక్కువగా తీసుకోవాలి. ఉప్పు కొంత అధికమయితే ఎలర్జీ కలుగుతుంది. వ్యాధితో బాధ మరింత ఎక్కువ అవుతుంది.
-ఉదర సంబంధిత క్యాన్సర్ ప్రమాదం పొంచి వుంటుంది. ఆహార పదార్థాల్లో ఉప్పు స్వల్పంగా వాడితే ఆరోగ్యానికి ముప్పేమీ కలుగదు. కానీ ఉప్పు అధికమయితే మాత్రం అనారోగ్యాలకు గురికాక తప్పదు.
- ఉప్పు అధికమయితే అల్సరు ఏర్పడే ప్రమాదముంది.

-కె.నిర్మల