రుచి

మజామజా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామిడి పూత వేయగానే అసలు నోరూరుతుంది. ఇక మామిడి పిందె వేసి కాయ కాస్తే చెప్పాల్సింది ఏముంది. తెలుగువారింట మామిడి కాయతోను, పండుతోను చేసే వంటకాలు లెక్కకట్టడం చాలా కష్టమైన పని. అందరికీ నచ్చే మామిడికాయతో కొత్త రకాల వంటల ఓసారి చూద్దాం. పప్పు, పచ్చడి, పులుసు, నిలవ ఊరగాయలు అందరికీ తెలుసు. కొన్ని క్రొత్త తరహా
ఊరగాయలు, వంటలు ఏ తరం వారికైనా ఇష్టమేగా!
*
కోరు మాగాయ
మామిడికాయలు - 6, క్యారెట్‌లు - 2
మెంతిపొడి - 1 కప్పు
వేపుడు కారము - 2 కప్పులు
ఉప్పు - 1 కప్పు, నూనె - 2 కప్పులు
పసుపు - 1 చెంచా, ఇంగువ పొడి - 1 చెంచా
విధానము: ముందుగా మామిడికాయలు కడిగి తుడిచి ఆరనిచ్చి, స్క్రాపర్‌తో కోరుకోవాలి. క్యారెట్స్ కూడా కోరుకోవాలి. రెండూ కలిపి ఓ రెండు గంటలు ఎండలో ఎండనిచ్చి, ఉప్పు, కారం, మెంతిపొడి, పసుపు చేర్చి కలపాలి. నూనెలో ఇంగువ పొంగించి కలపాలి. ఇది ఒక నెల నిల్వ ఉంటుంది. క్యారెట్ వెయ్యకపోతే ఏటికి ఏడాది ఉంటుంది.
*
మెంతి గుత్తులు
చిన్న మామిడికాయలు - 12 (టెంకె పట్టినవి)
వేయించిన మెంతుల పొడి - 250 గ్రా.
వేయించిన కారము - 400 గ్రా.
నూనె - 1/4 కేజీ, మెంతులు - 1/2 కప్పు
ఇంగువ - 4 చెంచాలు
ఉప్పు - 250 గ్రా., వెల్లుల్లికారం - 1 కప్పు
పసుపు - 4 చెంచాలు
విధానము: ముందుగా మామిడికాయలు కడిగి ఆరబెట్టి పై తొక్కు సన్నగా తీసి, నాల్గు ప్రక్కలా గుత్తిమాదిరిగా తరగాలి. ఉప్పు, మెంతిపొడి, కారం, పసుపు, ఉన్ని కలిపి ఈ గుత్తుల్లో కూరి జాడిలో పెట్టాలి. మూడవ రోజున బయటకు తీసి పిండి ఊట, ముక్కలు ఎండబెట్టాలి. బాగా ఎండాక ఈ ముక్కల్ని ఊటలో వేసి నూనె కాచి ఇంగువ కాసి కలిపి మెంతులు వేసి మూతపెట్టాలి. ఒక వర్షం పడ్డాక ముక్క మెత్తబడుతుంది. అప్పుడు తింటే రుచి ఏడాదిపైగా నిల్వ.
*
కోరుబెల్లం
ఆవకాయ
మామిడికాయలు - 8, ఆవపిండి - 250 గ్రా.
కారం- 250, ఉప్పు - 150 గ్రా.
నూనె - 1 కేజీ, మెంతులు - 1/2 కప్పు
పసుపు - 4 చెంచాలు
బెల్లం కోరు - 8 కప్పులు
విధానము: కడిగి తుడిచి, తొక్క తీసి కోరుకోవాలి. పై పదార్థాలన్నీ బెల్లం కోరుతో సహా కలిపి మూడవ రోజున ఎండలో పెట్టాలి. ఇది బాగా ఎండాక పైనుంచి క్రిందకి కలిపి జాడీలో పెట్టాలి. ఏడాదిపైగా నిల్వ ఉంటుంది. దోశెలు, ఇడ్లీలకి, అన్నానికి ఎంతో రుచి. వెల్లుల్లి ఇష్టం ఉండే వెల్లుల్లి వేసుకోవచ్చును. బెల్లం మానెయ్యవచ్చును. ఆవ బదులు పెసర పిండి వేసి పెసర ఆవకాయ పెట్టుకుంటే చలువ చేస్తుంది.
*
మామిడి బిర్యానీ
మామిడికోరు - 4 కప్పులు
బియ్యం - 4 కప్పులు
మీల్‌మేకర్ - 1 కప్పు
బంగాళాదుంప ముక్కలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 6, జీడిపప్పులు - 24
బఠాణీలు - 1 కప్పు
బిర్యానీ మసాలా పొడి - 1 ప్యాకెట్
నెయ్యి - 1/4 కప్పు
లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క - 6
కుంకుమ పువ్వు - కొద్దిగా
విధానము: ముందుగా బియ్యం కడిగా వాడ్చెయ్యాలి. కుక్కర్‌లో నెయ్యి వేసి లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, జీడిపప్పు వేయించి, బంగాళా దుంప ముక్కలు, పచ్చిమిర్చి వేయించి, కడిగిన మీల్‌మేకర్, బఠాణీలు చేర్చి రెండు వేపులు రానిచ్చి, కడిగిన బియ్యం, మామిడికోరు, ఉప్పు చేర్చి 6 కప్పుల నీరు చేర్చి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపి చల్లార్చి మూత తీశాక బిర్యాని పొడి చల్లి, కుంకుమపువ్వు వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచి వడ్డించాలి.
*
మామిడి స్మూధి
మామిడి, బంగనపల్లి కాయ ముక్కలు - 4 కప్పులు, పాలు - 4 కప్పులు, ఏలకులు - 4
జీడిపప్పులు - 12, పిస్తా పప్పు - 12
బాదం పప్పులు - 12, పంచదార - 1/2 కప్పు
బెల్లం - 1/2 కప్పు
విధానము: మామిడి ముక్కలు పాలల్లో వేసి ఉడకనివ్వాలి. పప్పులకి 1 కప్పు నీరు చేర్చి మిక్సీ పట్టాలి. ఉడికిన పాలు, మామిడి ముక్కలు దింపి చల్లార్చి మిక్సీ పట్టి పై పదార్థాలన్నీ కలిపి, మిక్సీ పట్టి గ్లాసులో పోసి త్రాగండి. చల్లారాక ఫ్రిజ్‌లో పెట్టి త్రాగవచ్చు.
*
మామిడి
బట్టర్ డ్రింక్
గట్టి పెరుగు - 4 కప్పులు
మామిడి రసం - 2 కప్పులు
నిమ్మరసం - 5 చెంచాలు
తేనె - 1/2 కప్పు, పంచదార - 1/2 కప్పు
విధానము: ముందుగా మామిడి రసం పెరుగుకి పై పదార్థాలు చేర్చి మిక్సీ పట్టి ఐస్ ముక్కలు వేసి ఎండవేళ త్రాగితే మంచిది.
మామిడి జ్యూస్
పచ్చి మామిడి ఉడకబెట్టిన రసం - 2 కప్పులు
బెల్లం కోరు - 1 కప్పు, ఏలకులు - 5
కొబ్బరి నీరు - 2 చెంచాలు
పుదీనా రసం - 2 చెంచాలు
ఖర్జూరపు ముక్కలు - 1/2 కప్పు
విధానము: మామిడి రసంలో పంచదార పై పదార్థాలు కలిపి మిక్సి పట్టి ఐస్ ముక్కలు చేర్చి త్రాగండి.
మామిడి పెరుగు
పెరుగు - 4 కప్పులు
మామిడి రసం - 4 కప్పులు
బెల్లం - 1 కప్పు
కుంకుమ పువ్వు -1 చెంచా
ఏలకులు - 5, జీడిపప్పులు - 24
విధానము: పై పదార్థాలన్నీ పెరుగు, మామిడి రసానికి కలిపి, డీప్ ఫ్రిజ్‌లో గట్టిపడేలా ఉంచి కప్పులో సర్ది ఆరగించండి.

-ఎన్.వాణీ ప్రభాకరి