రుచి

కార్న్‌తో కమ్మగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు స్వీట్ కార్న్ అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. స్వీట్ కార్న్‌లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు డైటీషియన్లు, డాక్టర్లు. వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లైనా ఓ కప్పుడు స్వీట్ కార్న్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అందుకే ఈ వారం స్వీట్ కార్న్‌తో తయారయ్యే విభిన్న రుచులను పరిశీలిద్దాం.
కావలసిన పదార్థాలు
పాలకూర: రెండు కట్టలు
స్వీట్ కార్న్: రెండు కప్పులు
ఉల్లిపాయ: ఒకటి
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
పాలు: కప్పు
ఆవాలు: టీ స్పూన్
జీలకర్ర : టీ స్పూన్
ఎండుమిర్చి: ఒకటి
కరివేపాకు: నాలుగు రెబ్బలు
అల్లం వెల్లుల్లి: ఒక టీ స్పూన్
గరంమసాలా: టీస్పూన్
తయారీ విధానం
ముందుగా స్టవ్‌పై బాణలి పెట్టుకుని అందులో నూనె వేయాలి. కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇవి కూడా కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. పచ్చివాసన పోయాక ఇందులో కార్న్ వేసి వేయించాలి. కార్న్ మెత్తగా కావాలనుకునేవాళ్ళు ముందుగానే స్వీట్‌కార్న్‌ను ఉడికించుకుని తరువాత పోపులో వేయొచ్చు. క్రిస్పీగా, క్రంచీగా కావాలనుకుంటే నేరుగా పోపులో వేసుకుని వేయించవచ్చు. కార్న్ కొద్దిగా వేగాక ఇందులో తరిగిన పాలకూర, ఉప్పు వేయాలి. తరువాత దీనిలో పాలుపోసి బాగా ఉడికించాలి. దగ్గరగా అయ్యాక ఇందులో గరంమసాలా వేసి వేయించాలి. అంతే పాలక్ స్వీట్‌కార్న్ రెడీ. ఇందులో ఇంకా కమ్మదనం కోసం క్రీము, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఈ కూర రోటీల్లోకి, చపాతీల్లోకి బాగుంటుంది.
*
స్వీట్‌కార్న్ కరీ
కావలసిన పదార్థాలు
స్వీట్‌కార్న్: ఒకటిన్నర కప్పులు
ఉల్లిపాయ: ఒకటి
టొమాటో: ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీ స్పూన్
కొబ్బరిపాలు: అరకప్పు
పలావు ఆకు: ఒకటి
దాల్చినచెక్క: చిన్నది
లవంగాలు: మూడు
జీలకర్ర : అర టీ స్పూను, పసుపు: కొద్దిగా, కారం: టీ స్పూను, ధనియాల పొడి: టీ స్పూను
గరం మసాలా: కొద్దిగా, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, కొత్తిమీర: తగినంత
తయారీ విధానం
కార్న్‌ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అరకప్పు ఉడికించిన గింజల్ని నీళ్ళు వేయకుండా మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయ, టొమాటాలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్‌పై బాణలిని ఉంచి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కాగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ, టొమాటో ముక్కలు వేయాలి. ఇవి మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాణలిలో మిగిలిన నూనె వేసి పలావుకు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత రుబ్బి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, టొమాటో ముద్ద వేసి బాగా వేయించాలి. ఇప్పుడు దీనిలో రుబ్బి ఉంచుకున్న కార్న్ ముద్దను కూడా వేసి వేయించాలి. దీనికి పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి ఓ నిముషం వేయించాలి. చివరగా దీనిలో ఉడికించిన స్వీట్‌కార్న్, కొత్తిమీర వేసి రెండు నిముషాలు ఉంచి దించి సర్వ్ చేసుకోవాలి. ఇది అన్నం, చపాతీ, బిరియానీ.. దేనితో అయినా రుచిగానే ఉంటుంది.
*
మసాలా కార్న్
కావాలసిన పదార్థాలు
స్వీట్‌కార్న్: రెండు కప్పులు
టమోటాసాస్: రెండు టేబుల్ స్పూన్‌లు
బటర్ లేదా నెయ్యి: కొద్దిగా
చాట్‌మసాలా: ఒక టీ స్పూన్
సన్నగా తరిగిన కొత్తిమీర: ఒక టేబుల్ స్పూన్
ఉప్పు: తగినంత
తయారీ విధానం
ముందుగా స్వీట్‌కార్న్‌ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై బాణలి ఉంచి బటర్ లేదా నెయ్యి వేసి ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేయాలి. ఇందులో టమోటోసాస్, తగినంత ఉప్పు, చాట్ మసాలా వేసి బాగా కలపాలి. చివరగా ఇందులో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మసాలా స్వీట్‌కార్న్ రెడీ. సాయంత్రం పూట పిల్లలకు, పెద్దలకు మసాలా కార్న్ స్నాక్స్‌గా అందించవచ్చు.
*
కార్న్ రైస్
కావలసిన పదార్థాలు
అన్నం: కప్పు
ఉడికించిన స్వీట్‌కార్న్: ముప్పావు కప్పు
కొబ్బరి తురుము: పావు కప్పు
పచ్చిమిర్చి: రెండు
ఎండుమిర్చి: రెండు
సెనగపప్పు: ఒక టీ స్పూన్
మినపప్పు: ఒక టీ స్పూన్
కరివేపాకు: రెండు రెబ్బలు
మిరియాలపొడి: ఒక టీ స్పూన్
ఉప్పు: తగినంత
నెయ్యి: రెండు టీ స్పూన్‌లు
తయారీ విధానం
స్టవ్‌పై బాణలి ఉంచి అందులో నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక సెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చిని వేసి వేయించాలి. తరువాత కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, స్వీట్‌కార్న్, కరివేపాకు రెబ్బలు వేసుకుని వేయించుకోవాలి. స్వీట్‌కార్న్ వేగాక ఉప్పు, అన్నం వేసి బాగాకలపాలి. అన్నంలో పదార్థాలన్నీ బాగా కలిసాక మిరియాలపొడిని వేసి కలిపి రెండు నిముషాలు స్టవ్‌పై ఉంచాలి. తరువాత వేడిగా సర్వ్ చేసుకోవాలి.
*