రుచి

పెరుగుతో పలురకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరుగుతో పోయే ప్రాణాలను కూడా నిలుపవచ్చు అంటుంది ఆయుర్వేద శాస్త్రం.
వడదెబ్బ తగలకుండా వేసవిలో పలుచటి మజ్జిగ సేవించడం అందరికీ తెలిసిందే. ఆహారంలో పెరుగును పలురకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటే సంపూర్ణ ఆరోగ్యమే కాకుండా మనసుకు ఆహ్లాదమూ మానసికారోగ్యమూ మెరుగవుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. కనుక పెరుగుతో వైరైటీలు చేసి పిల్లల్ను పెద్దల్ను అలరించుదాం రండి.
*
ఆనపకాయ
పెరుగు పచ్చడి
ఆనపకాయ ముక్కలు - 2 కప్పులు
పెరుగు - 4 కప్పులు
ఆవగింజలు - 1 చెంచా
జీలకఱ్ఱ - 1 చెంచా, ఎండుమిర్చి - 2
కొత్తిమీర, పచ్చి కొబ్బరి - 4 చెంచాలు
ఉప్పు - 1 చెంచా, పసుపు - 1/2 చెంచా
నెయ్యి - 2 చెంచాలు
మెంతులు - 1/2 చెంచా
విధానం: పెరుగుకి ఉప్పు, పసుపు, తిరిగి కొత్తిమీర, నూరిన ఆవ చేర్చి కలిపి మూతపెట్టాలి. తరిగిన ఆనప ముక్కలు, కొంచెం ఉప్పు చేర్చి ఉడికించి చల్లార్చి నీరు పిండి పెరుగుకి కలపాలి. నేతిలో జీలకఱ్ఱ, ఎండుమిర్చి, కొబ్బరి, మెంతులు వేయించి కలిపి పది నిమిషాలు అట్టే ఉంచి ఆనక అన్నంలో వడ్డించాలి. ఊరాక పుల్లగా రుచిగా ఉంటుంది.
*
పొట్లకాయ
పెరుగు పచ్చడి
పొట్లకాయ ముక్కలు - 2 కప్పులు
పెరుగు - 4 కప్పులు
అల్లంకోరు - 2 చెంచాలు
ఎండుమిర్చి - 2, నెయ్యి - 1 చెంచా
ఆవాలు, జీలకఱ్ఱ, మినపప్పు,
శెనగపప్పు - 1/2 చెంచాలు
కరివేప - కొంచెం, ఉప్పు, పసుపు - 1 చెంచా
విధానం: కొంత పసుపు పొట్లకాయ ముక్కలకి చేర్చి ఉప్పు చేర్చి ఉడికించి చల్లార్చి, పిండి గినె్నలో పెట్టండి. నేతిలో పోపులు వేయించి అల్లం చేర్చి ఈ ముక్కలకి కలపండి. మిగిలిన ఉప్పు, పసుపు, కరివేప పెరుగుకి చేర్చి పై ముక్కలకి కలిపి పది నిమిషాలు ఊరాక వడ్డించాలి.
*
టమోటా
పెరుగు చట్నీ
దోర టమోటాలు - 6
కరివేప - కొంచెం
పెరుగు - 5 కప్పులు
ఉప్పు - 1 1/2 చెంచా
ఆవాలు, మెంతులు, జలకఱ్ఱ - 1 చెంచా
మినపప్పు, శనగపప్పు - 2 చెంచాలు
పచ్చిమిర్చి - 4 కొబ్బరి - 1/2 కప్పు నిమ్మరసం - ఒక కాయది
పసుపు - 1/2 చెంచా నెయ్యి - 5 చెంచాలు
విధానం: ముందుగా టమోటాలు తరిగి బాణలిలో 2 చెంచాలు నెయ్యి వేసి మగ్గించి పసుపు మిర్చి చేర్చి ఉడికించి దింపి చల్లార్చాలి. పెరుగుకి కొబ్బరి వేయించిన నేతి పోపు చేర్చి కలిపి చల్లార్చిన టమోటాలని కలిపి నిమ్మరసం చేర్చి మూత పెట్టాలి. అరగంట తర్వాత తినాలి.
*
తోటకూర
పెరుగు పచ్చడి
తోటకూర తరిగినది - 4 కప్పులు
పెరుగు - 2 కప్పులు, ఎండుమిర్చి - 4
మెంతులు, ఆవాలు, జీలకఱ్ఱ - 1 చెంచా, నెయ్యి - 1 చెంచా
ఉప్పు - 1/2 చెంచా
పసుపు - కొంచెం
విధానం:తోటకూర ఉడికించి చల్లార్చాలి. పోపులు వేయించి దానిలో ఈ కూర వేసి మగ్గించి చల్లార్చాలి. దీనికి ఉప్పు, పెరుగు వేసి కలిపి ఒక గంట ఊరాక తింటే రుచి!
*
సలాడ్స్:
ఖీరా, దోస, క్యాబేజీ, టమోట, చిలగడ దుంప- వీటిని ఉపయోగిస్తూ పెరుగుతో చేసే సలాడ్స్ రుచికి రుచిని, ఆరోగ్యాన్నిస్తాయ.
కావాల్సినవి: నిమ్మరసం - 1/2 కప్పు,
సన్నగా తరిగిన కాయగూరలు తరుగు ఏదైనా సరే - 4 కప్పులు,
కొత్తిమీర తరుగు - 1/2 కప్పు, ఉప్పు - 1 చెంచా,
మిరియాల పొడి - 1/2 చెంచా.
విధానం :పై కాయల తరుగులో కొత్తిమీర, ఉప్పు, మిరియాలు, నిమ్మరసం కలిపి ఒక గంట ఊరనిచ్చి తినండి. కారం ఇష్టముంటే పచ్చిమిర్చి వాడండి. చలువ చేసే వంటకం. బ్రేక్‌ఫాస్ట్‌కు మంచిది.

-ఎన్.వాణీప్రభాకరి