రుచి

మాంగో ఫలూడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: పాలు: ఒకటిన్నర కప్పు, పంచదార: ఐదు టేబుల్ స్పూన్లు
సబ్జాగింజలు: ఒక టేబుల్ స్పూన్, సేమ్యా: ఒక కప్పు
మామిడిపండు గుజ్జు: ఒకటిన్నర కప్పు, మాంగో ఐస్‌క్రీ మ్ : రెండు స్కూప్స్
మామిడిపండు ముక్కలు: ఒక కప్పు, పిస్తా, బాదంపప్పు, చెర్రీస్
తయారీ విధానం: ముందుగా పాలను కాచి అందులో పంచదార కలిపి చల్లార్చి ఫ్రి జ్‌లో పెట్టాలి. తరువాత సబ్జా గింజల్ని నానబెట్టాలి. మామిడిపండు తొక్కతీసి ఒక కప్పు ముక్కలను పక్కన పెట్టుకుని మిగిలిన ముక్కలను గుజ్జులా చేసుకోవాలి. సేమ్యాను ఉడికించి చల్లార్చుకోవాలి. ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకుని అందులో ముందుగా మామిడిపండు ముక్కలు, తరువాత సబ్జాగింజలు వాటిపై మామిడిపండు గుజ్జు, తరువాత సేమ్యా, ఐస్‌క్రీమ్, మామిడిపండు గుజ్జు, అన్నింటికంటే పైన డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ వేసుకుని అలంకరించుకుని సర్వ్ చేయాలి. అంతే చల్లచల్లని మామిడి ఫలూడా రెడీ.
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003