రుచి

కొత్తిమీర ఆవకాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తిమీర తరిగినది-12 కప్పులు, కారం-2 కప్పులు, ఆవపిండి-1కప్పు, నూనె-2 కప్పులు, ఉప్పు-1కప్పు, వెల్లుల్లి రేకలు-2 గడ్డలవి, కొబ్బరి కోరు-2 చెంచాలు, మెంతులు-1 చెంచా, పచ్చిమిర్చి -26, చింతపండు- చిన్న చిన్న ముక్కలు చేసింది- 2 కప్పులు.
విధానం: ముందుగా కొత్తిమీర కడిగి తరిగి ఆరనివ్వాలి. బాగా ఆరాక దాన్ని ఒక డబ్బాలో కొంత వెయ్యాలి. దానిపై కారం, ఆవపిండి, ఉప్పు కలిపినది కొంత వేసి నూనె 2 చెంచాలు వెయ్యాలి. అలా మొత్తం కొత్తిమీర 5 వరుసలుగా సర్ది, పైన వెల్లుల్ని రేకలు, ఎండుకొబ్బరి కోరు 2 చెంచాలు వేసి మొత్తం నూనె అంతా పోసి మూత పెట్టాలి. మరునాడు దీన్ని బాగా కలపాలి. మూడవ రోజున వడ్డించాలి. ఇది గాజు సీసాలవంటి వాటిలో వేస్తే మంచి రుచిగా వుంటుంది. చక్కగా ఈ తరహా ఆవకాయ ఆరు నెలలు ఉంటుంది. ఎక్కువ కాలం ఇష్టపడే వారు పచ్చి మిర్చి సన్నగా తిరిగి కలపాలి. పప్పులోకి పొడులకి నంచుకొని తినడానికి బాగుంటాయి.