రుచి

రాగి, చాక్లెట్ మిల్క్‌షేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: రాగిపిండి: రెండు స్పూన్‌లు , నీళ్ళు: తగినన్ని , పాలు: అరలీటరు ,చాక్లెట్ పౌడర్ లేదా డార్క్ చాక్లెట్, పంచదార: తగినంత, డ్రై ఫ్రూ ట్స్
తయారీ విధానం: ముందుగా పాలను కాచి చల్లార్చాలి. వీలైతే ఫ్రిజ్‌లో పెట్టేస్తే మిల్క్ షేక్ చల్లగా ఉంటుంది. తరువాత రాగిపిండిలో నీటిని కలుపుకుని స్టవ్‌పైన సిమ్‌లో ఉంచాలి. రాగిపిండి దగ్గరిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. తరువాత దీనిలో చాక్లెట్ పౌడర్‌కానీ, ఏదైనా డార్క్ చాక్లెట్‌ను వేసి బాగా కలపాలి. స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. మిక్సీజార్‌లో రాగి, చాక్లెట్ మిశ్రమం, పంచదార, పాలు వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఇంకా చల్లదనం కావాలనుకునేవారు ఐస్‌క్యూబ్స్ కూడా కలుపుకుని గ్లాసుల్లోకి తీసుకుని డ్రైఫ్రూట్స్ పలుకులతో అలంకరించుకోవాలి. అంతే ఎంతో శక్తినిచ్చే చల్లచల్లని రాగి, చాక్లెట్ మిల్క్‌షేక్ రెడీ.