రుచి

పిల్లలకు బ్రెడ్ విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు పిజ్జా అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే.. కానీ రోజూ బయట పిజ్జాలు కొనాలంటే డబ్బు ఖర్చు.. తింటే వారి ఆరోగ్యం పాడవుతుంది. వీటికి విరుగుడు పదార్థమే ఈ బ్రెడ్ పిజ్జా. ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. పైపెచ్చు ఆరోగ్యం కూడా. రోజూ బ్రెడ్ పిజ్జానే కాకుండా టాపింగ్స్ మారుస్తూ పిల్లలకు ఆకర్షణీయంగా ఉండేలా.. వారికి మంచి పోషణ అందేలా ఉండే కొన్ని బ్రెడ్ పిజ్జాలను చూద్దాం.
*
కూరగాయలతో..
కావలసిన పదార్థాలు: బ్రెడ్‌స్లైసులు
ఉప్పు కలపని వెన్న: రెండు స్పూన్‌లు
చీజ్ తురుము: అరకప్పు
పిజ్జా సాస్: పావు కప్పు
ఉప్పు: తగినంత, మిరియాల పొడి: కొద్దిగా
ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి
క్యాప్సికం: ఒకటి
తయారీ విధానం: ముందుగా టొమాటో, ఉల్లిపాయ, క్యాప్సికంలను పొడవుగా, ముక్కలుగా కోసుకోవాలి. ఇవేకాకుండా ఎవరి రుచికి అనుగుణంగా వారు రకరకాల టాపింగ్స్‌ను ఉపయోగించుకోవచ్చు. అంటే పనీర్, ఆలివ్స్.. వంటివి అన్నమాట. తరువాత ఒకబ్రెడ్‌స్లైసును తీసుకుని కొద్దిగా వెన్న రాసి దానిపైన పిజ్జా సాస్‌ను పూర్తిగా రాయాలి. దీనిపై తరిగిపెట్టుకున్న కూరగాయ ముక్కలను పరచాలి. వీటిపై కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి, చీజ్‌ను వేయాలి. వీటన్నింటినీ ఒవెన్‌లో ఉంచి మూడు, నాలుగు నిముషాలు బేక్ చేస్తే సరిపోతుంది. ఒవెన్ లేనివాళ్ళు నాన్‌స్టిక్ పెనంపై కొద్దిగా బటర్ వేసిబ్రెడ్‌స్లైసులు ఉంచి పైన మూతపెట్టి రెండు నిముషాలు ఉంచితే సరిపోతుంది. అయితే స్టవ్ సిమ్‌లో ఉంచుకుని రెండు నిముషాలు ఉంచాలి. లేకపోతే బ్రెడ్‌స్లైసులు మాడిపోతాయ. అంతే వేడి వేడి బ్రెడ్ పిజ్జా రెడీ. ఇవి వేడివేడిగా తింటే బాగుంటాయి.
*
చాక్లెట్, పండ్లతో..
కావలసిన పదార్థాలు: బ్రెడ్‌స్లైసులు
చాక్లెట్ స్ప్రెడ్: రెండు స్పూన్‌లు
కండెన్స్‌డ్ మిల్క్: రెండు స్పూన్‌లు
అరటి పండ్లు: రెండు
దానిమ్మ గింజలు: పావుకప్పు
స్టా బెర్రీస్: ఐదు, పైనాపిల్ ముక్కలు: కొన్ని
జీడిపప్పు: పది, చెర్రీస్: రెండు స్పూన్‌లు
కిస్‌మిస్‌లు: రెండు స్పూన్‌లు
తయారీ విధానం: ముందుగా బ్రెడ్‌స్లైసులను వేడిచేసుకుని దానిపై చాక్లెట్ సాస్ రాయాలి. తరువాత వీటిపై పండ్లముక్కలు, నట్స్‌వేసి అలంకరించుకోవాలి. తరువాత వీటిపై కండెన్స్‌డ్ మిల్క్ వేయాలి. అంతే చాక్లెట్, ఫ్రూట్ పిజ్జా
తయారు.
*
పాలకూరతో..
కావలసిన పదార్థాలు: బ్రెడ్‌స్లైసులు
పాలకూర: ఒక కట్ట, స్వీట్‌కార్న్: అరకప్పు
చీజ్: అరకప్పు, వెలుల్లి రెబ్బలు: నాలుగు
బటర్: రెండు స్పూనులు, ఉప్పు: తగినంత
మిరియాలపొడి: కొద్దిగా
తయారీ విధానం: ముందుగా పాలకూరను శుభ్రం చేసుకుని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలిని ఉంచి బటర్ వేయాలి. ఇది కరిగిన తరువాత వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పాలకూర వేయాలి. ఇది కాస్త మగ్గాక ఇందులో ఉప్పు వేసి పైన కొద్దిగా నీళ్లు చిలకరించాలి. పాలకూర బాగా ఉడికి దగ్గర పడ్డాక దీనిలో స్వీట్ కార్న్ వేయాలి. ఇది మొత్తం దగ్గరగా వచ్చాక స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు బ్రెడ్‌స్లైసులకు కొద్దిగా బటర్ రాసి వీటిని దోరగా వేయించాలి. తరువాత వీటిపై పాలకూర మిశ్రమాన్ని, చీజ్ తురుమును పరచాలి. తరువాత వీటిని ఒవెన్‌లో కానీ పెనంపై కానీ ఉంచాలి. ఈ సమయంలో స్టవ్‌ను సిమ్‌లో ఉంచాలి. చీజ్ కొద్దిగా కరిగాక స్టవ్ కట్టేయాలి. అంతే పాలకూర పిజ్జా రెడీ.
*
బేబీకార్న్‌తో..
కావలసిన పదార్థాలు: బ్రెడ్‌స్లైసులు
పిజ్జా సాస్: అరకప్పు, చీజ్: అరకప్పు
ఉల్లిపాయలు: రెండు, కాప్సికం: ఒకటి
టొమాటో: ఒకటి, బేబీకార్న్: నాలుగు
ఆలివ్‌లు: నాలుగు
బటర్: కొద్దిగా, ఉప్పు: తగినంత
తయారీ విధానం: ముందుగాబ్రెడ్‌స్లైసులకు రెండు వైపులా బటర్ రాసుకుని దోరగా కాల్చుకోవాలి. తరువాత వీటిపై పిజ్జాసాస్ పూయాలి. కూరగాయలన్నింటినీ సన్నగా తరిగిన తరువాత వీటిని పిజ్జాసాస్ పూసిన బ్రెడ్‌స్లైసులపై పరచాలి. వీటిపై చీజ్ తురుము, ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలిని ఉంచాలి. స్టవ్‌ను సిమ్‌లో ఉంచాలి. బాణలిలో తయారుచేసుకున్న పిజ్జా స్లైసులను ఉంచి మూత పెట్టాలి. చీజ్ కరిగిన తరువాత స్టవ్‌ను ఆపేయాలి. అంతే బేబీకార్న్ పిజ్జా రెడీ.