రుచి

కిరణీ పండుతో జ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరణీపండునే తర్భూజా అనీ అంటారు. ఇవి వేసవికాలంలో చీప్‌గా దొరుకుతుంటాయి. వీటితో చేసిన జ్యూస్ కంటికి, ఒంటికి మేలు చేస్తుంది.
కావాల్సిన పదార్థాలు:
కిరణీపండ్లు - రెండు , చక్కెర - 2 స్పూన్స్, ఐస్ క్యూబ్స్ - తగినన్ని
తయారు చేసేవిధానం: కిరణీపండును తొక్క తీసి రెండు భాగాలుగా చేసుకోవాలి. వీటి మధ్యలో ఉన్న గింజలను వేరు చేయాలి. ఈ పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ లోవేసుకొని పేస్టుతయారు చేసుకోవాలి. దీనికి చక్కెరను కలుపాలి. సర్వ్ చేసేటపుడు ఐస్‌క్యూబ్స్‌ను జోడించాలి. చల్లచల్లగా తీయతీయగా కిరణీపండు జ్యూస్ తాగడానికి రెడీ .
గమనిక: ఈ పండులోంచి వేరు చేసిన గింజలను ఎండలో ఆరబెట్టుకుని వీటికి తొక్క తీసి లోపలి పప్పులనుజాగ్రత్త చేసుకుని స్వీట్స్ తయారీలో వీటిని ఉపయోగిస్తే రుచికి రుచిగాను, చూడడానికి అందంగా ఉంటాయి.
*

మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003