రుచి

గోధుమతో వెరైటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోధుమ పిండితో పుల్కాలు, పూరీలు, చపాతి, పరోటాలు సాధారణంగా చేస్తూనే ఉంటాం. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే కొన్ని వంటకాలు చేసుకోవచ్చు. రైస్ కన్నా గోధుమలతో చేసిన వంటకాలు అందరూ ఇష్టపడుతుంటారు కూడా. గోధుమ పిండితో లడ్డ్డూలు, తీపి దోశె, కారం దోశె, తీపి పొంగడాలు, కారం పొంగడాలు, మడత పూరీలు, కాజాలు వంటివి చేద్దాం రండి.
గోధుమ లడ్డూలు
గోధుమ రవ (సన్ననిది) - 4 కప్పులు,
పంచదార -3 కప్పులు
నెయ్యి - 2 కప్పులు, ఏలకులు - 8,
జీడిపప్పులు - 16,
బాదం పప్పులు - 16, కిస్‌మిస్‌లు - 24,
ఎండుకొబ్బరి - 1 కప్పు
ముందుగా గోధుమ రవ్వను దోరగా నెయ్యి కొంచెం వేసి వేయించాలి. రవ్వను పంచాదారను కలిపి కొద్దిగా మిక్సీ పట్టాలి. బాదం, జీడిపప్పు దోరగా వేయించి ఏలకులు చేర్చి కచ్చాపచ్చగా మిక్సీ పట్టాలి. అన్నీ కలిపి ఈ పిండిలో చేర్చి బాగా కలపాలి. మిగతా నెయ్యి చేర్చి లడ్డూలుగా కట్టుకోవాలి. మెత్తగా ఉండే ఈ లడ్డూలు ఆరోగ్య రీత్యా చాలా మంచిది. పంచదారకు బదులు బెల్లం కూడా చేర్చుకోవచ్చు. బెల్లంతో చేసిన లడ్డులనూ షుగర్ పేషెంట్స్‌కు కూడా తినొచ్చు.
కారం పొంగడాలు
బియ్యం పిండి - 1 కప్పు,
గోధుమ పిండి - 2 కప్పులు
ఉప్పు - 2 చెంచాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 4 చెంచాలు,
నూనె - 1/2 కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు
సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు (తగినంత)
సోడా - 1/2 చెంచా, పెరుగు - సరిపడినంత
బియ్యం, గోధుమ పిండ్లకు పెరుగు చేర్చి బజ్జీల పిండిమాదిరి కలుపుకోవాలి. దీనిలో జీలకర్ర, అల్లం వెల్లువి పేస్టు, పచ్చిమిరప, ఉల్లిపాయల ముక్కలు అన్నీ చేర్చి, ఉప్పు , సోడా కలుపుకోవాలి. పొంగడాలు గుంటకు నూనె రాసి ఈ పిండిని పోసి మూత పెట్టి స్టవ్ పైన సన్నని సెగతో కాల్చుకోవాలి. పొంగడాలు కొద్ది సేపటికి ఎర్రగా కాలి మంచి వాసన వస్తాయ. అపుడు తిరగవేసి మళ్లీ కొద్ది సేపు కాల్చుకుని వీటిని వేరే పళ్లెంలోకి తీసుకోవాలి. ఒకవేళ పొంగడాల పెనం లేకపోతే దోసె పెనం మీద కాస్త లావుగా అంటే వూతప్పం మాదిరి వేసుకొని కాల్చుకుంటే ఎంతో బాగుంటాయ.
తీపు దోశెలు
గోధుమ పిండి - 2 కప్పులు,
బియ్యం పిండి - 4 చెంచాలు
మెత్తని బెల్లం - 1 కప్పు, ఏలకులు - 5
కొబ్బరికోరు - 5చెంచాలు
జీడిపప్పు, బాదం పప్పులు పొడి - 5 చెంచాలు
ఏలకులు - 5, కొబ్బరి కోరు - 5 చెంచాలు
జీడిపప్పు, బాదం పప్పు పొడి - 5 చెంచాలు
నెయ్యి - 1/4 కప్పు, కిస్‌మిస్‌లు - 24
సోడా - 1 చెంచా, పాలు - 1 కప్పు
ముందుగా పిండిలో అన్నీ కలిపి పాలు పోసి సోడా చేర్చి కొంచెం నీరు చేర్చుతూ దోశెల పిండిలా కలపాలి. ఈ పిండిని దోసెలపెనం మీద వేయాలి. సన్నని సెగమీద కాల్చాలి. చిన్న పిల్లలకు పెద్దవారికి కూడా ఇవి ఎంతో బాగుంటాయ.
మసాలా దోసె
కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి - 4 కప్పులు
బియ్యం పిండి - రెండు కప్పులు
గోధుమ రవ్వ (ఉప్మారవ) - ఒక కప్పు
పెరుగు - సరిపడినంత
దోసెలు వేయడానికి సరిపడినంత నూనె
తయారు చేసే విధానం : పిండిని పెరుగుతో కలుపుకుని ఓ గంటపాటు నిలువపెట్టాలి. ఆ తరువాత గరిటజారుగా చేసుకొని పెనాన్ని వేడి చేసి దోసెలు వేసుకోవాలి. ఇవి ఒకవైపు కాల్చితే సరిపోతాయ. వీటి మీద కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలంకరించుకుంటే బాగుంటుంది.
*