రుచి

పుల్లపుల్లగా కమ్మకమ్మగా ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారు భోజన ప్రియులు. భారతదేశంలో ఎక్కడాలేని వంటకాలు ఒక్క తెలుగు రాష్ట్రాల్లో నే ఉంటాయి. నానారకాల రుచులు కావాలంటే తెలుగు వారింట్లో దొరుకుతాయి. అందులోను ఈ వర్షాకాల ఆరంభంలో దొరికే చింత చిగురుదొరికిం దంటే చాలు దాంతో చింత చిగురు పులుసుకూర, పప్పుకూర ఇలా ఎన్నో వెరైటీస్ చేసుకుంటాం కదా. అదిగో ఆ పుల్లపుల్లటి చింత చిగురు తో కొనిన వంటకాలు చూద్దాం.

చింత చిగురుతో కుడుములు
బియ్యపురవ 2 కప్పులు
చింతచిగురు 2 కప్పులు
కొబ్బరి కోరు 2 కప్పులు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
శనగపప్పు- 1 టేబుల్‌స్పూన్
మినపప్పు - 1 టేబుల్‌స్పూన్
మిరియాల పొడి - 1 టేబుల్‌స్పూన్
కరివేపాకు రెమ్మలు - 2
ఉప్పు - తగినంత
నూనె - 1 టేబుల్ స్పూన్
నీళ్లు తగినంత
తయారీ విధానం : ముందుగా వెడల్పాటి గినె్నలో నీరు పోసి మరిగించాలి. వేరే స్టవ్ పైన బాణలిలో నూనెవేసి కాగనిచ్చి అందులో పోపు దినుసులు వేసి అవిచిటపట లాడాక వాటిని మరుగుతున్న నీటికి చేర్చాలి. ఇందులోనే మిరియాల పొడిని, ఉప్పును కూడా చేర్చాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యపురవ, చింత చిగురు వేసి కలయబెట్టాలి. ఆ మిశ్రమం దగ్గరవుతున్నపుడు బియ్యపురవ మెత్తగా ఉడుకు బట్టాక కొబ్బరి కోరు వేసి దింపేయాలి.
ఇపుడు ఈ మిశ్రమం కాస్త చల్లారాక చిన్న చిన్న ఉండలుగా కాని, కుడుముల ఆకారంలోకాని చేసి ఇడ్లీ స్టాండులో పెట్టి ఆవిరికి ఉడికించుకోవాలి. బాగా ఆవిరి వచ్చేదాక చూసి దింపేయాలి. వీటిని చేతితో పట్టుకుంటే పిండి చేతికి అంటకుండా ఉంటే బాగా ఉడికినట్లే.
వీటిని కొత్తిమీర చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. పుల్లపుల్లగా కమ్మకమ్మగా చింత చిగురు కుడుములు పిల్లలకు, పెద్దలకు నచ్చుతాయి.

మజ్జిగ పులుసు
కావలసిన పదార్థాలు:
శనగపప్పు - 1 కప్పు
కందిపప్పు - 1 కప్పు
ధనియాలు - 2 స్పూన్స్
చింతచిగురు - 2 కప్పులు
పుల్ల మజ్జిగ - 2 కప్పులు
పచ్చిమిరిప కాయలు - 5
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
కొత్తిమీర ,కరివేపాకు కాస్తంత
తయారు చేసే విధానం:
ముందుగా శనగపప్పు, కందిపప్పు ధనియాలు నానబెట్టుకుని రుబ్బుకోవాలి.ఈ పప్పు ముద్దలోనే పచ్చిమిరపను కూడా చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో చింతచిగురును ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. పుల్ల పెరుగును తీసుకొని (అంతగా పులుపు లేకపోయినా పెరుగు ఫర్వాలేదు) బాగా చిలికి కావసినంత నీరు కలిపి దానికి పప్పు ముద్దను, చింతచిగురును కలపాలి. కాస్త పసుపు ఉప్పును కూడా చేర్చాలి. బాగా కలిపిన తరువాత సన్నని సెగపైన మజ్జిగను పెట్టాలి. ఇవి బాగా మరిగిన తరువాత కరివేపాకు, కొత్తిమీర రెండూ చేర్చి, దించుకోవాలి. చింతచిగురు మజ్జిగపులుసు రెడీ. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది.

తియ్య దుంపల పులుసు
కావలసిన పదార్థాలు:
చిలగడ దుంపలు - 4
చింత చిగురు పేస్టు - 1 కప్పు
ఉప్పు తగినంత
పులుసుపొడి కోసం
మినపప్పు - 2 స్పూన్స్
శనగపప్పు -2 స్పూన్స్
ధనియాలు - 2 స్పూన్స్
మెంతులు - 2 స్పూన్స్
ఆవాలు - 1 స్పూన్
ఎండుమిరప కాయలు - తగినన్ని
వీటి అన్నింటిని నూనె లేకుండా వేయించి మిక్సీలో పొడి చేసుకోవాలి.
తయారీ విధానం: ముందుగా చిలగడ దుంపలను కుక్కర్‌లో ఉడికించుకోవాలి. చింతచిగురు పేస్టుకు తగినన్ని నీటిని చేర్చాలి. స్టవ్‌పై పెట్టి కాస్త వేడెక్కాక వీటికి దుంపలను చేర్చాలి. ఇందులోముందుగా చేసి పెట్టుకొన్న పులుసు పొడిని చేర్చుకోవాలి. ఇపుడు సన్నని సెగ మీద ఈ చింత చిగురు దుంపల పులుసు మరగనివ్వాలి. బాగా మరిగి చిక్కగా వచ్చేటపుడు కోరుకుంటే కాస్త ఇంగువ, కరివేపాకు చేర్చి దించుకోవాలి. ఈ తియ్య దుంపల చింతచిగురు పులుసు అన్నంలోకి పుల్లపుల్లగా తియ్యతియ్యగా రుచిగా ఉంటుంది.

బియ్యపు రొట్టె
కావలసిన పదార్థాలు:
బియ్యపు పిండి - కప్పులు
చింత చిగురు - 1 కప్పు
ఎండు మిరప పొడి - 1 స్పూన్
ఉప్పు తగినంత , నీరు తగినంత
తయారీ విధానం: ముందుగా బియ్యపు పిండిని, చింతచిగురును కలిపి నీరు పోసి చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. దీనికి ఉప్పు మిరపప్పొడిని కూడా చేర్చుకోవాలి. ఓ ఐదునిముషాలు తడిబట్టలో పెట్టాలి. ఆ తరువాత పెనం వేడి చేసుకొని ఈ చింతచిగురు కలిపిన బియ్యపు పిండిని చేత్తో రొట్టెలాగా చేసుకొంటూ పెనం మీద వేయాలి. కాస్త నూనెను రొట్టె చివర్లకు చేర్చి రెండు పక్కలా కాల్చుకోవాలి. ఇది మధ్యాహ్నం స్నాకుగా పిల్లలకు పనికి వస్తుంది. పెద్దలుకూడా దీన్ని ఇష్టపడుతారు.

-వాణి ప్రభాకరి