రుచి

మొక్కజొన్నలతో వెరైటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిటపట చినుకులు పడుతుంటే.. చెప్పలేని హాయి... అనే సినిమా పాటే కాదు. చిటపట చినుకులు పడుతుంటే చాలు రోడ్డుపక్కన వేడి వేడి నిప్పుల మీద మొక్కజొన్న కండెలు కాల్చి మంచిసువాసనతో ఇస్తుంటే పరుగు పరుగున వెళ్లి వాటిని తెచ్చుకుని పిల్లలే కాదు పెద్దలూ సంతోషంగా తింటారు. మొక్కజొన్న పొత్తులు తినని వారు అరుదుగా ఉంటారు. నేటి పిల్లలకు మొక్కజొన్న పొత్తులు తినడానికి అంత టైము దొరకడం లేదు. అందుకే అమ్మలంతా మొక్కజొన్నవిత్తులతో నానారకాల పుడ్‌ఐటమ్స్ చేసి వారికి ఇస్తున్నారు. కేవలం కమ్మగా ఉందని తినడం కాదు ఈ మొక్కజొన్నలో ఎన్నో పోషకాలున్నాయి. అందుకే ఈ మొక్కజొన్నవిత్తులతో కొన్ని ఐటమ్స్ చూద్దాం రండి...

గారెలు

కావలసిన పదార్థాలు : మొక్కజొన్న విత్తులు : నాలుగు కప్పులు, శనగపిండి లేదా, బియ్యపు పిండి: రెండు కప్పులు, నూనె : గారెలు కాల్చడానికి సరిపడినంత, ఉప్పు : తగినంత, అల్లం : చిన్న ముక్క, పచ్చి మిరప : 8, సన్నని ఉల్లి తరుగు : 2 కప్పులు

తయారు చేయువిధానం: ముందుగా మొక్కజొన్న కండెల నుంచి విత్తులను వేరుచేసుకోవాలి. లేతగా ఉన్న ఆ విత్తులను మిక్సీలో వేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యేట్టుగా చేసుకొని విడిగా తీసుకోవాలి. అల్లం, పచ్చి మిరపనుకూడా సన్నగా తరుక్కోవాలి. ఇపుడు విత్తులతో చేసుకొన్న పిండికి అల్లం , మిరప, ఉల్లి ముక్కలను చేర్చుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని గారెల్లాగా అరచేతిలో కాని లేక పాలకవర్‌పై గాని రౌండ్‌గా చేసుకోవాలి. మధ్యలో చిల్లు కావలసిన వారు పెట్టుకోవచ్చు. లేదా పెట్టుకోకపోయినా ఫర్వాలేదు. ఇలా గారెల్లాగా చేసుకొన్న పిండిని బాగా కాగిన నూనెలోవేసి ఎర్రగా కాలేదాగా చూసి నూనెనుంచి వేరుగా తీసుకోవాలి. ఇపుడు వేడి వేడి గారెలు రుచిగా ఉంటాయి. వీటిని అల్లం చట్నీతో కాని టమాటాసాస్‌తో గాని తినవచ్చు.

మసాలా

కావలసిన పదార్థాలు: మొక్కజొన్న విత్తులు : 1 కప్పు, శనగపప్పు, మినపప్పు: వాలు:, (కొద్దిగాపోపుకు) నూనె:, తగినంత లవంగాలు:6, ధనియాలు : 1 స్పూన్, ఏలకులు: 6, జీలకర్ర : 1 స్పూన్
మిరియాలు: 1 స్పూన్ , దాల్చిన చెక్క : చిన్న ముక్క, కరివేపాకు : రెండు రెమ్మలు, ఉల్లిపాయ: తరుగు 1 కప్పు, వెల్లుల్లి: తరుగు 1 స్పూన్, అల్లం : తరుగు 1 స్పూన్, కొబ్బరి తరుము: 1 కప్పు, చింతపండు రసం :2 రెండు స్పూన్స్ , ఉప్పు : తగినంత, నూనె : 2 స్పూన్స్, బెల్లం : తరుగు రెండు స్పూన్స్, గరంమసాలా: 1 స్పూన్, నిమ్మరసం : 1 స్పూన్ నీరు: కావలసినంత

తయారీ విధానం: ముందుగా లవంగాలు,్ధనియాలు, ఏలకులు, జీలకర్ర, ధనియాలు,దాల్చిన చెక్క, మిరియాలు ఇవి అన్ని కలిపి సన్నని సెగ పైన వేయించుకొని పొడి చేయాలి. స్టవ్ పైన బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె కాగిన తరువాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసి అవి చిట పటలాడాక ఉల్లితరగు, అల్లం, పచ్చి మిర్చి తరుగు వేసుకోవాలి. ఉల్లి ఎర్రగా వాడాక అందులోచింతపండు రసం వేసి చేసిపెట్టుకొన్న మసాల పొడి సగం వేయాలి.కరివేపాకును చేర్చాలి. అందులోనే మొక్క జొన్నవిత్తులు వేసుకోవాలి. బాణలికి మూతపెట్టి సన్నగా మగ్గనివ్వాలి. కాసిని నీరు కూడా చేర్చితే మొక్కజొన్నవిత్తులు బాగా మెత్తగా ఉడుకుతాయి. మొక్కజొన్న విత్తులు ఉడికాయి అనుకోగానే అందులోకి కారం, మిగతా మసాలా పొడి,నిమ్మరసం, బెల్లం,ఉప్పు గరం మసాలా చేర్చి దించుకోవాలి. వేడి వేడిగా మసాలా కార్న్ రెడీ
కార్న్‌తో కర్రీ
కావలసిన పదార్థాలు: కార్న్ : రెండు కప్పులు, ఉల్లిపాయ: 1 , టమాటా: 7, కొబ్బరి పాలు: అరకప్పు, పలావు ఆకు: 1, దాల్చిన చెక్క: చిన్న ముక్క, లవంగాలు: 3 జీలకర్ర: 1స్పూన్, పసుపు: 1 స్పూన్, కారం : 1 స్పూన్, ధనియాల పొడి : 1 స్పూన్, గరం మసాలా: 1స్పూన్, నూనె : 2 స్పూన్స , ఉప్పు : తగినంత

తయారీ విధానం : మొక్కజొన్న విత్తులను ముందుగా ఉడికించుకోవాలి. ఇందులో సగం మొక్కజొన్న విత్తులను వేరుగా చేసి మెత్తగా ఉడికించుకోవాలి. బాణలిలో ఉల్లి పాయ, టమాటో ముక్కలను వేసి మెత్తగా ఉడికించుకోవాలి. వీటిని విడిగా తీసుకుని మిక్సీలో మెత్తటి పేస్టు చేసుకోవాలి. బాణలిని వేడి చేసి నూనె వేసి అందులో జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి వేగాక అందులో ఉల్లి టమాట పేస్టును, మొక్కజొన్న పేస్టును కలపాలి. కాసిని నీటిని చేర్చాలి. ఇవి ఉడుకుతుండగా గరంమసాలా, ఉప్పు కారం, పసుపు, పలావు ఆకు, కొబ్బరి పాలు ఇవి కూడా చేర్చాలి. బాగా చిక్క బడిన తరువాత ముందుగా పక్కన బెట్టుకున్న మొక్కజొన్న విత్తులను కలపాలి. అవి కూడా బాగా ఉడుకు వచ్చాక దించుకోవాలి. కార్న్ కర్రీ రెడీ

-వాణి ప్రభాకరి