రుచి

ఆరోగ్యామృతం... అంజీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని పండ్లు తాజాగా తీసుకుంటేనే వాటివల్ల ప్రయోజనం ఉం టుంది. కానీ, కొన్ని పండ్లలో తాజాకన్నా అవి ఎండిపోయాకే వాటి పోషకాలు రెట్టింపవుతాయి. అలాంటి పండ్లలో అంజీర ఒకటి. ఇవి రక్తహీనత నుంచి విముక్తి కలిగిస్తాయి. పైగా ఎండు పండ్లను ఎంతకాలమైనా నిలువ చేసుకోవచ్చు. దూరప్రయాణాల్లోనూ వాడుకోవచ్చు. ప్రత్యేకించి అంజీర పండులో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్తోపాటు కావలసినంత పీచు పదార్థం కూడా ఉంటుంది. పలురకాల పోషకాలతోపాటు శరీరానికి ఎంతో మేలుచేసే ఫైటోకెమికల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అంజీరను ఆంగ్లంలో ఫిగ్స్ అని అంటారు. హిందీలో అంజీర్ అని పిలుస్తారు. దీనిని సీమ మేడిపండు అని కూడా అంటారు. దీపావళికి ఇచ్చే బహుమతులలో డ్రైఫ్రూట్స్‌ల్లో ఇది మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. అంజీర పండు మేడిపండును పోలి వుంటుంది. కావున, దీనిని సీమ మేడి అంటారు.
‘జర్నల్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్’లో ఎండు పండ్లలో అత్యధికంగా పోషకాలు ఉన్నది అంజీరలోనేనని స్పష్టం చేశారు. తాజా పండుగా చూసినా మిగతావాటితో పోలిస్తే అంజీరాలో ఎక్కువ పోషకాలు, ఎక్కువ కేలరీలు ఉన్నాయి. అయితే ప్రతి మూడు తాజా పండ్లల్లో 65 కేలరీలు ఉంటే, ప్రతి మూడు ఎండు పండ్లల్లో 215 కేలరీలు ఉన్నట్లు తేలింది. అంజీర పండ్లను విడిగానే కాకుండా ఇతర పండ్లతో కలిపి కూడా తీసుకోవచ్చు. అలా చేయడంవల్ల కలిగే ప్రయోజనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, అంజీరను, ఓట్మీల్, సల్లాడ్, చట్నీలు, సల్సా, బియ్యం, పాస్తా కలిపి తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ప్రత్యేకించి రక్తహీనత ఒక ప్రధాన సమస్యగా సతమతం అవుతున్న వారికి అంజీర పండ్లు గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. రక్తహీనత అనగానే ఐరన్ ట్యాబెట్లకు సిద్ధమయ్యే వారికి ఇవి ప్రకృతి సహజమైన అంజీర పండ్లు పరవౌషధాలే. అంజీరలో అధిక మోతాదులో కాల్షియం ఉంటుంది. దీన్ని పిల్లలకు ప్రతిదినం ఇస్తే ఎముకలు బలపడతాయి. దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తినటంవల్ల అధిక రక్తపోటుతో బాధపడేవారు ఎంతో లాభం పొందవచ్చు. ఇది అధిక రక్తపోటును అదుపులో వుంచటానికి సహకరిస్తుంది.
అంజీర పండు తినడంవల్ల రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. దీనివల్ల అధిక బరువు తగ్గుతుంది. అంజీరవల్ల మధుమేహం కూడా అదుపులో ఉంచుతుంది. దీనిలో ఉండే పొటాషియం పొలిఫెనల్స్, ప్లెవొనోయిడ్స్, యాంటి ఆక్సిడెంట్స్లు టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహకరిస్తాయి. గ్యాస్టిక్స్ అల్సర్స్ రాకుండా కాపాడుతుంది. కిడ్నీ స్టోన్స్సు తగ్గించటానికి 4-5 అంజీర పండ్లను నానబెట్టి క్రమం తప్పకుండా తింటుంటే రాళ్లు కరుగుతాయి. సరిగ్గా నిద్రలేనివారు రాత్రి ఏడు గంటల తరువాత మూడు అంజీరపు పళ్ళు తిని, పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
తరచూ జలుబు చేసిందంటే ఈ అంజీరపు పళ్ళ రసం తాగితే బాగుంటుంది. ఆడపిల్లలు రోజు రెండు పళ్ళు తింటే మొటిమలు తగ్గి ఆకర్షణీయంగా తయారవుతారు. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. స్ర్తి-పురుషులిద్దరూ రెండు అంజీరా పండ్లు, పాలు తీసుకుంటే యవ్వనాన్ని చిరకాలం ఉంచుకోవచ్చు. ఎదుగుతున్న పిల్లలు ఈ పండ్లను తినడంవల్ల తెలివితేటలు పెరుగుతాయి. తలలోని చుండ్రును నివారిస్తుంది. 3-4 అంజీరలను నానబెట్టి తలకు మర్దన చేయటంవల్ల తలలోని చుండ్రు పోతుంది. ఇన్ని ఉపయోగాలు గల అంజీరను క్రమం తప్పకుండా తినటంవల్ల చాలా లాభాలు పొందవచ్చును.
సూపర్ మార్కెట్లలో దొరికే ఎండు అంజీర్లలో సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మలబద్ధకాన్ని దూరంచేస్తాయి. ఇందులోని ట్రైప్ట్ఫోన్స్ చక్కగా నిద్రపట్టడానికి సాయపడతాయి. అలర్జీ దగ్గు, కఫంలో బాధపడేవాళ్లు వీటిని తింటే ఉపశమనం కలుగుతుంది. దీనిలోని పెక్టిన్ కొవ్వును అదుపులో ఉంచుతుంది.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి