రుచి

ఆలూ పప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసినవి: పెసరపప్పు - 1కప్పు, ఆలుగడ్డలు -3, టమాటో-4, పచ్చిమిర్చ- 4, అల్లం -చిన్న ముక్క,కరివేపాకు, కొత్తిమీర తరుము- 2స్పూన్స్, పోపుసామాన్లు, నెయ్యి- 3స్పూన్స్, ఉప్పు తగినంత, పసుపు- తగినంత
తయారీ విధానం: ముందుగా పెసర పప్పును కొద్దిగా వేయించుకుని ఉడికించి విడిగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆలుగడ్డలను కూడా ఉడికించి తొక్కతీసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి , అల్లం చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇపుడు ఒక పాన్‌లో నేయి వేసి వేడెక్కాక పోపు సామాను వేసి అవి చిటపటలాడాక టమాటో ముక్కలు, పచ్చిమిరిప, అల్లం చేర్చాలి.కొద్దిగా మగ్గాక ఉప్పు పసుపు చేర్చాలి. అవి బాగా మగ్గాక అందుకలో ఉడికించిన ఆలు చిదిమి వేయాలి. ఇపుడు ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా కలపాలి. కొద్దిగా నీరు పోసుకుని 10 నిముషాలు ఉడికించుకోవాలి. ఇపుడు ఆ ఉడికిన పప్పును విడిగా గినె్నలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ పప్పు రోటిలోకాని, అన్నంలోకాని బాగుంటుంది. *