రుచి

నోరూరించే కేకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యారెట్ కేక్

కావాల్సినవి: మైదా - 2 కప్పులు, బేకింగ్ సోడా - 2 టీ.స్పూ., ఉప్పు - చిటికెడు, దాల్చిన చెక్క పొడి- 2 టీ.స్పూ., వెన్న - కప్పు, పంచదార - 2 కప్పులు, వెజిటబుల్ నూనె - అర కప్పు, మజ్జిగ - కప్పు, వెనిల్లా ఎసెన్స్ - 3 టీ.స్పూ., క్యారెట్ తురుము - 2 కప్పులు, కొబ్బరి పొడి - 1 కప్పు, పైనాపిల్ ముక్కలు - అర కప్పు, వాల్‌నట్స ముక్కలు - ఒకటిన్నర కప్పు, కార్న్ సిరప్ - అర కప్పు, క్రీమ్ చీజ్ - అర కప్పు, పంచదార పొడి - 3 కప్పులు.
తయారీ విధానం: ఓ గినె్నలో మైదా, దాల్చిన చెక్క పొడి, టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మరో గినె్నలో కప్పు పంచదార, అరకప్పు మజ్జిగ, రెండు స్పూన్ల వెన్న, వెజిటబుల్ నూనె, ఒకస్పూన్ వెనిల్లా ఎసెన్స్, ముందుగా సిద్ధం చేసుకున్న మైదా మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోకి క్యారెట్ తురుము, కొబ్బరి పొడి, పైనాపిల్ ముక్కలు, కప్పు వాల్‌నట్స్ కూడా వేసి బాగా కలపాలి. ఇపుడు మూడు కేకు పాత్రలను తీసుకుని వాటికి వెన్న రాసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఈ మూడు కేకు పాత్రల్లోకి వేసి ఓవెన్‌లో 350 డిగ్రీల వద్ద అరగంటపాటు బేక్ చేసుకోవాలి. ఇపుడు పొయ్యిపై బాణలి పెట్టి అందులో మిగిలిన పంచదార, మిగిలి టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, మిగిలిన అరకప్పు, మజ్జిగ, కార్న్ సిరప్, అరకప్పు వెన్న వేసి దగ్గర పడ్డాక వెనిల్లా ఎసెన్స్ వేసి దింపేయాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మూడు కేకులకు పట్టేలా పైనుంచి పోసుకోవాలి. ఇపుడు ఓ గినె్నలో అరకప్పు వెన్న, క్రీమ్ చీజ్, పంచదారపొడి, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు కేకులకు పట్టేలా ఒకదానిపై ఒకటి అమర్చుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని కేకులకు పట్టేలా రాసుకుని ఆపై వాల్‌నట్స్ ముక్కలను చల్లుకుంటే రుచికరమైన క్యారెట్ కేక్ రెడీ అయినట్లే.

కోకోకోలాతో..

కావాల్సినవి: మైదా - 2 కప్పులు, పంచదార - 1/3 కప్పు, పంచదారపొడి - అర కప్పు, కోకాకోలా - 2 కప్పులు, వెన్న - ఒకటిన్నర కప్పు, వెనిల్లా ఎసెన్స్ - 2 టి.స్పూన్లు, మాష్‌మాలో- కప్పు, బేకింగ్ పొడి - టి.స్పూన్, బేకింగ్ సోడా -టి.స్పూన్, మజ్జిగ - కప్పు, కోకో పొడి - అరకప్పు, బాదం పలుకులు - అర కప్పు.
తయారీ: ఒక గినె్నలో మైదా, బేకింగ్ సోడా, రెండు టేబుల్ స్పూన్ల కోకో పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇపుడు మరో గినె్నలో వెన్న, పంచదార, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. దీనిలోకి ముందుగా తయారుచేసి పెట్టుకన్న మైదా మిశ్రమం, మజ్జిగ, కప్పు కోకాకోలా, మాష్‌మాలో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఓ కేకు పాత్రకు టేబుల్ స్పూన్ వెన్న రాసి అందులోకి ఈ కేకు మిశ్రమాన్ని వేసి ఓవెన్‌లో 350 డిగ్రీల వద్ద అరగంటపాటు బేక్ చేసుకోవాలి. ఇపుడు పొయ్యిపై బాణలి పెట్టి అర కప్పు వెన్న వేసి కరిగాక కప్పు కోకో కోలా, మూడు టేబుల్ స్పూన్ల కోకోపొడి, టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్, పంచదారపొడి వేసి చిక్కగా దగ్గరకు రానివ్వాలి.
ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని చల్లార్చి ముందుగా బేక్ చేసుకున్న కేకుకు పట్టేలా పైనుంచి వేసి ఆపై బాదం పప్పు పలుకులు వేసుకుంటే రుచికరమైన కోకోకోలా కేక్ సిద్ధమైనట్లే.

స్ట్రాబెర్రీ పాన్‌కేక్

కావాల్సినవి: మైదా - 3 టి.స్పూ., వెన్న - కప్పు, స్ట్రాబెర్రీలు - కప్పు, వెనిల్లా ఎసెన్స్ - సగం టి.స్పూ, పంచదార - కప్పు, విప్డ్‌క్రీమ్ - 1 కప్పు, పాలు - కప్పు.
తయారీ: ముందుగా ఓ గినె్నలో గుడ్ల తెల్లసొనను తీసి గిలక్కొట్టి పక్కన పెట్టుకోవాలి. పొయ్యిపై బాణలిపెట్టి రెండు టి.స్పూన్ల వెన్న వేసి కరిగాక స్ట్రాబెర్రీ ముక్కలు, ముప్పావు కప్పు పంచదార వేసి దగ్గరపడేవరకు ఉంచాలి. ఇపుడు మరో గినె్నలో వెనిల్లా ఎసెన్స్, పావు కప్పు పంచదార, పాలు, టి.స్పూన్ వెన్న, మైదా వేసి బాగా కలపాలి. ఇదే మిశ్రమంలోకి ముందుగా తయారుచేసుకున్న గుడ్ల తెల్లసొనను వేసి దోశెపిండిలా తయారుచేసుకోవాలి. పొయ్యిపై పాన్ వేడి చేసి దానిపై కాస్త వెన్న వేయాలి. దీనిపై ముందుగా తయారుచేసుకున్న మిశ్రమాన్ని మందంగా వేసి రెండువైపులా కాల్చుకోవాలి. ఇలా చేసుకున్న పాన్ కేకులను విప్డ్ క్రీమ్, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ మిశ్రమాన్ని వేస్తూ ఒకదానిపై ఒకటి అమర్చుకుంటే స్ట్రాబెర్రీ పాన్ కేక్ రెడీ అయినట్లే.

చాక్లెట్‌తో...

కావాల్సినవి: మైదా - ముప్పావు కప్పు, బేకింగ్ పౌడర్ - అర చెంచా, ఉప్పు - అర చెంచా, చక్కెర - కప్పు, తీపి లేని చాక్లెట్ - రెండు పెద్ద ముక్కలు, నీళ్లు - రెండు టేబుల్ స్పూన్లు, ఐసింగ్ షుగర్ - అరకప్పు, డార్క్ చాక్లెట్ - నాలుగు పెద్ద ముక్కలు, క్రీమ్ చీజ్ - ఒక చిన్న ప్యాకెట్, వెనిల్లా ఎసెన్స్ - అరచెంచా.
తయారీ: ఓపెన్‌ని 350 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి పెట్టుకోవాలి. ఓ గినె్నలో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు కలిపి జల్లించి పెట్టుకోవాలి. మరో గినె్నలో తీసుకుని క్రీంలా తయారయ్యేవరకూ గిలకొట్టాలి. అందులో ముప్పావు కప్పు చక్కెర వేసి అది కరిగేవరకూ కలపాలి. తరవాత మైదా వేయాలి. ఇపుడ చాక్లెట్‌ని కరిగించుకోవాలి. అంటే ఓ గినె్నలో సగం వరకూ నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అందులో చాక్లెట్ ముక్కలున్న గినె్నను ఉంచాలి. అది కరిగాక నీళ్లూ, మిగిలిన చక్కెర వేసి కలిపి దింపేయాలి. దీన్ని మైదాలో వేసి కలపాలి. ఈ మివ్రమాన్ని మైదా చల్లిన కేక్ పాన్‌లో తీసుకుని ఓవెన్‌లో ఉంచాలి. 18 నుంచి 20 నిమిషాలు బేక్ చేయాలి. ఇది చల్లారేలోగా దీనిపై పూత యారుచేయాలి. డార్క్ చాక్లెట్‌ని ఓ గినె్నలో తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక దింపేసి క్రీం చీజ్, వెనిల్లా ఎసెన్స్, ఐసింగ్ షుగర్ వేసి క్రీంలా తయారయ్యేవరకూ కలపాలి. ఈ మిశ్రమాన్ని కేక్ అంతా పట్టిస్తే సరిపోతుంది.

- సత్యవాణి