రుచి

పోషకాలు ఇలా పదిలం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంటచేసే విధానంలో కొన్ని మెళకువలు పాటిస్తే కూరల్లోంచి విలువైన పోషకాలు బయటకు పోకుండా అరికట్టవచ్చు. క్యారెట్, బంగాళాదుంపలు, బీట్‌రూట్, క్యాబేజీ వంటి కూరగాయల్లో మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే విలువైన పోషకాలు ఎన్నో ఉంటాయి. వీటిని ముక్కలుగా కోసి ఉడికించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పోషక పదార్థాలు బయటకు పోకుండా ఉంటాయి. దుంపజాతి కూరగాయల్ని ఉడికించి కోయడం కన్నా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించినా లేదా నూనెలో వేపుకున్నా వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లను కాపాడుకోవచ్చు. బంగాళాదుంపల ముక్కలను పొట్టుతో ఉడికిస్తే అందులోని పోషకాలు బయటకుపోవు. కూరగాయల ముక్కలను గినె్నలో లేదా బాణలిలో ఉడికించినపుడు ఆవిరి బయటకు పోకుండా సరైన మూత పెట్టాలి. దీనివల్ల వీటిలోని పోషకాలు వృథాకాకుండా పదిలంగా ఉంటాయి. వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలను తరిగిన వెంటనే పోపులో వేయకుండా, కొద్ది నిమిషాల సేపుగాలిలో ఉంచి ఆ తర్వాత బాణలిలో కలపాలి. ఇలా చేయడం వల్ల వీటిలో పోషకాల స్థాయి తగ్గకుండా ఉంటుంది.