రుచి
వేడి వేడిగా రసం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికీ జలుబు, దగ్గు, జ్వరాలు మొదలు. పిల్లల నుంచి పెద్దవారి వరకు వాతావరణ మార్పుతో ఇవే సమస్యలు.. ఈ కాలంలో ఆహారం కూడా పెద్దగా రుచించదు. ఇలాంటి వాతావరణంలో నోటికి రుచిగా, గొంతుకు హాయిగా, వేడివేడిగా, తేలిగ్గా జీర్ణమయ్యే, తక్షణ శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే మంచిది. అలాంటివే ఈ రసాలు.. ఒకసారి వాటి తయారీ విధానం చూద్దామా..
అరైత్త రసం
కావలసిన పదార్థాలు: కందిపప్పు: రెండు టేబుల్ స్పూన్లు, టొమాటో: పెద్దది ఒకటి, వెల్లుల్లి: పది, మిరియాలు: టీ స్పూన్, జీలకర్ర: అర టీ స్పూన్, ఆవాలు: అర టీ స్పూన్, ఎండుమిర్చి: రెండు, కరివేపాకు: రెండు రెబ్బలు, చింతపండు: నిమ్మకాయంత, కారం: అర టీ స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, బెల్లం: రుచికి సరిపడా, ఇంగువ: చిటికెడు,
కొత్తిమీర: ఒక కట్ట
తయారుచేసే విధానం: కందిపప్పుని ఉడికించి పక్కన ఉంచాలి. టొమాటో, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, మిరియాలను మెత్తగా రుబ్బాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఉడికించి మెదిపిన పప్పులో వేసి కలపాలి. ఉప్పు, కారం, ఇంగువ, చింతపండు గుజ్జు అన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి. చివరగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో పోపు వేసి కలిపి, కొత్తిమీర తురుము చల్లి దించాలి. అంతే వేడి వేడి అరైత్త రసం తయారు.
కల్యాణ రసం
కావలసిన పదార్థాలు: కందిపప్పు: టేబుల్ స్పూన్, ధనియాలు: టేబుల్ స్పూన్, మిరియాలు: టేబుల్ స్పూన్, జీలకర్ర: ఒకటిన్నర టీ స్పూన్, ఎండుమిర్చి: రెండు, నూనె: రెండు టీ స్పూన్లు, రసం తయారీ కోసం.. కందిపప్పు: మూడు టేబుల్ స్పూన్లు, టొమాటో: ఒకటి, చింతపండు: నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, మిరియాలు: టీ స్పూన్, జీలకర్ర: టీ స్పూన్, పసుపు: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడా, మంచినీళ్లు: తగినన్ని, ఆవాలు: టీ స్పూను, జీలకర్ర: అర టీ స్పూన్, కరివేపాకు: నాలుగు రెబ్బలు, ఇంగువ: చిటికెడు, కొత్తిమీర: కట్ట
తయారుచేసే విధానం: అరకప్పు గోరువెచ్చని నీళ్లలో చింతపండు వేసి నానబెట్టాలి. కందిపప్పులో పసుపు వేసి ఉడికించాలి. ఒక పాన్‌లో టీ స్పూన్ నూనె వేసి కందిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకోవాలి. టొమాటోని ముక్కలుగా కోసం అరకప్పు నీళ్లు పోసి మెత్తగా చేసి రసం తీయాలి. దీన్ని ఉడికించిన కందిపప్పులో కలపాలి. ఇందులోనే చింతపండు రసం, ఉప్పు వేసి కలపాలి. వెల్లుల్లి, మిరియాలు, జీలకర్రను మెత్తగా నూరాలి. ఒక మందపాటి గినె్నలో టీస్పూన్ నూనె వేసి అందులో వెల్లుల్లి మిశ్రమం వేసి వేగాక కందిపప్పు మిశ్రమాన్ని వేసి సిమ్‌లో మరిగించాలి. తరువాత ముందుగా చేసి పెట్టుకున్న పొడిని ఇందులో ఉండలు కట్టకుండా వేస్తూ కలిపి మరికాసేపు మరిగించాలి. తరువాత ఒక చిన్న బాణలిలో నూనె వేసి తాలింపు దినుసులన్నీ వేసి రసంలో కలపాలి. చివరగా కొత్తిమీర వేస్తే కల్యాణ రసం రెడీ. జ్వరమొచ్చి శక్తిలేకుండా, నోరు బాలేకుండా ఉన్నవాళ్లకి ఈ రసం చాలా రుచిగా ఉండి,
తక్షణ శక్తిని అందిస్తుంది.
జీలకర్ర రసం
కావలసిన పదార్థాలు: జీలకర్ర: ఒకటిన్నర టీ స్పూన్, కందిపప్పు: టేబుల్ స్పూన్, చింతపండు: నిమ్మకాయంత, ఆవాలు: టీ స్పూన్, కరివేపాకు: రెండు రెబ్బలు, కొత్తిమీర: కొద్దిగా, టొమాటో: ఒకటి, నూనె: టీ స్పూన్, కారం: టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా
తయారుచేసే విధానం: ముందుగా చింతపండును నానబెట్టాలి. తరువాత మరోగినె్నలో జీలకర్ర, కందిపప్పు, ఎండుమిర్చి వేసి అరగంట సేపు నానబెట్టాలి. తరువాత వీటిని కరివేపాకు వేసి మెత్తగా రుబ్బాలి. ఒక మందపాటి గినె్నలో చింతపండు నీళ్లు, జీలకర్ర కందిపప్పువేసి రుబ్బిన ముద్ద, ఉప్పు వేసి కలపాలి. తరువాత ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కోసం టొమాటో ముక్కలు వేసి సిమ్‌లో ఉంచి ఉడికించాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, చిటికెడు జీలకర్ర వేసి చిటపటమన్నాక రసంలో వేసి కాస్త కొత్తిమీర వేసి దించితే సరి. వేడి వేడి జీలకర్ర రసం తయారు.
పైనాపిల్ రసం
కావలసిన పదార్థాలు: పైనాపిల్: కొన్ని ముక్కలు, పచ్చిమిర్చి: మూడు, కొత్తిమీర: కట్ట, టొమాటో: ఒకటి, రసం పొడి: టీ స్పూన్, పసుపు: అర టీ స్పూన్, అల్లం తురుము: చిన్న ముక్క, ఉప్పు: రుచికి సరిపడా, బెల్లం తురుము: అర టీ స్పూన్, కందిపప్పు: అరకప్పు, కొబ్బరిపాలు: అరకప్పు, జీలకర్ర: అర టీ స్పూన్, మిరియాలు: అర టీ స్పూన్, నెయ్యి: టీ స్పూన్, ఆవాలు: టీ స్పూన్, ఎండుమిర్చి: నాలుగు, ఇంగువ: టీ స్పూన్, కొత్తిమీర: కట్ట, కరివేపాకు: కట్ట
తయారుచేసే విధానం: పైనాపిల్ ముక్కల్లో సగం ముక్కలను జ్యూస్ చేసుకోవాలి. కందిపప్పుని ఉడికించి మెత్తగా మెదపాలి. తరువాత ఒక మందపాటి గినె్నను స్టవ్‌పై ఉంచి అందులో తగినన్ని నీళ్లను పోసి మరిగించాలి. ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, పైనాపిల్ ముక్కలు, పైనాపిల్ రసం, టొమాటో ముక్కలు, రసం పొడి, బెల్లం తురుము, ఉప్పు, కొబ్బరి పాలు, కందిపప్పు వేసి సుమారు పావుగంట సేపు మరిగించాలి. తరువాత ధనియాల పొడి, మిరియాలపొడి కూడా వేసి మరిగించాలి. ఒక బాణలిని తీసుకుని అందులో నెయ్యి వేసి వేగాక ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి తాలింపు పెట్టి రసంలో కలపాలి. అంతే ఎంతో రుచికరమైన పైనాపిల్ రసం రెడీ.
మామిడికాయ రసం
కావలసిన పదార్థాలు: కందిపప్పు: రెండు టేబుల్ స్పూన్లు, పచ్చి మామిడికాయ: చిన్నది ఒకటి, టొమాటోలు: రెండు, ఉప్పు: తగినంత, కరివేపాకు: నాలుగు రెబ్బలు, ఎండుమిర్చి: రెండు మిరియాలు: అర టీ స్పూన్, ధనియాలు: టీ స్పూన్, జీలకర్ర: టీ స్పూన్, అల్లం తురుము: టీ స్పూన్, వెల్లుల్లి తురుము: టీ స్పూన్, ఆవాలు: అర టీ స్పూన్, పసుపు: టీ స్పూన్, నూనె: నాలుగు టీ స్పూన్లు
తయారుచేసే విధానం: కందిపప్పును మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేయాలి. మామిడికాయ తొక్కు తీసి ముక్కలుగా కోసం నీళ్లలో వేసి ఉడికించి మెత్తని గుజ్జులా చేయాలి. టొమాటోల్ని ఉడికించి గుజ్జులా చేయాలి. అందులోని అల్లం, వెల్లుల్లి తురుము, ముందుగా తయారుచేసుకున్న పొడిని కలిపి, నీళ్లు పోసి మరిగించి పలుచని బట్టతో వడకట్టాలి. వడకట్టిన ఈ రసానికి మామిడికాయ గుజ్జు, ఉడికించి మెదిపిన పప్పు వేసి కలపాలి. ఉప్పు కూడా వేసి ఐదు నిముషాలు మరిగించాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు అన్నీ వేసి తాలింపు వేసి రసంలో కలిపితే వేడివేడి మామిడికాయ రసం తయారు.