రుచి
వెరైటీ రాప్స్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పిల్లలు స్కూలు నుంచి రాగానే, లేదా స్కూలుకు పెట్టి పంపించడానికి రాప్స్ చాలా బాగుంటాయి. పైగా పోషక మిళితమైనవి కూడా.. రోజూ చపాతీ, కర్రీ అన్నా.. కుల్చాలన్నా పిల్లలకు బోర్ కొట్టేస్తుంది. పోషకాలను కలిగిన రాప్స్ అయితే రుచిగా, స్నాక్‌లా ఉంటాయి కనుక మారు మాట్లాడకుండా తినేస్తారు.. అలాంటి వెరైటీ రాప్స్ ఏంటో చూసేద్దామా..
గ్రీక్ సలాడ్ రాప్
కావలసిన పదార్థాలు
మైదాపిండి: కప్పు
కీరదోసముక్కలు: కప్పు
చీజ్‌ముక్కలు: కప్పు
నల్ల ఆలివ్‌లు: కప్పు
హైబ్రిడ్ టొమాటో ముక్కలు: కప్పు
ఎర్ర ఉల్లిపాయ సగం
తయారీ విధానం
ముందుగా మైదాపిండిని చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి. తరువాత ఒక పాత్రను తీసుకుని అందులో అన్ని పదార్థాలను వేసుకుని బాగా కలపాలి. తరువాత మైదాపిండిని చపాతీలా ఒత్తుకోవాలి. ఇందులో ఈ సలాడ్‌ను ఉంచి రాప్‌లా చుట్టుకోవాలి. అంతే గ్రీక్ సలాడ్ రాప్ సిద్ధం.
క్యారెట్, ముల్లంగి రాప్
కావలసిన పదార్థాలు
మైదాపిండి: ఒక కప్పు
క్యారెట్లు: మూడు
ముల్లంగి: ఐదు
ఉల్లికాడల తరుగు: పావు కప్పు
వేయించిన జీడిపప్పు పలుకులు: పావు కప్పు
ఉప్పు: తగినంత
మిరియాలపొడి: రుచికి తగినంత
ఆలివ్ నూనె: రెండు చెంచాలు
వెనిగర్: ఒక చెంచా
పుదీనాతరుగు: రెండు చెంచాలు
కూరకారం: చెంచా
సన్నగా తరిగిన వెల్లుల్లి: చెంచా
తయారీ విధానం
ముందుగా మైదాపిండిలో ఉప్పు, నూనె వేసి చపాతీపిండిలా తడిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత క్యారెట్‌నూ, ముల్లంగినీ సన్నగా తురిమి ఒక గినె్నలో వేసుకోవాలి. ఇందులోనే ఉల్లికాడల తరుగు, మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మైదాపిండిని చపాతీలా చేసుకుని, కాల్చుకుని పక్కన పెట్టి, అందులో సలాడ్‌ను పెట్టి రాప్‌లా చుట్టేయాలి.
పాలక్ పనీర్ రాప్
కావలసిన పదార్థాలు
పనీర్ తురుము: కప్పు
పాలకూర తరుగు: అరకప్పు
జీలకర్ర పొడి: అరచెంచా
పచ్చిమిర్చి: రెండు
ఉప్పు: తగినంత నిమ్మరసం: అరచెంచా
గోధుమపిండి: కప్పు వెన్న: అరకప్పు
తయారీ విధానం
ముందుగా గోధుమపిండిలా చిటికెడు ఉప్పు వేసుకుని నీళ్లతో చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గినె్నలో పనీర్ తురుము, పాలకూర తరుగు, జీలకర్రపొడి, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు, నిమ్మరసం తీసుకుని అన్నింటినీ బాగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టిన చపాతీపిండిని తీసుకుని చపాతీల్లా చేసుకోవాలి. దానిపై పాలకూర, పనీర్ మిశ్రమాన్ని పరిచి రోల్‌లా చుట్టేయాలి. వీటిని మరలా పెనంపై పెట్టి వెన్న వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా చేసుకున్న రాప్‌లు లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుంటాయి.
మొలకల రాప్
కావలసిన పదార్థాలు
మైదాపిండి: కప్పు
సన్నగా తరిగిన మెంతికూర: కప్పు
ఉడికించిన పెసర మొలకలు: కప్పు
నూనె: మూడు చెంచాలు
పచ్చిమిర్చి ముక్కలు: రెండు చెంచాలు
పసుపు: కొద్దిగా
ఉప్పు: తగినంత
నిమ్మరసం: చెంచా
సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు: చెంచా
ఉల్లిపాయ ముక్కలు: రెండు టేబుల్ స్పూన్లు
గడ్డపెరుగు: అరకప్పు
జీలకర్ర: అరచెంచా
కారం: అరచెంచా
ఇంగువ: చిటికెడు
తయారీ విధానం
బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి వేడిచేసి జీలకర్ర వేయాలి. తరువాత వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. నిముషం తరువాత దింపేసి దీన్ని గడ్డపెరుగులో కలపాలి. తరువాత దీనిలో కారం, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మైదాపిండిని ఉప్పు, నూనె వేసి, నీళ్లు కలుపుతూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇంకో బాణలిలో తరిగిన మెంతికూరను వేయించాలి. తరువాత దీనిలో ఉడికించి పెట్టుకున్న పెసరమొలకలు, పసుపు, తగినంత ఉప్పు వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తడిపోయి పొడి కూరలా అయ్యాక నిమ్మరసం పిండి స్టవ్ ఆపేయాలి. తరువాత మైదాపిండిని చపాతీలా ఒత్తుకుని కాల్చుకోవాలి. దీనికి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చపాతీ అంతటా పూసి మధ్యలో మొలకల మిశ్రమాన్ని పెట్టి రాప్‌లా చుట్టుకోవాలి.
ఫాటౌష్ రాప్
కావలసిన పదార్థాలు
మైదా: ఒక కప్పు
లెట్యూస్ లేదా క్యాబేజీ ఆకులు: రెండు
ఉల్లిపాయ: ఒకటి
టొమాటో: ఒకటి
తరిగిన కీరదోస ముక్కలు: కొన్ని
ఎరుపు కాప్సికం: ఒకటి
పసుపు కాప్సికం: ఒకటి
ముల్లంగి: చిన్న ముక్క
ఆలివ్‌నూనె: చెంచా నిమ్మరసం: చెంచా
ఉప్పు: తగినంత మిరియాలపొడి: అరచెంచా
సుమాక్ పొడి: చెంచా (మార్కెట్లో దొరుకుతుంది)
తయారీ విధానం:
ముందుగా మైదాపిండిలో ఉప్పు, నూనె వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పళ్లెంలో ఆలివ్ నూనె, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి, సుమాక్ పొడి చల్లాలి. ఇప్పుడు వాటిపై ముక్కలుగా కోసిన ఉల్లిపాయలు, కీరదోస ముక్కలు, తరిగిన కాప్సికం ముక్కలు, ముల్లంగి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తడిపి ఉంచుకున్న మైదాపిండిని వీలైనంత పలుచగా చపాతీల్లా ఒత్తుకోవాలి. వీటిని పెనంపై చపాతీల్లా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఒక చపాతీని తీసుకుని దానిపై లెట్యూస్ లేదా క్యాబేజీ ఆకులను పరిచి వాటిలో తయారుచేసి పెట్టుకున్న సలాడ్‌ను పెట్టి చపాతీతో పూర్తిగా మూసెయ్యాలి. అంతే ఎంతో పౌష్టికమైన ఫాటౌష్ రాప్ తయారు. పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. దీనితో పాటు టొమాటో కచెప్‌ను కూడా ఇస్తే వారికి అందులో ఏం పెట్టారో కూడా చూడకుండా ఆనందంగా తినేస్తారు.