రుచి
చేపలతో చిరుతిళ్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చేపతో
ఆరోగ్యానికి చేపలు చాలా మంచివి. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పెద్దలకే కాదు, పిల్లల ఎదుగుదలకు కూడా చాలా మంచిది. కానీ పిల్లలను చేపలు తినమంటే కొందరు ముళ్లు అని, మరికొందరు వాసన అంటుంటారు. కానీ గుండె జబ్బులున్న వాళ్లకి సైతం మంచి చేసే ప్రొటీన్లు చేపల్లో ఉంటాయి. ఇక పిల్లలకు, గర్భిణీలకు చేపలు ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. మరి అలాంటి చేపలతో చిరుతిళ్లు మీకోసం..
*
ఫిష్ ఫ్రై
*
కావలసిన పదార్థాలు
కొరమీను చేపలు: కిలో
కొబ్బరి పొడి: రెండు స్పూన్లు
జీలకర్ర పొడి: ఒక స్పూన్
ధనియాల పొడి: రెండు స్పూన్లు
మెంతి పొడి: పావు స్పూన్
పసుపు: కొద్దిగా
కారం: ఒక స్పూన్
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక స్పూన్
చింతపండు పులుసు: మూడు స్పూన్లు
నిమ్మకాయ: ఒకటి
నూనె: వేయించడానికి సరిపడా
కొత్తిమీర: కట్ట
ఉప్పు: తగినంత
*
తయారీ విధానం
ముందుగా చేపముక్కల్ని శుభ్రం చేసుకుని నిమ్మరసం ముక్కలకి పట్టించాలి. ఒక గినె్నలో అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, జీలకర్రపొడి, మెంతిపొడి, కొబ్బరిపొడి, ఉప్పు, చింతపండు పులుసు, కొద్దిగా నూనె వేసి ఈ మిశ్ర
మాన్ని బాగా కలిపి చేపకు రెండు వైపులా పట్టించాలి. ఈ చేప ముక్కలని అరగంట పాటు నాననివ్వాలి. తరువాత స్టవ్‌పై పెనాన్ని ఉంచి నూనె వేసుకుని నిదానంగా రెండు వైపులా కాల్చాలి. తరువాత కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలతో వడ్డించాలి.
*
కట్‌లెట్
*
కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు: రెండు
చేప ముక్కలు: ఐదు
మైదా: అరకప్పు
మొక్కజొన్న పిండి: రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు: రెండు
పచ్చి మిరపకాయలు: ఆరు
గరంమసాలా: ఒక టీ స్పూన్
కోడిగుడ్లు: రెండు
బ్రెడ్ పొడి: అరకప్పు
ఉప్పు: తగినంత
నూనె: తగినంత
*
తయారీ విధానం
ముందుగా చేప ముక్కలను, బంగాళాదుంపలను ఆవిరిపైన ఉడికించి పెట్టుకోవాలి. చేపలను చిదిమితే మెత్తని పుట్టు తయారవుతుంది. దీన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి. తరువాత బంగాళాదుంపలను కూడా పొట్టు తీసుకుని చిదిమి అదే బౌల్లో వేసుకోవాలి. ఇందులో మైదా, మొక్కజొన్నపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి నీళ్లు పోయకుండా మిశ్రమాన్ని గట్టిగా కలుపుకోవాలి. వీటిని కట్‌లెట్‌లలా చేసుకోవాలి. తరువాత ఓ గినె్నలో గుడ్లను వేసుకుని గిలకొట్టుకోవాలి. ముందుగా చేసుకున్న కట్‌లెట్‌లను గిలకొట్టిన కోడిగుడ్డులో ముంచి బ్రెడ్ పొడిలో దొర్లించుకోవాలి. ఒక పెనాన్ని స్టవ్‌పై ఉంచి అందులో ఒక స్పూన్ నూనెను వేసి కట్‌లెట్‌లను ఒక్కొక్కటిగా, రెండు వైపులా వేయించుకోవాలి. అంతే పిల్లలు ఎంతో ఇష్టపడే ఫిష్ కట్‌లెట్స్ రెడీ. వీటిని టొమాటో కచెప్‌తో తింటే భలే మజాగా ఉంటుంది.
*
పకోడి..
*
కావలసిన పదార్థాలు
చేప ముక్కలు: పది
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: తగినంత
కారం: తగినంత
గరంమసాలా:
కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్:
ఒక టీ స్పూన్
పసుపు:
ఒక టీ స్పూన్
కోడిగుడ్డు: ఒకటి
మైదా పిండి: అరకప్పు
బ్రెడ్ పొడి: కొద్దిగా
*
తయారీ విధానం
ముందుగా ఒక వెడల్పాటి గినె్నను తీసుకుని అందులో కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత చేప ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వీటిని మసాలాలో వేసి బాగా పట్టించి పదిహేను నిముషాలు నానబెట్టాలి. తరువాత స్టవ్‌పై బాణలి ఉంచి అందులో నూనె పోసి కాగనివ్వాలి. ఒక బౌల్‌లో కోడిగుడ్డును వేసి బాగా గిలకొట్టాలి. మసాలా పట్టించిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకుని కోడిగుడ్డులో ముంచి, బ్రెడ్‌పొడిలో, మైదాపిండిలో దొర్లించి నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన ఫిష్ పకోడీ రెడీ.
*
ఫిష్ అమృత్‌సరీ
*
కావలసిన పదార్థాలు
ముళ్లు లేని చేప: అరకిలో
కారం: చెంచా
పసుపు: కొద్దిగా
అల్లం వెల్లుల్లి తరుగు: రెండు చెంచాలు
పచ్చిమిర్చి: నాలుగు
వాము: పావు చెంచా
నిమ్మకాయ: అరచెక్క
ఉప్పు: తగినంత
బియ్యప్పిండి: రెండు చెంచాలు
సెనగపిండి: మూడు చెంచాలు
కోడిగుడ్డు: ఒకటి
చాట్ మసాలా: చిటికెడు
నూనె: వేయించడానికి సరిపడా
*
తయారీ విధానం
ఒక పాత్రలో చేపముక్కలను తీసుకుని కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ రసం, బియ్యప్పిండి, సెనగపిండి, కోడిగుడ్డు, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి. ఇందులో చేప ముక్కలను వేసి మసాలా ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. వీటిని నాలుగు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత ఈ చేప ముక్కలను నూనెలో దోరగా వేయించుకుని కొత్తిమీరతో అలంకరించుకుంటే ఫిష్ అమృతసరీ సిద్ధం.
*
అపోలో ఫిష్
*
కావలసిన పదార్థాలు
చేపలు: అరకిలో
నిమ్మకాయ: అరచెక్క
కొత్తిమీర: చిన్న కట్ట
కోడిగుడ్డు: ఒకటి
మైదా: పావు కప్పు
మొక్కజొన్న పిండి: రెండు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి: ఒక టీ స్పూన్
పెరుగు: అరకప్పు
కరివేపాకు: రెండు రెబ్బలు
పచ్చిమిర్చి: ఆరు
కాప్సికం: ఒకటి
ఫుడ్ కలర్: చిటికెడు
నూనె: వేయించడానికి
సరిపడా
ఉప్పు: తగినంత
*
తయారీ విధానం
ముందుగా చేపలో ముళ్ళను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇందులో నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు కలిపి అరగంట సేపు నాననివ్వాలి. స్టవ్‌పై బాణలి ఉంచి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి. తరువాత ఒక గినె్నలో గుడ్డును గిలకొట్టి అందులో మొక్కజొన్న పిండి, మైదా, రంగు కలిపి మారినేట్ చేసిన చేప ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. తర్వాత ఒక కడాయిలో రెండు చెంచాల నూనె వేసి అందులో నిలువుగా కోసిన పచ్చిమిరపకాయ ముక్కలు, కాప్సికం ముక్కలు, కరివేపాకు వేసి వేయించి డీప్ ఫ్రై చేసిన చేపముక్కల్ని వేయాలి. దీనిపై కొద్దిగా గిలకొట్టిన పెరుగు వేయాలి. పెరుగు ఇగిరిపోయేంతవరకు వేయించుకుని తీసేయాలి. అంతే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడి తినే అపోలో ఫిష్ తయారు.