రుచి
చలిని తరిమే.. వేడి వేడి సూప్‌లు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చలికాలం మొదలైపోయింది. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. వాతావరణ మార్పుల్లో భాగంగా జలుబు, గొంతునొప్పుల సంగతి సరేసరి.. చలిపులిని వదిలించుకోవాలంటే, గొంతు నొప్పులకు ఉపశమనం కలగాలంటే వేడి వేడి సూప్‌లను
లాగించాల్సిందే.. అప్పుడే శరీరానికి తేలికపాటి పోషకాహారం అంటే.. తేలిగ్గా జీర్ణమైపోయే పోషకాహారాన్ని అందించినట్లు
అవుతుంది. అలాంటి సూప్‌లు ఏంటో చూద్దామా..
టమోటా ధనియా షోర్బా
కావలసిన పదార్థాలు
టమోటాలు: రెండు
కొత్తిమీర: రెండు కట్టలు
ఉప్పు: తగినంత
మిరియాలు: చెంచా
వెల్లుల్లి: నాలుగు రెబ్బలు
కరివేపాకు: ఒక రెమ్మ
పుదీనా: అరకట్ట
అల్లం: చిన్న ముక్క
దాల్చిన చెక్క: అంగుళం ముక్క
పచ్చిమిర్చి: నాలుగు
నూనె: తాలింపుకు సరిపడా..
తయారీ విధానం
టమోటాలను నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లాన్ని వేటికవి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మిరియాలను కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ముందుగా ఒక మందపాటి గినె్న తీసుకుని అందులో టమోటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, మిరియాలు, అల్లం, కరివేపాకు, తగినంత ఉప్పు, నీళ్లు వేసి మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఉప్పు, కారం సరిచూసుకుని వేరే గినె్నలోకి వడకట్టుకోవాలి.
తరువాత మరో బాణలిని ఉంచి అందులో ఒక స్పూన్ నూనె వేసుకుని దానిలో వెల్లుల్లి వేసి తాలింపు పెట్టుకుని వడకట్టిన సూపులో కలుపుకుంటే రుచికరమైన టమోటా ధనియా షోర్బా సిద్ధం. ఇందులో నూనె బదులు నెయ్యి వేసుకుంటే పిల్లలు మరింత కమ్మగా దీన్ని ఆస్వాదిస్తారు.
మొరాకన్ రోస్టెడ్ వెజిటబుల్ చికెన్ సూప్
కావలసిన పదార్థాలు
క్యారెట్లు: రెండు
ముల్లంగి: ఒకటి
తీపి గుమ్మడి: కొన్ని ముక్కలు
బంగాళాదుంప: ఒకటి
ఉల్లిపాయ: ఒకటి
వెల్లుల్లి రెబ్బలు: రెండు
గరంమసాలా: చెంచా
ఆలివ్‌నూనె: ఒకటిన్నర చెంచా
పుదీనా తరుగు: రెండు చెంచాలు
చికెన్ ముక్కలు: పావు కప్పు
తియ్యని పెరుగు: పావు కప్పు
నీళ్ళు: తగినన్ని
ఉప్పు: తగినంత
మిరియాల పొడి: రుచికి సరిపడా
తయారీ విధానం
అడుగు మందంగా ఉన్న గినె్నలో చికెన్ ముక్కలు, రెండు కప్పులు నీళ్లూ తీసుకుని పొయ్యిపై పెట్టాలి. చికెన్ ఉడికాక వెల్లుల్లి తరుగు, పుదీనా, కూరగాయల ముక్కలన్నింటినీ వేయాలి. ఐదు నిముషాలయ్యాక గరం మసాలా, ఆలివ్ నూనె వేయాలి. ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడికాక దింపేయాలి. వేడి కాస్త చల్లారాక మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని మళ్లీ పొయ్యిపై పెట్టి పెరుగు, కొద్దిగా నీళ్లు, తగినంత ఉప్పు, మిరియాల పొడి కలపాలి. మరిగిన తర్వాత దింపేసి కొత్తిమీర చల్లితే సరిపోతుంది.
టమోటా, క్యారెట్ సూప్
కావలసిన పదార్థాలు
క్యారెట్లు: రెండు
టమోటాలు: రెండు
ఉల్లిపాయ: ఒకటి
వేయించిన మిరియాల పొడి: అరచెంచా
జీలకర్రపొడి: చెంచా
తరిగిన కొత్తిమీర: రెండు చెంచాలు
ఉల్లికాడల తరుగు: రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
తయారీ విధానం
టమోటా, క్యారెట్, ఉల్లిపాయలను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి మిక్సీ వేసి, పావు కప్పు నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అడుగు మందంగా ఉన్న గినె్నలోకి తీసుకుని రెండు కప్పుల నీళ్లు పోసి పొయ్యిపై పెట్టాలి. ఈ గుజ్జు ఉడికి, చిక్కగా అయ్యాక మిరియాల పొడి, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. రెండు నిముషాలయ్యాక కొత్తిమీర తరుగు, ఉల్లికాడల తరుగు వేసి దింపేస్తే చాలు.. వేడివేడి క్యారెట్, టమోటా సూప్ రెడీ.
నాటుకోడి సూపు
కావలసిన పదార్థాలు
నాటుకోడి మాంసం: అరకిలో
కారం: చెంచా
ఉప్పు: తగినంత
పచ్చిమిర్చి: ఐదు
గరంమసాలా: పావు చెంచా
ధనియాలపొడి: అరచెంచా
జీలకర్రపొడి: పావు చెంచా
ఉల్లిపాయ: ఒకటి
టమోటాలు: రెండు
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర: కట్ట
అల్లం వెల్లుల్లి: అరచెంచా
నూనె: రెండు చెంచాలు
తయారీ విధానం
నాటుకోడి మాంసాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఉల్లిపాయ, టమోటాలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగిపెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి ఆపై అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయిన తర్వాత టమోటాలు కూడా వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు నాటుకోడి ముక్కలు కూడా అందులో వేసి కారం, ఉప్పు, పసుపు, జీలకర్రపొడి, ధనియాల పొడి వేసి రెండు నిముషాల పాటు ఉంచి మూతపెట్టాలి. తర్వాత గరం మసాలా పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి సన్న సెగ మీద చికెన్ ఉడికేంత వరకూ ఉంచాలి. కుక్కర్‌లో వేస్తే దాదాపు పది, పనె్నండు విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ తెరచి కొత్తిమీర వేసి రెండు నిముషాల పాటు మరగనిచ్చి వేడిగా సర్వ్ చేసుకోవాలి.
స్వీట్‌కార్న్, పాలకూర సూప్
కావలసిన పదార్థాలు
స్వీట్‌కార్న్: రెండు కప్పులు
పాలకూర తరుగు: కప్పు
వెల్లుల్లి తరుగు: ఒక చెంచా
ఉప్పు: తగినంత
మిరియాల పొడి: రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి: రెండు చెంచాలు
క్రీం: కొద్దిగా
తయారీ విధానం
స్టవ్‌పైన బాణలి పెట్టి నూనె లేదా నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక వెల్లుల్లి తరుగు వేయించాలి. నిముషమయ్యాక స్వీట్‌కార్న్ వేసి వేయించాలి. అవి కాస్త వేగాక నాలుగు కప్పుల నీళ్లు పోసి మంట పెంచాలి. అవి మరుగుతున్నప్పుడు తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి దించేయాలి.
ఆ నీళ్ల వేడి తగ్గాక స్వీట్‌కార్న్‌ని మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని మళ్లీ నీళ్లలో వేసి పొయ్యిపై పెట్టాలి. రెండు నిముషాల తర్వాత పాలకూర తరుగు వేసి మంట తగ్గించాలి. కాస్త ఉడికాక దింపేసి క్రీం వేస్తే చాలు వేడి వేడి స్వీట్‌కార్న్, పాలకూర సూప్ రెడీ.