రుచి

కూరిన కూర..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడూ ఒకేరకమైన పులుసులు, ఇగురులూ తింటే బోర్ కొట్టేస్తాయి. అందుకే అప్పుడప్పుడూ కొత్తరకమైన వంటకాలను కోరుకుంటుంది నాలుక. పప్పు, పులుసులో కూరిన కూరలను నంజుకుని తింటే ఆ రుచే వేరు.. మరి అలాంటి కూరిన కూరలను ఒకసారి చూద్దామా..!

కాకరకాయలతో..

కావలసిన పదార్థాలు
సన్నని కాకరకాయలు: నాలుగు
మజ్జిగ: పావు కప్పు
నూనె: అరకప్పు
ఉప్పు: తగినంత
ఆవకాయలోని పిండి: కప్పు
పసుపు: పావు చెంచా

తయారీ విధానం

కాకర కాయల్ని నిలువుగా గాట్లు పెట్టి వాటిలోని గింజల్ని తీసేయాలి. ఈ కాయల్ని కుక్కర్‌లోకి తీసుకుని మజ్జిగ, కొద్దిగా ఉప్పు సగం ఉడికించి తీసేయాలి. తరువాత కాకరకాయల్ని కాసేపు ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని తడి పూర్తిగా పోతుంది. తరువాత వీటిలో ఆవకాయ పిండిని కూరాలి. ఇప్పుడు స్టవ్‌పై బాణలిని ఉంచి వేడిచేసి కాకర కాయల్ని అందులో జాగ్రత్తగా ఉంచి వేయించాలి. మధ్యలో ఒకసారి పసుపు వేసి మరో వైపుకు తిప్పాలి. మంట తగ్గించి నెమ్మదిగా మార్చి మార్చి వేయిస్తే కాసేపటికి ఎర్రగా వేగుతాయి. కావాలనుకుంటే ఆవకాయ పిండిలో దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్రపొడి, వేయించిన నువ్వుల పొడి కూడా కలిపి కాకర కాయల్లో కూరచ్చు. ఇవి మరింత రుచిగా ఉంటాయి.

దోసకాయలతో..

కావలసిన పదార్థాలు

చిన్న దోసకాయలు: పది
నువ్వుల పొడి: మూడు చెంచాలు
పల్లీల పొడి: నాలుగైదు చెంచాలు
అల్లం వెల్లుల్లి ముద్ద: చెంచా
గరం మసాలా: పావు చెంచా
ఉప్పు: తగినంత
కారం: రెండు చెంచాలు
పసుపు: చిటికెడు
ఉల్లిపాయ: ఒకటి
కరివేపాకు రెబ్బ: ఒకటి
నూనె: పావు కప్పు

తయారీ విధానం

ముందుగా దోసకాయల్ని నిలువుగా చివర్లు విడిపోకుండా నాలుగు భాగాలు వచ్చేలా అంటే వంకాయ గుత్తిలా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గినె్నలో నువ్వులపొడి, పల్లీలపొడి, అల్లం, వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, తగినంత ఉప్పు, కారం, పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకుని ముద్దలా కలుపుకోవాలి. తడి సరిపోకపోతే కాసిన్ని నీళ్లు కూడా చల్లుకోవచ్చు. దోసకాయల్లో ఈ మసాలా ముద్దను నెమ్మదిగా కూరాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి కరివేపాకు వేసి వేయించి ఈ కాయల్ని జాగ్రత్తగా ఉంచి మూతపెట్టేయాలి. దీని సిమ్‌లో ఉంచి మధ్యమధ్యలో తిప్పుతూ మగ్గనివ్వాలి. ఇవి మెత్తగా అయ్యాక దింపేస్తే సరి.. ఎంతో కమ్మని ఈ స్ట్ఫ్‌‌డ దోసకాయల కూర చాలా రుచిగా ఉంటుంది.

బెండకాయలతో..

కావలసిన పదార్థాలు

బెండకాయలు: పనె్నండు
మినపప్పు: పావుకప్పు
సెనగపప్పు: అరకప్పు
దనియాలు: రెండు చెంచాలు
జీలకర్ర: చెంచా
ఎండుమిర్చి: పది
పల్లీలు: పావుకప్పు
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: తగినంత
పసుపు: అరచెంచా

తయారీ విధానం

స్టవ్‌పై బాణలిని ఉంచి అందులో రెండు చెంచాల నూనె వేసి వేడిచేసి మినపప్పు, సెనగపప్పు, దనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు వేయించుకోవాలి. ఇవి చల్లారాక తగినంత ఉప్పు, పసుపు వేసి మిక్సీ పొడి చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముచ్చికలు తీసేసి నిలువుగా చీల్చి ఇందులో ఈ కారాన్ని కూరాలి. తరువాత స్టవ్‌పై బాణలిని ఉంచి నూనెను వేయాలి. వేడయ్యాక ఈ బెండకాయల్ని అందులో ఉంచి ఎర్రగా వేయించుకోవాలి. వేగిన తరువాత మిగిలిన కూర కారాన్ని కూడా వేసి దింపేయాలి. అంతే ఎంతో రుచికరమైన స్ట్ఫ్‌‌డ బెండీ రెడీ..

పొట్లకాయతో..

కావలసిన పదార్థాలు

పొట్లకాయ: పెద్దది
ఉడికించిన బంగాళాదుంపలు: రెండు
కొత్తిమీర: కట్ట
కరివేపాకు: రెండు రెబ్బలు
పచ్చిమిర్చి మిశ్రమం: అరచెంచా
ఆవాలు: పావు చెంచా
జీలకర్ర: పావు చెంచా
ఉప్పు: తగినంత
పసుపు: కొద్దిగా
నూనె: అరకప్పు

తయారీ విధానం

పొట్లకాయను పొడవాటి చక్రాల్లా కోసి కుక్కర్‌లో వేసి ఒక కూత వచ్చేవరకు ఉడికించుకుని తీసుకోవాలి. బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్రను వేయించుకోవాలి.
తరువాత కరివేపాకు వేయించి ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి మిశ్రమం, ఉప్పు వేసుకుని బాగా కలపాలి. కూరంతా ముద్దలా అయ్యాక కొత్తిమీర తరుగు చల్లి దింపేయాలి. వేడి కొద్దిగా చల్లారాక ఉడికించిన పొట్లకాయ ముక్కల్లో ఈ ఆలూ కూరను కొద్దికొద్దిగా కూరాలి. బాణలిలో మిగిలిన నూనెను వేడిచేసి ఈ కూరముక్కల్ని ఉంచాలి. ముక్కలు కొద్దిగా వేగాక దింపేస్తే సరిపోతుంది.

వంకాయతో..

కావలసిన పదార్థాలు

వంకాయలు: అరకిలో
వెన్న: 100 గ్రాములు
ఎండుమిర్చి: 8
దనియాలు: మూడు చెంచాలు
జీలకర్ర: ఒక చెంచా
సెనగపప్పు: మూడు చెంచాలు
మినపప్పు: రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
నూనె: రెండు చెంచాలు

తయారీ విధానం

చిన్న బాణలిని స్టవ్‌పై ఉంచుకుని ఎండుమిర్చి, దనియాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు విడివిడిగా వేయించాలి. తరువాత వీటన్నింటినీ మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా, గరుకుగా ఉండేలా పొడి చేసుకోవాలి. ఈ పొడిలో తగినంత ఉప్పు కలపాలి. తరువాత దీనిలో వెన్న కలిపి ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత ఒక్కో కాయని గుత్తిగా కోసి అందులో వెన్న కలిపిన కూరను కూరాలి. లోపలి స్ట్ఫ్ బయటకు రాకుండా కాయలను దారంతో కట్టాలి. వెడల్పాటి బాణలిలో టేబుల్ స్పూన్ నూనెవేసి స్ట్ఫ్‌‌డ వంకాయలన్నీ ఒకదాని పక్కన ఒకటి ఉంచి ఐదు నుండి పది నిముషాలు వేయించాలి. తరువాత జాగ్రత్తగా రెండోవైపు తిప్పి మరో టేబుల్ స్పూన్ నూనె వేసి అలాగే వేయించి దించాలి.