రుచి

స్టాటర్స్ ఇంట్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజూ ఇంట్లో మురుకులు, జంతికలు తినాలంటే బోర్‌గా ఉంటుంది. అలాగని రోజూ హోటల్‌కి వెళ్లి నచ్చిన రుచులు తింటే.. అనారోగ్యానికి అనారోగ్యం, డబ్బులకి డబ్బులు పోతాయి. కాబట్టి నచ్చినది ఇంట్లో చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం.. మరి అలాంటి హోటల్ రుచులు ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం!

పనీర్ ఫింగర్స్

కావలసిన పదార్థాలు

పొడవుగా తరిగిన పనీర్ ముక్కలు: కప్పు
నిమ్మరసం: చెంచా
కారం: చెంచా
మొక్కజొన్న పిండి: రెండు చెంచాలు
మైదా: రెండు చెంచాలు
మిరియాల పొడి: అరచెంచా
బ్రెడ్ పొడి: కప్పు
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా

తయారీ విధానం

పనీర్ ముక్కల్ని ఒక గినె్నలోకి తీసుకుని వాటిపై నిమ్మరసం, ఉప్పు, కారం వేసి కలిపి పెట్టుకోవాలి. మరో గినె్నలో మొక్కజొన్న పిండి, మైదా, మిరియాల పొడి, తగినంత ఉప్పు తీసుకోవాలి. అందులో నీళ్లు వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఒక ప్లేట్‌లో బ్రెడ్ పొడి వేసుకోవాలి. ఇదయ్యాక బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. పనీర్ ముక్కలను మైదా మిశ్రమంలో ముంచి బ్రెడ్ పొడిలో ముంచి కాగుతున్న నూనెలో వేయాలి. ఇవి బంగారు రంగు వచ్చాక తీసేయాలి. టొమాటో సూపుతో ఇవి చాలా బాగుంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.

వెజ్ సీక్ కబాబ్

కావలసిన పదార్థాలు

బంగాళాదుంపలు: మూడు
సోయా మీల్‌మేకర్: ఒకటిన్నర కప్పు
బఠాణీలు: అరకప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద: చెంచా
ఉప్పు: తగినంత
ధనియాల పొడి: చెంచా
గరం మసాలా: అరచెంచా
కారం: అరచెంచా
మిరియాలపొడి: అరచెంచా
ఆమ్‌చూర్ పొడి: పావు చెంచా
వేయించిన సెనగపిండి: రెండు చెంచాలు
నూనె: పావు కప్పు

తయారీ విధానం

ముందుగా బఠాణీలను నానబెట్టి ఉడికించుకోవాలి. అలాగే బంగాళాదుంపలను కూడా ఉడికించుకోవాలి. సోయా మీల్‌మేకర్‌ను వేడినీటిలో వేయాలి. అవి మునిగాక నీటి వంపేసి వాటిని పిండి విడిగా మరో గినె్నలోకి తీసుకోవాలి. ఈ మీల్‌మేకర్‌లో ఉడికించిన ఆలూ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి. తరువాత నూనె తప్ప మిగిలిన అన్ని పదార్థాలు వేసి గట్టిగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి మరీ మెత్తగా ఉంటే సెనగపిండిని చేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తొమ్మిది భాగాలుగా చేయాలి. ఒక్కోదాన్ని ఇనుప చువ్వలకు లేదా పొడవాటి చాప్‌స్టిక్స్‌కు గుచ్చుకోవాలి. తరువాత వీటికి నూనె రాయాలి. ఇప్పడు వీటిని 220 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసిన ఒవెన్‌లో పదిహేను నిముషాలు బేక్ చేసుకోవాలి. లేదా గ్రిల్ పాన్‌ను స్టవ్‌పై ఉంచి ఒక చువ్వను ఉంచి తిప్పుతూ కాల్చుకుని తీసుకుంటే చాలు. వీటిని పుదీనా చట్నీతో కలిపి వడ్డిస్తే భలే ఉంటాయి.

బేబీకార్న్ ఫింగర్ చిప్స్

కావలసిన పదార్థాలు

బేబీకార్న్: పది
అల్లం వెల్లుల్లి: ఒక చెంచా
పచ్చిమిర్చి ముద్ద: ఒక చెంచా
మిరియాల పొడి: అర చెంచా
ఆవపొడి: అరచెంచా
గుడ్డు: ఒకటి
బ్రెడ్ పొడి: అరకప్పు
సోయాసాస్: ఒక చెంచా
ఉప్పు: రుచికి సరిపడా..

తయారీ విధానం

ఓ గినె్నలో అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆవపొడి, మిరియాల పొడి, సోయాసాస్, ఉప్పు వేసి కలపాలి. తరువాత అందులోనే బేబీకార్న్ కూడా వేసి ఈ మిశ్రమం వాటికి బాగా పట్టేలా చేసి అరగంటసేపు నాననివ్వాలి. తరువాత వీటిని గిలక్కొట్టిన గుడ్డుసొనలో ముంచి బ్రెడ్‌పొడిపై దొర్లించాలి. ఇప్పుడు కాగిన నూనెలో వేయించి తీస్తే సరి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బేబీకార్న్ ఫింగర్ చిప్స్ తయారు.

స్ప్రింగ్ రోల్స్

కావలసిన పదార్థాలు

మైదా: కప్పు
వేడి నీళ్లు: అరకప్పు
ఉల్లిపాయ: పెద్దది ఒకటి
అల్లం, వెల్లుల్లి తరుగు: చెంచా
క్యారెట్: ఒకటి
క్యాబేజీ తరుగు: కప్పు
కాప్సికం: ఒకటి
ఉల్లికాడలు: రెండు
సోయాసాస్: చెంచా
ఉప్పు: చెంచా
నూనె: వేయించడానికి సరిపడా
మిరియాలపొడి: చెంచా
ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం

ఒక గినె్నలో రెండు చెంచాల మైదా తప్ప మిగిలిన దాన్ని తీసుకుని అందులో నూనె, వేడి నీళ్లు, ఉప్పు తీసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనిపై ఒక తడిబట్టను కప్పి ఇరవై నిముషాలు నాననివ్వాలి. ఇప్పుడు బాణలిని స్టవ్‌పై పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. ఇది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దానిలోనే అల్లం, వెల్లుల్లి తరుగు కూడా వేసుకుని రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. తరువాత క్యాబేజీ, కారెట్, కాప్సికం, ఉల్లికాడల తరుగు వేసి మూత పెట్టాలి. అన్నీ ఉడికాక సోయాసాస్ కలిపి రెండు నిముషాలు ఉంచి దించేయాలి. తరువాత పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. మిగిలిన మైదాను నీళ్లతో జిగురులా కలుపుకోవాలి. ఒక ఉండను తీసుకుని చిన్న చపాతీలా ఒత్తుకుని కొద్దిగా వెజిటబుల్ మిశ్రమాన్ని ఉంచి రోల్‌లా చుట్టేయాలి. అంచులు ఊడిరాకుండా మైదాతో అతికించాలి. ఇలానే మిగిలిని పిండినీ చేసుకోవాలి. మరోవైపు స్టవ్ బాణలి ఉంచి అందులో నూనె పోయాలి. నూనె కాగాక చేసి ఉంచుకుని మైదాపిండి రోల్స్‌ని వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అంతే ఎంతో రుచికరమైన స్ప్రింగ్‌రోల్స్ రెడీ.

హనీ చిల్లీ పొటాటో

కావలసిన పదార్థాలు

బంగాళాదుంపలు: నాలుగు
కార్న్‌ఫ్లోర్: ఎనిమిది చెంచాలు
ఉప్పు: తగినంత
కారం: రెండు చెంచాలు
ఉల్లికాడలు: నాలుగు
కాప్సికమ్: రెండు
వెల్లల్లి ముద్ద: రెండు చెంచాలు
నువ్వులు: రెండు చెంచాలు
తేనె: రెండు చెంచాలు
సోయాసాస్: సగం చెంచా
చిల్లీ సాస్: నాలుగు చెంచాలు
నూనె: తగినంత

తయారీ విధానం

ముందుగా బంగాళాదుంపలను పొట్టు తీసి సన్నగా పొడవాటి ముక్కల్లా కోయాలి. ఒక గినె్న తీసుకుని అందులో కార్న్‌ఫ్లోర్, ఉప్పు, కారం వేసి కలపాలి. స్టవ్‌పై బాణలిని పెట్టి అందులో నూనె వేసి వేడిచేయాలి.
బంగాళాదుంప ముక్కలను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో దొర్లించి కాగిన నూనెలో వేసి వేయించాలి. ఇలా అన్నింటినీ వేయించిన తరువాత మరో బాణలిని పెట్టుకుని అందులో ఒక స్పూన్ నూనె వేసి కాగాక వెల్లుల్లి ముద్ద, ఉల్లికాడలు వేసి ఓ నిముషం పాటు వేగనివ్వాలి. తరువాత ఇందులో కాప్సికం ముక్కలు, తేనె, ఉప్పు, సోయాసాస్, చిల్లీసాస్ వేసి ఓ నిముషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు వేయించి ఉంచిన బంగాళాదుంప ముక్కలు, నువ్వులు వేసి బాగా కలిపి దించేయాలి. అంతే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హనీ చిల్లీ పొటాటోస్ రెడీ. సాయంత్రాలు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా ఈ స్నాక్‌ను ఇవ్వొచ్చు.