రుచి
నోరూరించే నూడుల్స్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఫాస్ట్ఫుడ్ అంటే పిల్లలకు ఉండే ఇష్టం అంతా ఇంతా కాదు. సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చాక కానీ, రాత్రిపూట కానీ రకరకాల నూడుల్స్ చేసుకుని తింటే ఆ రుచే వేరు. పిల్లలకు అన్నం, పప్పుల్లాంటివి కాకుండా నూడుల్స్ వంటివి ఇస్తే ఎగిరిగంతేసి మరీ తింటారు. అలాగని హోటల్స్‌లోనివి కాకుండా ఇంట్లోనే నూడుల్స్ చేసిస్తే మంచిది కదా.. అలాంటి నూడుల్స్ రుచులను
ఒకసారి చూద్దాం..
హక్కా వెజిటబుల్ నూడుల్స్
కావలసిన పదార్థాలు
హక్కా నూడుల్స్: పావు కిలో
ఉల్లికాడలు: రెండు టేబుల్‌స్పూన్లు
క్యారెట్: ఒకటి
బీన్స్: నాలుగు
క్యాబేజీ: చిన్న ముక్క
పుట్టగొడుగులు: నాలుగు
కాప్సికమ్: ఒకటి
సోయాసాస్: టేబుల్ స్పూన్
వెనిగర్: టీ స్పూన్
చిల్లీసాస్: టీ స్పూన్
మిరియాలపొడి: టీ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా..
నూనె: టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు: రెండు
తయారుచేసే విధానం
వెడల్పాటి బాణలిలో నీళ్లు పోసి మరిగించి నూడుల్స్ వేసి ఉడికించాలి. నూడుల్స్ ఉడికాక ఆ నీళ్లన్నీ వంపేసి చల్లని నీళ్లతో కడిగితే నూడుల్స్ విడివిడిగా వస్తాయి. తరువాత కూరగాయలన్నింటినీ సన్నని ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఒక చిన్న గినె్నలో వెనిగర్, సాస్ వేసి కలపాలి. స్టవ్‌పై వెడల్పాటి బాణలిని ఉంచి నూనెవేసి కాగాక సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి ఓ నిముషం వేయించాలి. తరువాత ఉల్లికాడలు, క్యారెట్ ముక్కలు వేసి వేగాక పుట్టగొడుగులు, బీన్స్ ముక్కలూ వేసి వేయించాలి. ఒక నిముషం వేగాక కాప్సికమ్, క్యాబేజీ ముక్కలు కూడా వేసి వేగాక సాస్ మిశ్రమం వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో ఉడికించి చల్లార్చిన నూడుల్స్ వేసి బాగా కలిపి మిరియాల పొడి వేసి రెండు నిముషాలు వేయించి దించితే సరి.
చైనీస్ చికెన్ నూడుల్స్
కావలసిన పదార్థాలు
నూడుల్స్: అరకిలో
సోయాసాస్: అరకప్పు
నువ్వుల నూనె: పావుకప్పు
పంచదార: రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు: మూడు
చైనీస్ చికెన్ కోసం..
సోయాసాస్: పావుకప్పు
తెరియాకి సాస్: పావుకప్పు
వెల్లుల్లిరెబ్బలు: రెండు
ముడి పంచదార: పావుకప్పు
అల్లం తురుము: టీ స్పూన్
బోన్‌లెస్ చికెన్: పావుకిలో
నువ్వులనూనె: వేయించడానికి సరిపడా..
తయారుచేసే విధానం
వెడల్పాటి గినె్నను తీసుకుని చికెన్‌కోసం తీసుకున్న సోయాసాస్, తెరియాకి సాస్, వెల్లుల్లి ముక్కలు, పంచదార, అల్లం తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చికెన్‌కు పట్టించి ఫ్రిజ్‌లో రెండు, మూడు గంటలు నానబెట్టాలి. తరువాత వెడల్పాటి బాణలిలో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. ఇందులో నూడుల్స్ వేసి ఉడికించి నీళ్లు వంపేసి పక్కన పెట్టేయాలి. తరువాత విడిగా ఓ గినె్నలో నూడుల్స్ కోసం తీసుకున్న సోయాసాస్, నువ్వుల నూనె, పంచదార వేసి బాగా గిలక్కొట్టినట్లుగా కలపాలి. పంచదార కరిగిన తరువాత ఈ మిశ్రమాన్ని నూడుల్స్‌లో వేసి బాగా కలపాలి. తరువాత విడిగా స్టవ్‌పై వెడల్పాటి బాణలిని ఉంచాలి. తరువాత నూనె వేసి కాగిన తరువాత ఫ్రిజ్‌లో ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసి ఓ పదినిముషాల పాటు వేయించాలి. చికెన్ పూర్తిగా ఉడికాక అందులో విడిగా ఉడికించి ఉంచిన నూడుల్స్ వేసి కాసిన్ని నువ్వులు, ఉల్లిముక్కలతో అలంకరించి అందించాలి.
స్పగెట్టీ మీట్‌బాల్స్
కావలసిన పదార్థాలు
కీమా: ఒకటిన్నర కప్పు
నూడుల్స్: రెండు కప్పులు
వెల్లుల్లి తరుగు: రెండు చెంచాలు
ఆవాల ముద్ద: ఒకటిన్నర చెంచా
ఉప్పు: తగినంత
ఎండుమిర్చి గింజలు: రెండు చెంచాలు
మిరియాలపొడి: చెంచా
చీజ్ తురుము: రెండు చెంచాలు
బ్రెడ్‌పొడి: కప్పు
కోడిగుడ్డు: ఒకటి
ఆలివ్‌నూనె: మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ: ఒకటి
టొమాటోగుజ్జు: అరకప్పు
పుదీనా తరుగు: కొద్దిగా
తయారుచేసే విధానం
ముందుగా నూడుల్స్‌ని ఉడికించుని పక్కన పెట్టుకోవాలి. తరువాత వెడల్పాటి గినె్నలోకి కీమా, సగం వెల్లుల్లి తరుగు, ఆవాల ముద్ద, చెంచా ఎండుమిర్చి గింజలు, మిరియాల పొడి, కొద్దిగా చీజ్, బ్రెడ్‌పొడి వేసి బాగా కలుపుకుని పెట్టుకోవాలి. చివరగా గుడ్డు వేసి మరోసారి కలపాలి.
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె వేసుకుని ఈ ఉండల్ని వేయించుకుని తీసుకోవాలి. మరో బాణలిలో మిగిలిన నూనెను వేసి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగును వేసి వేయించాలి.
రెండు నిముషాలయ్యాక టొమాటో గుజ్జు, వేయించిన కీమా ఉండల్ని వేయాలి. రెండు, మూడు నిముషాలయ్యాక నూడుల్స్, మరికొంచెం ఉప్పు, మిరియాలపొడి, మిగిలిన ఎండుమిర్చి గింజలు, చీజ్, పుదీనా తరుగు వేసి బాగా కలిపి తీసేయాలి. అంతే ఎంతో రుచికరమైన స్పగెట్టీ మీట్‌బాల్స్ రెడీ.
స్పగెట్టీ
కావలసిన పదార్థాలు
ఉడికించిన స్పగెట్టీ నూడుల్స్: రెండు కప్పులు
ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు
పాస్తాసాస్: కప్పు
వెల్లుల్లి ముక్కలు: రెండు స్పూన్లు
నూనె: టేబుల్ స్పూన్
ఎండుమిర్చి గింజలు: టేబుల్ స్పూన్
థైం: ఒక స్పూన్
ఆలివ్‌లు: రెండు టేబుల్‌స్పూన్లు
పుట్టగొడుగులు: ఎనిమిది
ఉల్లికాడల తరుగు: అరకప్పు
కాప్సికం: రెండు
బేబీకార్న్ ముక్కలు: పావుకప్పు
ఎరుపురంగు క్యాబేజీ: చిన్న ముక్క
సోయాసాస్: టేబుల్‌స్పూన్
ఉప్పు: తగినంత
వేయించిన నువ్వులు: ఒక స్పూన్
వేయించిన పల్లీలు: ఒక స్పూన్
తయారుచేసే విధానం
ముందుగా కూరగాయలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి. స్టవ్‌పై బాణలి ఉంచి నూనె వేసి వేడిచేయాలి.
ఇది వేడయ్యాక వెల్లుల్లి, ఎండుమిర్చి గింజలు, థైం లేదా పుదీనా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఒక నిముషం వేగిన తరువాత ఇందులో కూరగాయల ముక్కలన్నింటినీ వేయాలి. ఇవి కాస్త వేగాక పాస్తా సాస్, ఉడికించి పెట్టుకున్న స్పగెట్టీ వేసి బాగా కలపాలి. తరువాత సోయాసాస్, తగినంత ఉప్పూ వేసి దింపేయాలి. వడ్డించేముందు వేయించిన నువ్వులు, పల్లీలు వేసి బాగా కలపాలి.
మష్రూమ్ నూడుల్స్
కావలసిన పదార్థాలు
పుట్టగొడుగులు: పావుకిలో
నూడుల్స్: పావుకిలో
ఉల్లిపాయలు: రెండు
వెల్లుల్లి: పది రెబ్బలు
క్రీమ్: కప్పు
చీజ్ తురుము: రెండు టేబుల్‌స్పూన్లు
వెన్న: మూడు టేబుల్‌స్పూన్లు
జీలకర్ర: టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
మిరియాలపొడి: అర టీస్పూన్
తయారుచేసే విధానం
ముందుగా నూడుల్స్‌ను ఉడికించి నీళ్లు వంపి చన్నీళ్లతో కడగాలి. పుట్టగొడుగుల్ని చిన్న ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు సన్నని ముక్కల్లా కోయాలి. తరువాత వెడల్పాటి బాణలిలో టేబుల్‌స్పూన్ వెన్న వేసి కరిగించాలి. ఇది కాగాక ఉడికించిన నూడుల్స్, చిటికెడు ఉప్పు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి.ఇప్పుడు మిగిలిన వెన్నవేసి ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కల్ని వేసి వేయించాలి. తరువాత పుట్టగొడుగు ముక్కలు, జీలకర్ర వేసి రెండు నిముషాలు వేయించాలి. తరువాత ఉప్పు, మిరియాలపొడి, నూడుల్స్, క్రీమ్ వేసి కాసేపు ఉడికించాలి. చివరగా తురిమిన చీజ్ వేసి ఓ నిముషం వేయించి దించాలి. అంతే ఎంతో రుచికరమైన మష్రూమ్ నూడుల్స్ రెడీ..
ఎగ్ నూడుల్స్
కావలసిన పదార్థాలు
హక్కా నూడుల్స్: పావు కిలో
క్యారెట్: రెండు
కాప్సికమ్: పెద్దది ఒకటి
సోయాసాస్: టీ స్పూన్
టొమాటోసాస్: రెండు టీ స్పూన్లు
పాస్తాసాస్: రెండు టీ స్పూన్లు
నిమ్మరసం: అర టీ స్పూన్
కోడిగుడ్లు: రెండు
వెల్లుల్లిరెబ్బలు: మూడు
ఉల్లిపాయ: ఒకటి
మిరియాలపొడి: అర టీ స్పూన్
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం
నీళ్లు మరిగించి నూడుల్స్ ఉడికించి చల్లని నీళ్లతో కడిగించి ఉంచాలి. బాణలిలో అర టీ స్పూన్ నూనె వేసి గుడ్లసొన, చిటికెడు ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలుపుతూ పొరటులా వేయించి తీసి పక్కన ఉంచాలి. మరో బాణలిలో మిగిలిన నూనె వేసి కాగాక వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించాలి. తరువాత సన్నగా తరిగిన కూరగాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత కొద్దిగా నీళ్లు చిలకరించి సోయాసాస్ వేసి కలిపి సిమ్‌లో పెట్టాలి. ఇప్పుడు పాస్తా సాస్, టొమాటోసాస్, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. తరువాత గుడ్డు పొరటును కూడా వేసి బాగా కలపాలి. చివరగా ఉడికించి పక్కన ఉంచిన నూడుల్స్ వేసి బాగా కలిపి రెండు నిముషా వేయించాలి. తరువాత నిమ్మరసం కలిపి దించి వేడివేడిగా పిల్లలకు అందించాలి.