రుచి

మండేఎండలో మజా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానిమ్మగింజల ఫలూదా

కావలసిన పదార్థాలు
దానిమ్మ గింజలు: ఒకటిన్నర కప్పు
నానబెట్టిన సబ్జాగింజలు: రెండు పెద్ద చెంచాలు గడ్డ పెరుగు: కప్పు
పిస్తా పలుకులు: కొన్ని
తయారుచేసే విధానం
ఒక కప్పు దానిమ్మ గింజలను జ్యూస్‌గా చేసుకోవాలి. ఆ జ్యూస్‌లో దానిమ్మ గింజలు, సబ్జా గింజలు వేసుకుని కలపాలి. ఈ రసాన్ని రెండు, మూడు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. సబ్జా గింజలు బాగా నానిపోయిన తరువాత ఫ్రిజ్‌లోంచి తీసేయాలి. గ్లాసులో ముందుగా దానిమ్మరసంతో సహా నానబెట్టిన సబ్జాగింజలు, దానిమ్మ గింజలు కొద్దిగా వేయాలి. దీనిపై పెరుగు వేయాలి. ఇలా మరో వరుస చేసుకుని పైన కొన్ని పిస్తాపలుకులు వేసుకోవాలి. ఇలా మూడు, నాలుగు వరుసలుగా వేసుకుని పైన పిస్తా పప్పులు చల్లుకోవా లి. దీనిలో కావాలనుకుంటే చెర్రీ పండ్లను కూడా వేసుకోవచ్చు. దీన్ని చల్లచల్లగా సర్వ్ చేస్తే వేసవిలో మజాగా ఉంటుంది.

క్వినోవా

కావలసిన పదార్థాలు
పెరుగు: రెండు కప్పులు
నిమ్మకాయ: ఒకటి
పుదీనా తరుగు: రెండు చెంచాలు
వండిన క్వినోవా: కప్పు
నల్లద్రాక్ష: పది
కీరదోస తురుము: రెండు చెంచాలు
మామిడి తురుము: రెండు చెంచాలు
కొత్తిమీర: కట్ట
ఆలివ్‌నూనె: చెంచా
స్ట్రాబెర్రీలు: కొన్ని
తయారుచేసే విధానం
ఒక గినె్నలో పెరుగు, పుదీనా తరుగు, సగం నిమ్మరసం వేసి ఫ్రిజ్‌లో అరగంటసేపు ఉంచాలి. ఇంతలో క్వినోవా, కీరదోస తురుము, మామిడి తురుము, కొత్తిమీర తరుగు, ఆలివ్‌నూనె, మిగిలిన నిమ్మరసం వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. అరగంటయ్యాక పెరుగును ఫ్రిజ్‌లోంచి బయటకు తీయాలి. గ్లాసుల్లో ముందుగా కొద్దిగా పెరుగు, దానిపై క్వినోవా మిశ్రమం, నల్లద్రాక్ష, స్ట్రాబెర్రీలు వేయాలి. తరువాత మళ్లీ పెరుగు.. ఇలా వరుసలుగా గ్లాసుల్లో వేసుకుంటూ రావాలి. పైన పండ్ల ముక్కలను వేసుకుంటే చాలు. క్వినోవాకు బదులు ఉడికించిన కొర్రలు కూడా వేసుకోవచ్చు. పూర్తి పోషకాలతో నిండిన దీన్ని పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టపడతారు.

పండ్లముక్కలతో..

కావలసిన పదార్థాలు
సగం ఉడికించిన ఫలూదా సేవ్: అరకప్పు
పాలు: కప్పు
నానబెట్టిన సబ్జా గింజలు: చెంచా
ఆపిల్: అర కప్పు
అరటిపండు: అర కప్పు
పైనాపిల్ ముక్కలు: అర కప్పు
దానిమ్మ గింజలు: పావు కప్పు
రోజ్ సిరప్: చెంచా
కండెన్స్‌డ్ మిల్క్: పావు కప్పు
తయారుచేసే విధానం
ఒక గ్లాసులో ముందు సేవ్ తీసుకోవాలి. తరువాత పాలు పోసి, సబ్జా గింజలు వేయాలి. దానిపైన రోజ్ సిరప్ వేయాలి. తరువాత పండ్ల ముక్కలు వేసి, కండెన్స్‌డ్ మిల్స్ వేయాలి. ఇప్పుడు మిగిలిన పాలు పోసి రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచి, బయటకు తీసి దానిమ్మ గింజలతో అలంకరిస్తే రుచికరమైన ఫలూదా తయారు.

మండేఎండలో మజా...

కస్టర్డ్‌తో..

కావలసిన పదార్థాలు
ఫలూదా సేవ్: రెండు చెంచాలు
సబ్జా గింజలు: చెంచా
పాలు: రెండు కప్పులు
రూఅఫ్జా: చెంచా
వెనిల్లా ఐస్‌క్రీమ్: ఒక స్పూన్
కస్టర్డ్ పొడి: చెంచా
డ్రైఫ్రూట్స్: మూడు చెంచాలు
పంచదార: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
రెండు చెంచాల పాలు తప్ప మిగిలిన పాలను ఒక గినె్నలోకి తీసుకుని మరిగించాలి. ఇంతలో పక్కకు తీసిన పాలల్లో కస్టర్డ్ పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరిగిన పాలల్లో సేవ్, పంచదార వేసి కలపాలి. తరువాత పాలల్లో కలిపిన కస్టర్డ్ కూడా వేసి రెండు నిముషాల తరువాత స్టవ్ కట్టేయాలి. ఇది చల్లారాక ముందు రూఅఫ్జాని గ్లాసుల్లో వేసి తరువాత పాల కస్టర్డ్‌ని వేయాలి. దానిపైన సబ్జాగింజలు వేసుకోవాలి. చివరగా ఐస్‌క్రీమ్, డ్రైఫ్రూట్స్ వేసుకుంటే చాలు కస్టర్డ్ ఫలూదా తయారు.

మామిడితో..

కావలసిన పదార్థాలు
సబ్జా గింజలు: రెండు చెంచాలు
మొక్కజొన్న పిండి: పావు కప్పు
చల్లటిపాలు: కప్పు
మామిడిపండు గుజ్జు: కప్పు
ఐస్‌క్రీమ్: కప్పు
టూటీఫ్రూటీ: కొన్ని
బాదాం: ఐదు
జీడిపప్పు: ఐదు
కిస్‌మిస్: పది
తయారుచేసే విధానం
ఒక గినె్నలో సబ్జా గింజలను నానబెట్టుకోవాలి. మరొక గినె్నలో కాసిని నీళ్లు తీసుకుని మొక్కజొన్న పిండిని వేస్తూ బాగా పల్చగా తయారుచేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి ఉంచి ఒకటిన్నర కప్పులు నీళ్లు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు తయారుచేసిపెట్టుకున్న మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని అందులో పోస్తూ సన్నని మంటపై ఉడికించాలి. ఇది చిక్కగా అయ్యేవరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి మురుకుల పీటలోకి తీసుకోవాలి. ఒక గినె్నలో ఐస్ ముక్కలు తీసుకుని వాటిపై మురుకుల్లా మొక్కజొన్న పిండిని ఒత్తుకోవాలి. ఇవి సన్నగా న్యూడుల్స్‌లా వస్తాయి. ఇప్పుడు ఒక గ్లాసు తీసుకుని కాసిని సబ్జా గింజలు వేయాలి. ఆ తరువాత మొక్కజొన్న నూడుల్స్ కొద్దిగా వేసుకోవాలి. వీటిపై రెండు చెంచాల మామిడిపండు గుజ్జు వేయాలి. ఇందులో చల్లటిపాలు పోసి కొద్దిగా ఐస్‌క్రీమ్ వేయాలి. చివర్లో సబ్జాగింజలు, మామిడిపండు ముక్కలు, బాదాం, కిస్‌మిస్, జీడిపప్పు పలుకులు, టూటీఫ్రూటీలతో అలంకరించి పైన మిగిలిన ఐస్‌క్రీమ్ వేయాలి. మండే ఎండల్లో పోషకాలు అందించే చల్లని, తియ్యని మ్యాంగో ఫలూదాను పిల్లలకు అందించే ఎగిరి గంతేస్తారు.

సోయా పాలతో..

కావలసిన పదార్థాలు
సోయా పాలు: పావు కప్పు
మామిడిపండు గుజ్జు: కప్పు
పాలపొడి: నాలుగు చెంచాలు
మొక్కజొన్న పిండి:
మూడు చెంచాలు
పాల క్రీమ్: రెండు చెంచాలు
పంచదార పొడి: నాలుగు చెంచాలు
నానబెట్టిన సబ్జా గింజలు: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
ఒక గినె్నలో పాలపొడి, మొక్కజొన్న పిండి, రెండు చెంచాల సోయాపాలు తీసుకుని పిండిలా కలిపి పెట్టుకోవాలి. మిగిలిన పాలను మరో గినె్నలోకి తీసుకుని మరిగించుకోవాలి. అందులో పాలపొడి మిశ్రమం వేసి బాగా కలిపి ఐదు నిముషాల తర్వాత దింపేయాలి. ఇది చల్లారాక మామిడిపండు గుజ్జు, క్రీమ్, పంచదార పొడి వేసి బాగా కలపాలి. ఓ అల్యూమినియం గినె్నలో ఈ మిశ్రమాన్ని తీసుకుని డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. రెండు గంటల తరువాత బయటకు తీసి మరోసారి మిక్సీ పట్టాలి. చిక్కగా అయిన మిశ్రమాన్ని గ్లాసులో తీసుకుని పైన సబ్జా గింజలు వేసుకుని తాగితే సరిపోతుంది. కావాలనుకుంటే దీనిలో మామిడి గుజ్జుగానీ, పండ్ల ముక్కలు కానీ, డ్రై ఫ్రూట్స్‌కానీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.