రుచి

ఇఫ్తార్ విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిమానం అనే ఆకలిని పెంచేది ఇఫ్తార్. రంజాన్ మాసం అంటే తోటివారిపై ప్రేమను చాటుకునే మాసం. ఈ మాసంలో ముస్లింలు.. ఇతర మతస్తులను ఇఫ్తార్‌కు ఆహ్వానిస్తారు. అలాగే ఇతర మతస్తులు కూడా తోటి ముస్లింలకు ఇఫ్తార్ విందును ఇస్తారు. ఈ రంజాన్ పర్వదినం రోజున కూడా స్పెషల్ ఆహారపదార్థాలతో స్నేహితులకు ఇఫ్తార్ విందును ఇవ్వండి..
*
దాల్ ఖీమా
కావలసిన పదార్థాలు
మటన్ ఖీమా:
250 గ్రాములు
కందిపప్పు: ఒక కప్పు
చింతపండు: కొద్దిగా
ఉల్లిపాయ: ఒకటి
పసుపు: అర చెంచా
కారం: రెండు చెంచాలు
పచ్చిమిర్చి: మూడు
కరివేపాకు:
రెండు రెబ్బలు
అల్లం-వెల్లుల్లి పేస్ట్:
రెండు చెంచాలు
గరం మసాలా:
ఒక చెంచా
నూనె: మూడు చెంచాలు
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా కందిపప్పును కడిగి చిటికెడు పసుపు, కొంచెం నూనె వేసి మెత్తగా ఉడికించాలి. తర్వాత చింతపండును కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టాలి. ఇప్పుడు వెడల్పాటి ప్యాన్ నూనె వేసి వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. తర్వాత ఇందులోనే పసుపు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, కరివేపాకు వేసి కొద్దిగా మీడియం మంటపై ఫ్రై చేసుకోవాలి. పోపు మొత్తం వేగిన తర్వాత ఇందులో బాగా శుభ్రం చేసిన ఖీమా, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి నీరంతా ఇగిరిపోయేదాకా వేయించాలి. తరువాత కప్పుడు నీరు పోసి ఉడికించాలి. ఖీమా బాగా ఉడికిన తరువాత చింతపండు పులుసు చిక్కగా తీసుకుని ఇందులో వేసి ఉడికించాలి. ఇందులోనే ముందు ఉడికించి పెట్టుకున్న కందిపప్పును మెదిపి ఇందులో వేసి ఉప్పు సరిచూసుకోవాలి.
ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి ఉడికించాలి. మొత్తం పప్పు, ఖీమా కలిపి సమానంగా ఉడికిన తరువాత గరం మసాలా వేసి దింపేయాలి. అంతే దాల్ ఖీమా రెసిపీ రెడీ. రంజాన్ స్పెషల్‌గా దీన్ని తయారుచేసి తీసుకోవచ్చు. ఇది అన్నం, చపాతీ, రోటీలతో చాలా మంచి కాంబినేషన్.
*
ఆఫ్ఘాన్ చికెన్ పులావ్
కావలసిన పదార్థాలు
చికెన్: కిలో
టొమాటోలు: మూడు
బియ్యం: మూడు కప్పులు
వెల్లుల్లి పాయలు: ఐదు
ఉల్లిపాయలు: మూడు
అల్లం: చిన్న ముక్క
యాలకులు: ఎనిమిది
ధనియాలు: ఒక చెంచా
జీలకర్ర: ఒక చెంచా
లవంగాలు: పది
కారం: ఒక చెంచా
దాల్చిన చెక్క: పెద్ద ముక్క
పచ్చిమిర్చి: మూడు
వేడి నీళ్ళు: ఐదు కప్పులు
నూనె: రెండు చెంచాలు
క్యారెట్: ఒకటి
ఎండుద్రాక్ష: అరకప్పు
తయారుచేసే విధానం
ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, టొమాటోలను సన్నగా కట్ చేసుకోవాలి. ఒక పాన్‌లో బాగా శుభ్రం చేసుకున్న చికెన్, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, లవంగాలు, దాల్చినచెక్క, ఉల్లిపాయలు, ధనియాలు, యాలకులు, ఉప్పు, నీళ్లు వేసి ముప్పై నిముషాలు బాగా ఉడికించాలి. తర్వాత ఉడికించుకున్న నీళ్లలో నుండి చికెన్ ముక్కలను వేరుగా తీసుకోవాలి. చికెన్‌ను ఉడికించుకున్న నీళ్ళు కనీసం ఐదు కప్పులు ఉండాలి. అయితే ఇంకా ఎక్కువగా ఉన్నట్లైతే మరికొద్దిసేపు ఉడికిస్తే చిక్కగా ఉడుకుతుంది. ఒక పెద్దపాన్‌లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. తర్వాత అందులో చికెన్ ముక్కలు, సన్నగా తరిగిన టొమాటోలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, జీలకర్ర, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చికెన్ ఉడికించుకున్న నీళ్లు, బియ్యం వేయాలి. బియ్యం మెత్తబడేవరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మంట తగ్గించి మొత్తం మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. అంతే నోరూరించే ఆఫ్ఘానీ చికెన్ పులావ్ తయారు. దీన్ని ఎండుద్రాక్ష, క్యారెట్ తురుముతో గార్నిష్ చేయాలి.
*
షీర్ కుర్మా
కావలసిన పదార్థాలు
సేమ్యాలు: మూడు కప్పులు
వెన్న తీయని పాలు: ఒక లీటరు
పంచదార: కప్పు
యాలకులు: నాలుగు
బాదం: పావు కప్పు
పిస్తా: పావు కప్పు
జీడిపప్పు: పావు కప్పు
మిల్క్ మెయిడ్: కప్పు
కుంకుమ పువ్వు: అర చెంచా
ఎండు ద్రాక్ష: అర కప్పు
ఖర్జూరం తరుగు:
పది గ్రాములు
నెయ్యి: రెండు చెంచాలు
వెన్న: కొద్దిగా
తయారుచేసే విధానం
ముందుగా స్టవ్‌పై బాణలి ఉంచి వేడెక్కాక అందులో వెన్న వేసి రెండు నిముషాల పాటు సేమియా వేసి గోధుమ రంగు వచ్చే వేయించాలి. తరువాత ఒక కప్పు పంచదార వేసి కలిపి అందులో కొద్దికొద్దిగా పాలను చేరుస్తూ కలుపుతూ ఉండాలి. పాలు కాగి పొంగు వచ్చాక ఎండు ద్రాక్ష, రెండు యాలకులు, సగం బాదం, జీడిపప్పు, పిస్తా వేసి మిగిలిన పంచదార కూడా వేసి కలపాలి. సేమియా ఉడికి పాలు సగమయ్యేంత వరకు సన్నని సెగపై పెట్టి కలపాలి. ఈ మిశ్రమంలో మిల్క్‌మెయిడ్ కూడా వేసి పది నిముషాల తరువాత కుంకుమ పువ్వు, ఖర్జూరం, యాలకులపొడి, డ్రై ఫ్రూట్స్ వేయాలి. రెండు నిముషాల తరువాత స్టవ్‌పై నుండి దింపేయాలి. అంతే ఎంతో రుచికరమైన షీర్ కుర్మా తయారు.
*
ఖీమా పకోడ
కావలసిన పదార్థాలు
ఖీమా: రెండు కప్పులు
ఉల్లిపాయ: ఒకటి
పచ్చిమిర్చి: నాలుగు
శనగపిండి: ఒక కప్పు
టొమాటొ: ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్:
ఒక చెంచా
గరంమసాల:
ఒక చెంచా
కబాబ్ మసాల:
ఒక చెంచా
ఉప్పు: తగినంత
నూనె: రెండు కప్పులు
తయారుచేసే విధానం
ముందుగా ఖీమా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఉప్పు, కీమా మసాలా, గరం మసాలా కూడా ఖీమా మిశ్రమంలో వేయాలి. అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఖీమా మిశ్రమంలో శనగపిండి జోడించి, అరకప్పు నీళ్ళు పోసి కొద్దిగా చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు చేత్తోనే కొద్దికొద్దిగా ఖీమా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని పకోడీల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలిని ఉంచి అందులో నూనెపోసి వేడిచేయాలి. ఇందులో ఖీమా పకోడీలను వేయాలి. మంటను పూర్తిగా తగ్గించి మూత పెట్టి అన్నివైపులా కాలే విధంగా పది నిముషాలు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అంతే నోరూరించే ఖీమా పకోడీలు రెడీ. వీటిని సర్వింగ్ ప్లేట్‌లో అమర్చి, ఉల్లిపాయ రింగులు, పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి.
*
కడై మటన్ గ్రేవీ
కావలసిన పదార్థాలు
మటన్: 750 గ్రాములు
ఉల్లిపాయలు: రెండు కప్పులు
టొమాటోలు: మూడు
అల్లం-వెల్లుల్లి పేస్ట్: ఒక చెంచా
పచ్చిమిర్చి: ఎనిమిది
కారం: అర చెంచా
గరంమసాలా: అర చెంచా
మీట్ మసాలా పొడి: అర చెంచా
ధనియాల పొడి: అర చెంచా
పసుపు: అర చెంచా
కస్తూరి మేతీ: అర చెంచా
కొత్తిమీర: అర కప్పు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: తగినంత
తయారుచేసే విధానం
ప్రెషర్ కుక్కర్‌లో మటన్, కొద్దిగా పసుపు

వేయాలి. అందులో నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. కుక్కర్‌లో ప్రెషర్ తగ్గిన తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. కాగే నూనెలో ఉడికించిన మటన్ ముక్కలు వేసి షాలో ఫ్రై చేసుకోవాలి.
ఐదు నిముషాల తర్వాత ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి మిక్స్‌చేస్తూ ఫ్రై చేయాలి. తరువాత ఇందులో సరిపడా నీళ్ళు పోయాలి. కాసేపయ్యాక ఇందులో కస్తూరి మేతీ, మీట్ మసాలా పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని కలిపి గ్రేవీ చిక్కపడేవరకు ఉడికించుకోవాలి. పదిహేను నిముషాలు ఉడికిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే కడై మటన్ గ్రేవీ తయారు.
*
ఖీమా సమోస
కావలసిన పదార్థాలు
చికెన్ ఖీమా: అర కిలో
మైదా: రెండు కప్పులు
బటర్: రెండు చెంచాలు
పెరుగు: రెండు చెంచాలు
నీళ్లు: తగినన్ని నూనె: రెండు కప్పులు
ఉల్లిపాయలు: రెండు
తరిగిన అల్లం: రెండు చెంచాలు
తరిగిన కొత్తిమీర: రెండు చెంచాలు
తరిగిన పుదీనా: రెండు చెంచాలు
పచ్చిమిర్చి: ఐదు
స్ప్రింగ్ ఆనియన్: అర కప్పు
పసుపు: కొద్దిగా కారం: ఒక చెంచా
జీలకర్ర పొడి: ఒక చెంచా
గరం మసాల: అర చెంచా
చికెన్ స్టాక్: ఒక కప్పు
ఉప్పు: తగినంత పంచదార: చిటికెడు
తయారుచేసే విధానం
ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. తరువాత మైదాలో కొద్దిగా ఉప్పు, బటర్, పెరుగు వేసి చపాతీపిండిలా కలుపుకోవాలి. దీనిపై ఓ తడిబట్టను కప్పి అరగంటపాటు ఉంచాలి. తరువాత చికెన్ ఖీమాను శుభ్రంగా కడిగి మొత్తం నీటిని పిండేసి పక్కన పెట్టుకోవాలి. పాన్‌ను స్టవ్‌పై ఉంచుకుని నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో మారేంత వరకూ వేయించుకోవాలి. తరువాత ఇందులో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి వేసి పదిహేను నిముషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ఖీమా, ఉప్పు కూడా వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఖీమా మెత్తగా వేగిన తరువాత అందులో కారం, పసుపు, జీలకర్ర వేయాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి. తరువాత ఇందులో పంచదార వేయాలి. తరువాత ఇందులో చికెన్ స్టాక్ వేయాలి. తక్కువ మంటలో ఉడికించాలి. గరం మసాలా కూడా జోడించి చివరగా కొత్తిమీర, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్‌ను కూడా చల్లుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని మరోసారి మిక్స్‌చేసి స్ట్ఫింగ్‌ను సిద్ధం చేసుకోవాలి. తరువాత సమోస కొరకు పిండి నుండి కొద్దిగా తీసుకుని చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకుని దీన్ని మధ్యలోకి కట్‌చేసి కోన్‌లా చేసుకోవాలి. ఇందులో చికెన్ స్ట్ఫ్‌ను ఉంచి క్లోజ్ చేసేయాలి. ఇలా అన్నింటినీ తయారుచేసుకుని అరగంటపాటు వీటిని ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. తరువాత బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకుని అందులో సమోసాలను వేసి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఖీమా సమోసా రెడీ. టొమాటో సాస్, మింట్ చట్నీ, పెరుగుతో ఇది బెస్ట్ కాంబినేషన్.