రుచి

ఓ సూపు చూద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానల్లో పిల్లలుకానీ, పెద్దలు కానీ చిరుతిళ్లే కావాలంటారు. జలుబు, దగ్గు, జ్వరాలు ఎక్కువగా వచ్చే ఈ సమయంలో చిరుతిళ్ల వల్ల మరిన్ని చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. చినుకుపడేవేళ కరకరలాడే పకోడీలు, నోరూరించే బజ్జీలు, ఘాటైన మసాలాలు రుచిగానే ఉంటాయి కానీ వ్యాధి నిరోధకశక్తిని ఏమాత్రం పెంచలేవు. ఈ కాలంలో దొరికే ఆకుకూరలు, ఇతర పదార్థాలతో తయారుచేసే అద్భుతమైన వంటకాలు చేసుకుంటే.. రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మరి ఆ వంటలేంటో చూసేద్దామా..

మటన్‌తో..

కావలసిన పదార్థాలు
మటన్ మూలుగ ఎముకలు: కిలో
బోన్‌లెస్ మటన్: 200 గ్రాములు
పలావు ఆకులు: రెండు
ఉల్లిపాయలు: రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక చెంచా
నెయ్యి: మూడు చెంచాలు
మిరియాలు: ఒక చెంచా
గరం మసాలా: ఒక చెంచా
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: కట్ట
పుదీన: కట్ట
తయారుచేసే విధానం
మటన్ ఎముకల్ని మంచినీళ్లతో శుభ్రంగా కడగాలి. ఉల్లిపాయల్లో ఒకదాన్ని పెద్ద ముక్కలుగా, మరోదాన్ని సన్నటి ముక్కలుగా కోసుకోవాలి. వెడల్పాటి పాన్‌లో మటన్ ముక్కలు, ఎముకలు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, పలావు ఆకు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు వేసి నాలుగు లీటర్ల నీళ్లు పోసి అవి సగం అయ్యేవరకూ ఉడికించాలి. తరువాత దీన్ని వడకట్టి ముక్కల్ని బయటకు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసం సూప్‌లో వేయాలి. దీనిలో గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా తురుము వేసి పది నిముషాలు ఉడికించాలి. తరువాత ఒక బాణలిని తీసుకుని స్టవ్‌పై ఉంది. నెయ్యి వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి దీన్ని సూపులో వేసి మరో పదినిముషాలు మరిగించాలి. చివరగా కొత్తిమీర తురుము వేసి అలంకరించి వేడివేడిగా వడ్డించాలి. *

స్వీట్‌కార్న్, పాలకూరతో..

కావలసిన పదార్థాలు
స్వీట్‌కార్న్: రెండు కప్పులు
వెల్లుల్లి తరుగు: ఒక చెంచా
మిరియాలపొడి: అర చెంచా
పాలకూర తరుగు: కప్పు
నూనె: రెండు చెంచాలు
క్రీం: కొద్దిగా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
స్టవ్‌పై బాణలి ఉంచి నూనె వేయాలి. ఇది వేడయ్యాక వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. నిముషమయ్యాక స్వీట్‌కార్న్ వేసి వేయించాలి. ఇవి కాస్త వేగాక నాలుగు కప్పుల నీళ్లుపోసి మంట పెంచాలి. ఇవి మరుగుతున్నప్పుడు తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి దింపేయాలి. ఈ నీళ్ల వేడి తగ్గాక స్వీట్‌కార్న్‌ను మిక్సీలో తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని మళ్లీ నీళ్లలో వేసి స్టవ్‌పై ఉంచాలి. రెండు నిముషాల తర్వాత పాలకూర తరుగు వేసి మంట తగ్గించాలి. కాస్త ఉడికాక దింపేసి క్రీం వేస్తే చాలు. ఈ సూప్ మంచి రుచిగా ఉండి చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది. *

మునగాకుతో..

కావలసిన పదార్థాలు
మునగాకు: కప్పు
బంగాళాదుంప: ఒకటి
క్యారెట్: ఒకటి
బిర్యానీ ఆకు: ఒకటి
మిరియాలు: పది
అల్లం ముక్క: అంగుళం
ఉప్పు: తగినంత
మిరియాల పొడి: పావు చెంచా
క్రీం: ఒక చెంచా
తయారుచేసే విధానం
మునగాకును శుభ్రంగా కడిగి వెడల్పాటి గినె్నలోకి తీసుకుని బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బిర్యానీ ఆకు, మిరియాలు, అల్లం వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి. చల్లారాక మిక్సీలో గుజ్జులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి మళ్లీ స్టవ్‌పై ఉంచి ఒక పొంగు రానివ్వాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి కలిపి దింపేయాలి. తాగే ముందు క్రీముతో అలంకరించుకునే నోరూరించే వేడివేడి మునగాకు సూపు తయారు. ఇది ఎంతో ఆరోగ్యకరమైనది కూడా. *

సోయకూరతో..
కావలసిన పదార్థాలు
సోయకూర: కట్ట
పెసరపప్పు: పావుకప్పు
వేయించిన మిరియాలపొడి: అరచెంచా
జీలకర్రపొడి: చెంచా
నిమ్మరసం: రెండు చెంచాలు
పచ్చిమిర్చి: ఒకటి
నూనె: రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
తరిగిన సోయకూర, పెసరపప్పు, రెండు కప్పుల నీళ్లు కలిపి కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. అడుగు మందంగా ఉన్న పాన్ తీసుకుని స్టవ్‌పై ఉంచి అందులో నూనె వేయాలి. ఇది వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్రపొడి, మిరియాలపొడి వేయాలి. దీనికి ఉడికించిన సోయకూర, పెసరపప్పు మిశ్రమం, మరికొంచెం నీళ్లు పోసి మరిగించాలి. ఇది కాస్త చిక్కగా అయ్యాక తగినంత ఉప్పువేసి మరో ఐదు నిముషాల పాటు మరిగించాలి. స్టవ్ కట్టేసి నిమ్మరసం కలిపి సర్వ్ చేయాలి. ఎంతో ఆరోగ్యకరమైన సోయకూర సూప్ తయారు. *

చికెన్ సూప్

కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్: కప్పు
మీల్‌మేకర్ గ్రాన్యూల్స్: కప్పు
పచ్చిమిర్చి: రెండు
ఉల్లిపాయ: ఒకటి
పుదీనా ఆకులు: కొన్ని
కొత్తిమీర: కట్ట
పసుపు: చిటికెడు
ఉప్పు: తగినంత
వెల్లుల్లి రెబ్బలు: రెండు
మిరియాలపొడి: అరచెంచా
ఉల్లికాడల తరుగు: కొద్దిగా
తయారుచేసే విధానం
ముందుగా మీల్‌మేకర్ గ్రాన్యూల్స్‌ని ఉడికించి నీళ్లు పిండేయాలి. తరువాత ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా ఆకులు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడిని మిక్సీలో తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు, మీల్‌మేకర్ గ్రాన్యూల్స్, తగినంత ఉప్పు, పసుపు ఒక గినె్నలోకి తీసుకుని అందులో కొత్తిమీర మిశ్రమం వేసుకోవాలి. మూడుకప్పుల నీళ్లు, ఉల్లికాడల తరుగూ వేసి మూడు కూతలు వచ్చేవరకు కుక్కర్‌లో ఉడికించుకుంటే వేడివేడి సూప్ తయారైనట్లే.. *

టమాటర్ సంత్ర కా షోర్బా

కావలసిన పదార్థాలు
టొమాటోలు: ఏడు
కొత్తిమీర: ఒకటి
రొయ్యలు: ఐదు
నూనె: రెండు చెంచాలు
యాలకులు: రెండు
జీలకర్ర: అరచెంచా
వాము: అరచెంచా
దాల్చినచెక్క: చిన్నముక్క
మిరియాలు: అరచెంచా
ఎండుమిర్చి: రెండు
కమలాపండ్లు: రెండు
కారం: అరచెంచా
సెనగపిండి: చెంచా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
కొత్తిమీర, టొమాటోలను విడివిడిగా తరిగి పెట్టుకోవాలి. కుక్కర్‌లో నూనె వేడిచేసి యాలకులు, జీలకర్ర, వాము, దాల్చినచెక్క, మిరియాలు, ఎండుమిర్చి వేయించాలి. రెండు నిముషాలయ్యాక టొమాటోలు, తగినంత ఉప్పు, కారం, సెనగపిండి వేయాలి.
రెండు కప్పుల నీళ్లు, శుభ్రం చేసిన రొయ్యలు వేసి మూత పెట్టేయాలి. నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ అపేయాలి. ఇందులో కమలాపండ్ల రసం వేసి రెండు నిముషాలు స్టవ్‌పై ఉంచి దింపేయాలి. దీన్ని వడకట్టుకుని గినె్నలోకి తీసుకుని కొత్తిమీరతో అలంకరిస్తే చాలు ఎంతో రుచికరమైన టమాటర్ సంత్ర కా షోర్బా తయారు.