రుచి

కాలీ‘ఫ్లేవర్’ అదరహో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలంలో ఎక్కువగా వచ్చే కాయగూర కాలీఫ్లవర్. ఈ సీజన్‌లో రుచికరమైన ఆకుపచ్చని కూరగాయలు నోరూరిస్తుంటాయి. అటువంటి ఆకుపచ్చని కూరగాయల్లో కాలీఫ్లవర్ ఒకటి. ఇది రుచికరమైన మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అధికంగా కలిగి ఉంది. కాలీఫ్లవర్‌లో విటమిన్ సి, లోఫ్యాట్, పుష్కలంగా ఉండి కేన్సర్‌తో పోరాడుతుంది. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఫలితంగా ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు. గుండెపోటును దూరం చేసే విటమిన్లు అయిన బి1, బి2, బి3, బి5, బి6, బి9లు కాలీఫ్లవర్లో ఉన్నాయి. శరీరానికి కావలసిన ప్రొటీన్లను అందజేసే కాలీఫ్లవర్‌తో కూరలే కాకుండా గోబీ మంచూరియా, 65, మసాలా కూర.. ఇలా పిల్లలకు నచ్చేవిధంగా తయారుచేసుకోవచ్చు. మరి ఈ రుచికరమైన వంటలను ఎలా తయారుచేయాలో చూద్దామా..
*
కాలీఫ్లవర్ రైస్
*
కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్: అర పువ్వు
బాసుమతి అన్నం: రెండు కప్పులు
ఉల్లిపాయ: ఒకటి
పచ్చిమిర్చి: రెండు
జీలకర్ర: అర చెంచా
పసుపు: పావు చెంచా
కారం: అర చెంచా
దాల్చిన చెక్క: కొద్దిగా
లవంగాలు: నాలుగు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
కొత్తిమీర: కొద్దిగా
*
తయారుచేసే విధానం
ముందుగా కాలీఫ్లవర్‌ను చిన్న చిన్న పూవులుగా విడదీసుకోవాలి. తరువాత వీటిని మరుగుతున్న నీళ్లలో వేసి కాసేపు ఉంచాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తరువాత ఒక పాన్‌ను తీసుకుని దాన్ని స్టవ్‌పై ఉంచి నూనె పోసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేయాలి. జీలకర్ర చిటపటలాడిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. పోపు వేగిన తరువాత అందులో కారం, పసుపు, కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత ఇందులోనే కాలీఫ్లవర్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి సన్నని మంటపై పదినిముషాలు వేయించాలి. ఇలా గోబీ బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. గోబీ మెత్తగా మారిన తరువాత ఇందులో ముందుగా వండి పెట్టుకున్న అన్నవం వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అలా ఐదు నిముషాలు తక్కువ మంటపై వేయించాలి. చివరగా కొత్తిమీర వేసి బాగా కలిపి దింపేయాలి. అంతే గోబీ రైస్ తయారు.
*
గోబీ మంచూరియా
*
కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్: రెండు కప్పులు
నూనె: వేయించడానికి సరిపడా
మైదా: ఐదు చెంచాలు
కార్న్ ఫ్లోర్: మూడు చెంచాలు
ఉప్పు: తగినంత
మిరియాల పొడి: పావు చెంచా
ఉల్లిపాయ తరుగు: అరకప్పు
పచ్చిమిర్చి తరుగు: పావు కప్పు
వెల్లుల్లిపాయల తరుగు: మూడు చెంచాలు
కెచెప్: రెండు చెంచాలు
రెడ్ చిల్లీ సాస్: రెండు చెంచాలు
నీళ్లు: తగినన్ని
కార్న్‌ఫ్లోర్: రెండు చెంచాలు
సోయాసాస్: నాలుగు చెంచాలు
వైట్ వెనిగర్: రెండు చెంచాలు
తయారుచేసే విధానం: ముందుగా నాన్‌స్టిక్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారగానే అందులో కెచప్, రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో సోయాసాస్, వెనిగర్ వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో రెండు చెంచాల కార్న్‌ఫ్లోర్‌లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. దీన్ని స్టవ్‌పై ఉంచిన సాస్ మిశ్రమంలో వేసి ఐదు నిముషాల పాటు బాగా కలపాలి. తరువాత ఈ సాస్‌ను పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గినె్నను తీసుకుని అందులో మైదా, కార్న్‌ఫ్లోర్, మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమంలో కాలీఫ్లవర్‌ను వేయాలి. స్టవ్‌పై బాణలి ఉంచి నూనెను పోయాలి. నూనె కాగిన తరువాత కాలీఫ్లవర్‌ను ఇందులో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇలా కాలీఫ్లవర్ అంతటినీ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా తయారుచేసి పెట్టుకున్న సాస్‌ను మళ్లీ స్టవ్‌పై ఉంచి సిమ్‌లో పెట్టుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్‌ను కలిపి ఐదు నిముషాల పాటు వేడిచేయాలి. అంతే అందరికీ నోరూరించే గోబీ మంచూరియా తయారు.
*
గోబీ బటర్ మసాలా
*
కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్: ఒకటి పసుపు: అర చెంచా
బటర్: మూడు చెంచాలు బిర్యానీ ఆకు: ఒకటి
లవంగాలు: రెండు యాలకులు: రెండు
దాల్చిన చెక్క: చిన్న ముక్క ఉల్లి తరుగు: అర కప్పు
టొమాటో తరుగు: అర కప్పు అల్లం-వెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు
కారం: రెండు చెంచాలు ధనియాల పొడి: మూడు చెంచాలు
గరం మసాలా: అర చెంచా జీడిపప్పు పలుకులు: కొన్ని
కసూరీ మేథీ: అర చెంచా తాజా క్రీమ్: పావు కప్పు
నూనె: రెండు చెంచాలు కొత్తిమీర తరుగు: కొద్దిగా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం: కాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. తరువాత స్టవ్‌పై ఒక గినె్నలో నీళ్లు తీసుకోవాలి. వీటిని బాగా మరిగించాలి. ఇందులో పసుపు కూడా వేయాలి. కాలీఫ్లవర్ తరుగును ఇందులో వేసి కొద్దిసేపు ఉంచాలి. తరువాత కాలీఫ్లవర్‌ను వడకట్టాలి. చల్లటినీటితో కాలీఫ్లవర్‌ను మరోసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టుకుని బటర్ వేసుకోవాలి. ఇది కరిగాక కాలీఫ్లవర్ తరుగును వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. దీనికి కొద్దిగా నీళ్లు జతచేసి మూత ఉంచి మూడు నిముషాల పాటు ఉడికించి పక్కకు తీసుకోవాలి. అదే బాణలిలో మరికాస్త బటర్ వేసి కరిగాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత దీనికి ఉల్లి తరుగు కూడా జతచేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. తరువాత ఇందులో టొమాటో తరుగు, జీడిపప్పు పలుకులు, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి బాగా కలపాలి. టొమాటో ముక్కలు మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. తరువాత అదే బాణలిని స్టౌవ్‌పై ఉంచి కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి బాగా కలపాలి. ఇందులోనే కాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు జతచేసి సుమారు ఐదు నిముషాల పాటు ఉడికించాలి. తరువాత ఇందులో తాజా క్రీమ్, కసూరీ మేథీ జతచేసి మరోమారు కలియబెట్టి రెండు నిముషాలు ఉడికిన తరువాత కొత్తిమీరతో అలంకరించి దింపేయాలి.
*
గోబీ 65
*
కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్: పెద్దవి రెండు
పెరుగు: రెండు కప్పులు
ఉప్పు: తగినంత
పసుపు: చిన్న చెంచా
కారం: మూడు చెంచాలు
తందూరి రంగు: చిటికెడు
అల్లం, వెల్లుల్లి పేస్ట్: రెండు చెంచాలు
గరం మసాలా: ఒక చెంచా
ఆవాలు: రెండు చెంచాలు
జీలకర్ర: రెండు చెంచాలు
కరివేపాకు: కాసింత
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
కాలీఫ్లవర్ పువ్వుల్ని శుభ్రం చేసుకుని మరుగుతున్న నీటిలో ఒక నిముషం పాటు ఉంచి, కాసింత ఉప్పు కలిపి దించేయాలి. తరువాత పువ్వుల్ని పురుగులు ఉన్నాయా చూసుకుని చిన్న చిన్నవిగా కాలీఫ్లవర్‌ను కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పెరుగులో కారం, ఉప్పు, పసుపు పొడులను వేయాలి. ఇందులోనే తందూరి రంగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోనే కాలీఫ్లవర్‌ను వేసి పది నిముషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తరువాత ఈ కాలీఫ్లవర్‌ను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో బాణలిని తీసుకుని కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఇవి చిటపటలాడాక వేయించిన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా అందులో వేసి బాగా వేయించి దించేయాలి. అంతే గోబీ 65 తయారు. దీన్ని పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా వట్టిదే, స్నాక్స్‌లా తినేస్తారు.
*
గోబీ ఫ్రై
*
కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్ తరుగు: మూడు కప్పులు
నీళ్లు: మూడు కప్పులు
ఉప్పు: తగినంత
అల్లం-వెల్లుల్లి పేస్ట్: రెండు చెంచాలు
సోంపు: పావు చెంచా
నెయ్యి: మూడు చెంచాలు
ఉల్లి తరుగు: అర కప్పు
పచ్చిమిర్చి తరుగు: ఒక చెంచా
కరివేపాకు: రెండు రెబ్బలు
టొమాటో తరుగు: అర కప్పు
పసుపు: పావు చెంచా
కారం: పావు చెంచా
మిరియాల పొడి: పావు చెంచా
గరం మసాలా: పావు చెంచా
జీలకర్ర పొడి: అర చెంచా
ధనియాల పొడి: అర చెంచా
ఉప్పు: తగినంత
కొత్తిమీర తరుగు: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
నీటిని మరిగించి అందులో కొద్దిగా ఉప్పు వేసి అందులో కాలీఫ్లవర్ తరుగు వేయాలి. కాసేపటి తరువాత కాలీఫ్లవర్‌ను తీసి ప్లేటులో వేయాలి. స్టవ్‌పై బాణలిని పెట్టి నెయ్యివేసి వేడిచేయాలి. ఇందులో మొదటగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఇందులో టొమాటో తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి. ముక్కలు బాగా మెత్తబడ్డాక, పసుపు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేయించాలి. తరువాత ఇందులో కాలీఫ్లవర్ తరుగు వేసి బాగా కలపాలి. దీన్ని సన్నని మంటపై కొద్దిసేపు ఉంచి దించేయాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించాలి. ఇది అన్నం, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.