రుచి

పలురకాల పకోడీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యాబేజీతో..
క్యాబేజీ తరుగు- 4 కప్పులు
శెనగపిండి - 1 కప్పు
మిర్చి - 6
నూనె - 250గ్రా.
ఉప్పు-1 చెంచా
బియ్యం పిండి - 1/2 కప్పు
కార్న్‌ఫ్లోర్ -2 చెంచాలు
కరివేపాకు - కొంచెం
అల్లం తరుగు-2 చెంచాలు
శెనగపిండిలో క్యాబేజీ తరుగు, మిర్చి, ఉప్పు, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి నీరు కలిపి ముద్దగా చేసుకోవాలి. బాణలిలో నూనె కాగాక పకోడీల మాదిరి వేసి దోరగా వేపుకోవాలి.

తోట కూరతో..
తోటకూర తరుగు -4 కప్పులు
మైదాపిండి -1/2 కప్పు
శెనగపిండి -1 కప్పు,
బియ్యం పిండి -1/2 కప్పు
ఉప్పు-1 1/2 చెంచా
అల్లం,వెల్లుల్లి పేస్ట్-4 చెంచాలు
నూనె - 250 గ్రా.
వేరుశనగ పప్పు-1/2 కప్పు
శుభ్రపరచిన తోటకూర తరుగు, వేరుశనగ పప్పు, మైదా, శెనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్టు కలిపి నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. కాగిన నూనెలో పకోడీలను దోరగా వేపాలి.

పుదీనాతో..
పుదీనా ఆకులు -4 కప్పులు
గోధుమపిండి -1 కప్పు
బియ్యం పిండి-1/2 కప్పు
జీలకర్ర-2 చెంచాలు
నూనె -250గ్రా.
పుట్నాల పొడి-1/2 కప్పు
పచ్చిమిర్చి-6,
అల్లం,కారం- 5 చెంచాలు
ముందుగా పుదీనా ఆకులను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. గోధుమపిండి, బియ్యం పిండి, జీలకర్ర, పుట్నాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, కారం కలిపి నీళ్లు చల్లి పుదీనా ఆకులను వేసుకుని ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను పకోడీల మాదిరి కాగిన నూనెలో వేపుకోవాలి.

ఉల్లిముక్కలతో..
ఉల్లిపాయల తరుగు- 5 కప్పులు
శెనగపిండి -1 కప్పు
బియ్యం పిండి -2 చెంచాలు
కొబ్బరి కోరు -2 చెంచాలు
ఉప్పు-2 చెంచాలు
నూనె -250గ్రా.
మిర్చి-8
కరివేపాకు - కాస్త
బియ్యం పిండి, గోధుమ పిండిలో నీళ్లు పోసి కొబ్బరి కోరు, ఉల్లిముక్కలు, ఉప్పు, మిర్చి, కరివేపాకు వేసి ముద్దలా చేసుకోవాలి. దీన్ని పకోడీల మాదిరి కాగిన నూనెలో దోరగా వేపుకోవాలి.

మొక్కజొన్నతో..
మొక్కజొన్న గింజలు -4 కప్పులు
అల్లం-వెల్లుల్లి పేస్టు - 2 చెంచాలు
ఉప్పు-2 చెంచాలు
నూనె -250 గ్రా.
జీలకర్ర -1 చెంచా
శనగపిండి -1/2 కప్పు
గోధుమ పిండి - 1/4 కప్పు
కరివేపాకు - కాస్త
మిర్చి - 10
లేత మొక్కజొన్న గింజలను శుభ్రంగా కడిగి మిక్సీ పట్టాలి. ఇందులో కాస్త నీరు కలిపి ఉప్పు,మిర్చి, జీలకర్ర, శనగపిండి, గోధుమ పిండి, కరివేపాకు కలిపి ముద్దగా చేసుకోవాలి. నూనె కాగాక ఈ ముద్దను పకోడీలుగా కాగిన నూనెలో వదలాలి.

కాప్సికమ్‌తో
కాప్సికమ్ ముక్కలు -2 కప్పులు
మిర్చి ముక్కలు -24
ఉల్లి ముక్కలు -1 1/2 కప్పు
బొంబాయి రవ్వ-1 కప్పు
శెనగపిండి -1 కప్పు
నూనె -250గ్రా.
ఉప్పు-1 చెంచా
జీలకర్ర-1 చెంచా
బేకింగ్ పౌడర్ -1/2 చెంచా
పెరుగు -1 కప్పు

పెరుగులో బొంబాయి రవ్వ, ఉప్పు, శెనగపిండి, జీలకర్ర కలిపి గంటసేపు అలాగే వదిలేయాలి. తర్వాత ఆ ముద్దలో కాప్సికమ్, ఉల్లి, మిర్చి, బేకింగ్ పౌడర్ వేసి నూనె కాగాక పకోడీలుగా వేసుకోవాలి.

- వాణీ