రుచి

కీరాతో కమ్మగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణం మారుతోంది. భానుడు భగభగలు పూర్తిగా మొదలు కాకుండానే దాహం ఇబ్బందిపెడుతోంది. ఈ సమయంలో కీరా తింటే ఒంట్లో చల్లగా ఉంటుంది అంటుంటారు. అయితే ఒట్టి కీరా తినాలంటే చాలామందికి చికాకు. అందుకే కీరాతో వెరైటీ వంటలు చేసి వడ్డిస్తున్నారు. ఆ వంటలేంటో మనమూ చూద్దాం..
*
ఫ్రైడ్‌రైస్
*
కావలసిన పదార్థాలు
వండిన అన్నం: రెండు కప్పులు
కీరా ముక్కలు: ఒక కప్పు
గుడ్లు: రెండు
ఉప్పు: తగినంత
కారం: ఒక చెంచా
పచ్చిమిర్చి: నాలుగు
సోయాసాస్: ఒక చెంచా
చిల్లీసాస్: ఒక చెంచా
కొత్తిమీర తురుము: రెండు చెంచాలు
మిరియాల పొడి: ఒక చెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
కోడిగుడ్లను పగలకొట్టి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి బాగా గిలక్కొట్టి ఆమ్లెట్‌లా వేసుకుని రెండు వైపులా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కీరాను తొక్కతీసి సన్నగా పొడవుగా కోయాలి. స్టవ్‌పై బాణలిని ఉంచి నూనె వేసి కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
తరువాత ఇందులో సోయాసాస్, చిల్లీసాస్ వేసి ఒక నిముషం పాటు వేయించాలి. ఇప్పుడు సన్నగా, పొడవుగా తరిగిన కీరా ముక్కలను కూడా వేసి ఒక నిముషం వేగనివ్వాలి.
ఇవి వేగిన తరువాత వండిన అన్నం వేసి కలపాలి. తరువాత ఆమ్లెట్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని కూడా వేసి రెండు నిముషాల పాటు వేయించి కొత్తిమీర తురుమును కూడా చల్లి దించాలి. దీన్ని వేడివేడిగా పిల్లలకు వడ్డిస్తే ఆనందంగా తింటారు.
*
నూడుల్స్
*
కావలసిన పదార్థాలు
నూడుల్స్: కప్పు
కీరా: రెండు
నిమ్మరసం: రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
మిరియాలపొడి: ఒక చెంచా
చీజ్ తురుము: రెండు చెంచాలు

తయారుచేసే విధానం
ముందుగా నూడుల్స్‌లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఒక్క పొంగు వచ్చిన తరువాత నీళ్లు వంపేసి నూడుల్స్‌ను చల్లటినీటితో కడిగి వడబోయాలి. తరువాత కీరాలను తీసుకుని తొక్కతీసి గ్రేటర్‌తో సన్నగా తురమాలి. వీటిని నూడుల్స్‌లో వేసి కలిపి వీటిపై ఉప్పు, మిరియాలపొడి చల్లాలి. చివరగా కాస్త చీజ్ తురుము, నిమ్మరసం పిండితే కీరా నూడుల్స్ సలాడ్ రెడీ. ఇందులో మీకు నచ్చితే కారెట్, కాప్సికం వంటి కూరగాయల్ని కూడా జత చేసుకోవచ్చు.
*
చీజ్ కేక్
*
కావలసిన పదార్థాలు
సాల్ట్ బిస్కట్లు: 200 గ్రాములు
వెన్న: 50 గ్రాములు
నిమ్మకాయతొక్కల పొడి: ఒక చెంచా
మిరియాల పొడి: ఒక చెంచా
చీజ్ తురుము: 50 గ్రాములు
కీరా: ఒకటి
నీళ్లు లేకుండా వడకట్టిన పెరుగు:
పావు లీటరు
క్రీమ్: కప్పు
పంచదార: రెండు చెంచాలు
నిమ్మరసం: రెండు చెంచాలు
జెలాటిన్: రెండు చెంచాలు
పుదీనా తురుము: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
కీరా తొక్క తీసి సన్నగా తురమి పక్కన పెట్టుకోవాలి. తరువాత బిస్కెట్లను పొడి చేయాలి. ఇందులోనే వెన్న, నిమ్మతొక్కల పొడి, చీజ్ తురుము వేసి బాగా కలపాలి. ఒక వెడల్పాటి గినె్నను తీసుకుని ఈ మిశ్రమాన్ని అడుగున వేయాలి. తరువాత మరో గినె్నను తీసుకుని అందులో కీరా తురుము, వడకట్టిన పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో పంచదార, జెలాటిన్, పుదీనా తురుము, క్రీమ్ వేసి బాగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా వెడల్పాటి గినె్నలో వేసిన మిశ్రమంపై పోయాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిజ్‌లో ఎనిమిది గంటల పాటు ఉంచాలి. తరువాత తీసి చల్లచల్లగా అందించాలి. అంతే కీరా చీజ్ కేక్ తయారు.
*
పకోడి
*
కావలసిన పదార్థాలు
చెస్ట్‌నట్ పిండి: కప్పు
ఉప్పు: తగినంత
కారం: అర చెంచా
ధనియాల పొడి: అర చెంచా
పచ్చిమిర్చి: రెండు
కీరా: రెండు
నూనె: వేయించడానికి
సరిపడా
తయారుచేసే విధానం
ఒక వెడల్పాటి పాత్రలోకి పిండిని తీసుకుని, ఇందులో తగినంత ఉప్పు, ధనియాల పొడి, కారం, పచ్చిమిర్చి(సన్నగా తరిగినది) వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై బాణలి ఉంచి అందులో నూనెపోసి వేడి చేసుకోవాలి. తరువాత కీర ముక్కలు పిండి మిశ్రమంలో అద్దుకుంటూ నూనెలో వేసుకోవాలి. ఇవి బంగారు రంగు వచ్చేవరకు ఉంచి పక్కకు తీసుకోవాలి. వీటిపై కొత్తిమీర చట్టి చింతపండు చట్నీతో తింటే భలేగా ఉంటాయి.
*
పరాటా
*
కావలసిన పదార్థాలు
కీరా ముక్కలు: ఒక కప్పు
పచ్చిమిర్చి: రెండు అల్లం: అరంగుళం
గోధుమపిండి: ఒక కప్పు
శనగపిండి: రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్రపొడి: అర చెంచా
వాము: అర చెంచా
పసుపు: చిటికెడు
పంచదార: పావు చెంచా
నూనె లేదా నెయ్యి: కాల్చడానికి
ఉప్పు: తగినంత కొత్తిమీర: అర కప్పు
పుదీన: అర కప్పు
తయారుచేసే విధానం
మిక్సీలో కీరా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక వెడల్పాటి గినె్నను తీసుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి. ఇందులోనే గోధుమపిండి, ఉప్పు, శనగపిండి, వాము, జీలకర్రపొడి, పసుపు, పంచదార వేసి బాగా కలపాలి. ఇది ముద్దగా అయిన తరువాత దీనిపై ఒక చెంచా నెయ్యి కూడా వేయాలి బాగా ముద్దలా పిసకాలి. తరువాత ఈ ముద్దను పావుగంటపాటు పక్కన ఉంచాలి. తరువాత కొంత పిండిని తీసుకుని ఇష్టమైన ఆకారంలో పరాటాల్లా చేసుకుని పెనంపై నూనె లేదా నెయ్యితో రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. ఈ పరోటాలు టొమాటో పచ్చడితో బాగుంటాయి.
*
దోసె
*
కావలసిన పదార్థాలు
బియ్యం: ఒక కప్పు
పచ్చికొబ్బరి తురుము: ఒక కప్పు
కీరా ముక్కలు: ఒకటిన్నర కప్పులు
జీలకర్ర: ఒక చెంచా పచ్చిమిర్చి: మూడు
అల్లం: అంగుళం ముక్క ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
బియ్యాన్ని రెండు, మూడు గంటలపాటు నానబెట్టి నీరంతా వడకట్టి మిక్సీలో వేసి కొంత మెదపాలి. తరువాత ఇందులోనే కీరా ముక్కలు, తురిమిన పచ్చికొబ్బరి, చిదిమిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండినంతా ఒక పాత్రలోకి తీసుకుని అందులో జీలకర్రతో పాటు రుచికి సరిపడా ఉప్పువేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పదినిముషాల పాటు పక్కన ఉంచి తరువాత పెనంపై నూనె రాసి దోసెల్లా పోసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. దీన్ని మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు.