రుచి

పేదవాడి ఆపిల్ జామకాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జామకాయ పేదవాడి ఆపిల్‌గా పేరుపడింది. ఆరోగ్యానికి ఈ ఫలాహారం చాలా మంచిదని న్యూట్రిషన్లు చెప్తారు. అందులోనూ జామకాయ ఆరోగ్యానికి, అందానికి కూడా అద్భుతమైన ఫలం. జామపండులో వున్న విటమిన్ ఎ, సిలు మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు జామకాయ ఒక వరం లాంటిదని చెప్పాలి. జామకాయతో బ్లడ్‌లోని గ్లూకోజ్ లెవెల్స్‌ను బాగా తగ్గించుకోవచ్చని, ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించి బ్లడ్ షుగర్‌ను తగ్గిస్తుందని డాక్టర్లు, న్యూట్రిషన్లు చెప్తున్నారు. ఇక దంతాల నొప్పికి, గొంతునొప్పి, చిగుళ్ల వ్యాధులను జామకాయలను నమలడం ద్వారా దూరం చేసుకోవచ్చు. పూర్వం జామ పుల్లలతో పళ్లు తోముకునేవారట. దానివలన చిగుళ్లకు సంబంధించిన ఎన్నో సమస్యలు నివారణయ్యేవని పెద్దలు చెప్తారు. అంతేకాదు కేన్సర్‌ను ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నిరోధించే లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయని చెప్తారు. ఎసిడిటి, కీళ్లనొప్పులు తగ్గించడానికి, థైరాయిడ్ నుంచి రక్షించడానికి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపకరిస్తుంది. జామకాయ జ్యూస్ కాలేయానికి కూడా ఒక మంచి టానిక్‌లాగా పనిచేస్తుంది. డయేరియా సమస్యలనుంచి కూడా జామకాయ రక్షిస్తుంది. జామ వేర్లను నీటిలో వేసి మరిగించి కషాయం చేసి ఖాళీ కడుపున తీసుకుంటే పొట్ట సమస్యలనుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే బాగా పండిన జామ పండ్లకంటే దోర జామలోనే ఈ లక్షణాలన్నీ ఎక్కువగా ఉంటాయని న్యూట్రిషన్లు చెప్తున్నారు.
ఆకులు కూడా
జామాకులతో టీ పెట్టుకుని తాగితే అది జీర్ణక్రియ సవ్యంగా జరగడానికి చక్కగా ఉపకరిస్తుంది. ఈ ఆకుల రసం తీసుకుంటే ఫుడ్ పాయిజినింగ్ నుంచి రక్షిస్తుందట. జామ ఆకులను ముద్దగా చేసి దంతాలు, చిగుళ్ల మీద రాస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. జామ ఆకుల డికాషన్ తాగడంవలన జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. జామాకులను బాగా కడిగి నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటికి తేనెను కలిపితే జామాకుల టీ తయారవుతుంది. ఇది తరచూ తాగడం వలన అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అన్ని రకాల ఎలర్జీలనుంచి ఈ టీ రక్షిస్తుంది. ప్రతిరోజూ రెండు జామకాయలను తినడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చని న్యూట్రిషన్లు చెప్తున్నారు. ఇందులో సోడియం, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉండడంవలన శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. జామాకుల రసం తాగినా కూడా బరువును అదుపు చేస్తుందట.
ముఖం ప్రకాశవంతం
జామకాయను తింటే దానిలోని పోషక పదార్థాల వలన చర్మం మృదువుగా, అందంగా తయారవుతుంది. జామపండు గుజ్జును ముఖానికి మర్దన చేసి కాసేటి తరువాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే ముఖంపై ముడతలు తగ్గి, ముఖం ప్రకాశవంతంగా కనబడుతుంది. జామపిందెలు, ఆకులు కలిపి ముద్దగా చేసి ఆ ముద్దతో చర్మంపై రుద్దుకుంటూ చర్మపు రంగును మెరుగుపరచడంతోపాటు చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది. కురుల ఆరోగ్యానికి కూడా జామాకుల్ని నీటిలో బాగా ఉడకబెట్టి ఆ నీటిని చల్లార్చి జుట్టు కుదుళ్లకు బాగా పట్టిస్తున్నట్లయితే జుట్టు కుదుళ్లు దృఢంగా పెరిగి జుట్టు సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి.

-మావూరు విజయలక్ష్మి