రుచి

పెసలుతో పసందైన వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొలకలు నిత్యం తినడం మంచి ఆరోగ్యం. ప్రోటీన్ శాతం అధికం. ముఖ్యంగా పొట్టు పెసలతో వంటకాలు మంచి బలవర్ధకాలు. మొలకలు రుబ్బి వడలు, దోశెలుగా కూరగాయలతో వండితే మంచిది. పెసరట్లు అందరికీ తెలిసినవే. అల్లం, ఉల్లి, క్యారెట్, చల్లి రుచికరమైన వంటలుచేస్తారు. పొలిపుర్ణం, బూరెలు, బొబ్బట్లు, హల్వా, చంద్రకాంతలు, డోక్ల వంటివి చేసుకుంటే ఎంతో రుచి! వంటికి చలువ చేస్తుంది.

సలాడ్
పొట్టు పెసలు కడిగి గుడ్డలో మూటకడితే మొలకలు వస్తాయి. ఇలాంటి మొలకలు-2 కప్పులు, టమాటో ముక్కలు-1 కప్పు, దోస లేక కీరా ముక్కలు-1 కప్పు, కొబ్బరి కోరు-1 కప్పు, కొత్తిమీర-తరుగు, పచ్చిమిర్చి-1, ఉప్పు-1 చెంచా, నిమ్మరసం-2 కాయలవి, జీలకర్ర-1 చెంచా, క్యారెట్ కోరు-1/2 కప్పు
విధానం
నిమ్మరసం, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి వుంచాలి. ఇప్పుడు ఒక డిష్‌లో మొలకలు కొన్ని వేసి కొబ్బరి వేసి నిమ్మరసం, కొంచెం చల్లి మళ్లీ పైన మొలకలు వేయాలి. మళ్లీ కీర ముక్కలు వేసి నిమ్మరసం చల్లి పెసలు ముక్కలు వేసి మరలా టమాటా ముక్కలు, నిమ్మరసం మరల క్యారెట్ కోరు, నిమ్మరసం, పెసల ముక్కలు ఈ విధంగా వరసలు వరసలుగా వేసి ఒక అరగంట మూతపెట్టి వుంచాలి. ఆ తర్వాత వీటిని పుల్కాతో తింటే మంచి బలవర్ధకం.

మొలకల కూర
ఆవాలు-1 చెంచా, నెయ్యి-1 చెంచా, జీలకర్ర-1 చెంచా, కొబ్బరి కోరు-1/2 కప్పు, కరివేపాకు-కొంచెం, ఎండుమిర్చి-1, మినపప్పు-1 చెంచా, నువ్వుల పొడి-1/2 కప్పు, ఉప్పు-1 చెంచా, మొలకలు-2 కప్పులు
విధానం
బాణలిలో నెయ్యివేసి పోపులు వేయించి కరివేప వేయించి ఈ మొలకలు వేసి 5 నిముషాలు ఉప్పు, నీరు చల్లి మూతపెట్టి వుంచాలి. తరువాత మూతతీసి కొబ్బరి కోరు వేసి కలపాలి. మరలా 2 నిముషాల తర్వాత నుపప్పు పొడి వేసి కలిపి దింపాలి. ఇది అన్నంలోకి బాగుంటుంది.
కట్‌లెట్స్
ఉడికించిన బంగాళాదుంపలు-4, పచ్చిమిర్చి-2, జీలకర్ర-1 చెంచా, ఉల్లి ముక్కలు-1 కప్పు, ఉప్పు-1 చెంచా, నూనె-250గ్రా, అల్లం కోరు-1 చెంచా, జీడిపప్పు-12, వేరుశనగపప్పులు-1 కప్పు, కొబ్బరి కోరు-1/2 కప్పు
విధానం
ముందుగా జీడిపప్పు, వేరుశనగపప్పు, కంగాబంగా చేసుకోవాలి. బంగాళాదుంప బాగా నలిపి మొలకలు, పచ్చి మిర్చి, అల్లం, ఉప్పు అన్నీ కలిపి ముద్దగా చేసుకోవాలి. నూనె కాగనిచ్చి డైమన్‌లుగా చేసుకుని వేయించాలి. ఇవి వేడిమీద స్నాక్స్‌గా తింటే బాగుంటాయి.
ఎమ్‌ఎల్‌ఎ పెసరట్టు
పెసలు-4 కప్పులు, అల్లం కోరు-2 చెంచాలు, కొబ్బరి కోరు-1 కప్పు, క్యారెట్ కోరు-1 కప్పు, పచ్చిమిర్చి తరుగు-5 చెంచాలు, నూనె-1/2 కప్పు, జీలకర్ర-2 చెంచాలు, నూనె-1/2 కప్పు, ఉప్పు-2 చెంచాలు, ధనియాలు-1/4 కప్పు
విధానం
పెసలు నానపెట్టి మిక్సీపట్టాలి. పెనానికి చెంచా నూనె రాసి అట్టుగా పోసి దానిపై అల్లంకోరు, ధనియాలు మిక్సీపట్టిన పొడి జీలకర్ర, కారెట్ కోరు, అన్నీ చల్లి వేగనివ్వాలి. పెనంపై అట్టు తిరగేసి మరల నూనె వేసి వేయించి తీయాలి. అల్లం, మిర్చి, ధనియాలు, కొబ్బరి, క్యారెట్, అన్నీ మిక్సీ పట్టి కూడా అట్టువేసుకుంటే ముక్కలు అట్టునుంచి విడకుండా వస్తుంది.

తియ్య గుమ్మడి
పెసరపప్పు హల్వా
తియ్యగుమ్మడి కోరు-2 కప్పులు, పొట్టులేని పెసరపప్పు-2 కప్పులు, నెయ్యి-1 కప్పు, ఏలకులు-6, బెల్లం-1 కప్పు, కొబ్బరి కోరు-5 చెంచాలు
ముందుగా తియ్యగుమ్మడి నేతిలో వే యించాలి. పెసరపప్పు నానపెట్టి ఉడికించి పక్కనపెట్టాలి. ఇప్పుడు పై రెండు బాగా కలిపి బెల్లం, నెయ్యి వేసి బాగా కలపాలి. ఇది బుడగలు వస్తుండగా ఏలకులు వేసి దింపాలి. ఈ హల్వాతో బూరెలు, బొబ్బట్లు కూడా చేయవచ్చును.

మూడు రకాల వంటకాలు
పెసరపప్పు-2 కప్పులు, బియ్యం రెండు కప్పులు, కొబ్బరి కోరు-1 కప్పు, నెయ్యి-1/2 కప్పు
ఖీర్: విధానం: పెసరపప్పు బియ్యం కొబ్బరి దోరగా వేయించి 4 కప్పుల నీరు పోసి ఉడికించి దింపి నెయ్యి కలిపి పక్కన వుంచాలి. దానిలో 4 కప్పుల పంచదార చేర్చి ఉడికించి ఖీర్ చేయవచ్చును.
చక్కెరపొంగలి: బెల్లం-2 కప్పులు, పంచదార-1 కప్పు, కిస్‌మిస్, జీడిపప్పు, పైన వండిన మాదిరి పెసరపప్పు అన్నం వేసి ఉడికించి మరో కప్పు నెయ్యి వేసి దింపాలి.
కట్టుపొంగలి: మిరియాలపొడి-2 చెంచాలు, అల్లంకోరు-2 చెంచాలు, కరివేప, జీలకర్ర, ఇంగువ కొంచెం, నెయ్యి అరకప్పులో వేయించి పైన చేసిన పెసరపప్పు అన్నానికి కలిపి తగినంత ఉప్పు చేర్చి కలిపి దింపాలి.