రుచి

పెరుగుతో వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకాలంలోనైనా పెరుగు మన నిత్యజీవితం భాగ మవుతోంది. భోజనం చివరిలో పెరుగన్నం తినకపోతే కడుపు నిండినట్లు అనిపించదు. వేసవి కాలంలో దీనికి సంబంధించిన పదార్థాలు తీసుకుంటే కడుపు కాస్త చల్లగా ఉంటుది. ఇందులో సంపూర్ణ పోషక విలువలు వున్నాయ. వేసవిలో నిమ్మ మజ్జిగ, దబ్బ మజ్జిగ, దద్ద్యోజనం, పెరుగువడ, పొట్ల, ఆనప, తెల్ల గుమ్మడి, కొబ్బరి వంటి పెరుగు పచ్చళ్లు చేస్తూ ఉంటారు.

పుటికీలు

పెరుగు - 2 కప్పులు
మైదా - 1 కప్పు
బియ్యంపిండి - 1 కప్పు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
పచ్చిమిర్చి - 5
కొత్తిమీర - కొంచెం
అల్లం - కొంచెం
వెన్న - 5 చెంచాలు
ఉప్పు - 1 చెంచా
ఎండుకొబ్బరి కోరు - 5 చెంచాలు
నానబెట్టిన పెసరపప్పు - 4 చెంచాలు
నూనె - 250 గ్రా.

పెరుగుకి ఉప్పు, మిర్చి పేస్ట్ వేసి, జీలకఱ్ఱ, కొత్తిమీర అన్నీ కలిపి నానబెట్టాలి. ఇది రాత్రికి నానబెట్టి
మరునాడు మధ్యాహ్నం వేసుకుంటే మంచిగా బాగా మృదువుగా వస్తాయి. బాణలిలో నూనె కాచి, ఈ పిండిలో నానిన పెసరపప్పు, జీలకఱ్ఱ చేర్చి కలిపి ముద్దగా చేసుకుని, కాగిన నూనెలో పుటికీలుగా వేసుకుని అంటే చిన్న చిన్న ముద్దలుగా వదలాలి. ఈ పుటికీలు పుల్ల పుల్లగా స్పాంజిలా వస్తాయి.

దొనె్నలు

పెరుగు - 2 కప్పులు
బియ్యం - 2 కప్పులు
మెంతులు - 1 చెంచా
ఉప్పు - 2 చెంచాలు
శెనగపప్పు - 2 చెంచాలు
వాము - 2 చెంచాలు
మిర్చి ముక్కలు - 12
ఉల్లి ముక్కలు - 1/2 కప్పు
క్యారెట్ కోరు - 1/2 కప్పు
సోడా - 1/4 చెంచా
నూనె - 1/4 కప్పు

పెరుగులో బియ్యం, మెంతులు వేసి ఒక రాత్రి నానపెట్టి తెల్లారి రుబ్బి, సోడా వేసి కలిపి ఒక గంట నానబెట్టి దానిలో నానబెట్టిన శెనగపప్పు, క్యారెట్ కోరు, ఉల్లి, మిర్చి కలిపి వాము చేర్చి కలిపి, పొంగరాల ప్లేట్లు గుంటల్లో ఈ పిండి పోసి స్టాండ్‌పై పెట్టి ఉడికించాలి. అవసరమైతే నూనె వేసి తిరగవేసి తియ్యాలి. ఇవి దొనె్నల్లా వుంటాయి. మంచి రుచి!

మెంతి పెరుగు దోశెలు

మెంతులు - 4 చెంచాలు
పెరుగు - 4 కప్పులు
మైదా - 2 కప్పులు
అటుకులు - 2 కప్పులు
ఉప్పు - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 1 చెంచా
మిరియాల పొడి - 1 చెంచా
పచ్చిమిర్చి, అల్లం తరుగు - 2 చెంచాలు
నెయ్యి - 5 చెంచాలు

ముందుగా పెరుగులో మెంతులు, అటుకులు, ఉప్పు వేసి నానబెట్టి 2 గంటల తర్వాత మిక్సీ పట్టాలి. దీనిలో మైదా పచ్చిమిర్చి అల్లం కలిపి పెనం కాలాక దోశెలుగా పోసి కాలనివ్వాలి. దీనిపై మూతపెడితే బాగా ఉబ్బి, మెత్తని దోశెలుగా వస్తాయి. ఈ విధంగా పిండి అంతా దోశెలుగా పొయ్యాలి.

తీపి దోశెలు

చెఱకు పానకం కాని బెల్లం పానకము - 1 కప్పు
పెరుగు - 1 కప్పు
మైదా - 1/2 కప్పు
బియ్యం పిండి - 1/4 కప్పు
అటుకులు - 1 కప్పు
ఉప్పు - చిటికెడు
ఏలకులు - 4
జీలకఱ్ఱ - 2 చెంచాలు
కొబ్బరి కోరు - 1/2 కప్పు
నెయ్యి - 5 చెంచాలు

పెరుగుకి, మైదా, అటుకులు అన్నీ కలిపి చిటికెడు ఉప్పు వేసి నానబెట్టి ఉంచాలి. 5 గంటలు నానబెట్టిన దీనిలో బెల్లం పాకం, కొబ్బరి కోరు వేసి కలిపి 5 నిమిషాల తర్వాత ఏలకుల పొడి కలిపాలి. పెనానికి నెయ్యి రాసి 2 గరిటెలు పోసి సర్ది మూత పెట్టాలి. ఇది బ్రెడ్ మాదిరిగా ఉబ్బి మెత్తగా ఉంటుంది. సన్న సెగని కాగనివ్వాలి. రెండు వైపులా ఎర్రగా వేగాక తీసి పళ్ళెంలో పెట్టాలి. ఇలా పిండి అంతా వేసుకోవాలి. అరిశెలుగా వస్తుంది.

పండ్ల ముక్కలతో..

ద్రాక్ష ముక్కలు - 1 కప్పు
మామిడి ముక్కలు - 1 కప్పు
కమలా ముక్కలు - 1 కప్పు
ఏలకుల పొడి - 1 చెంచా
మిరియాల పొడి - 1 చెంచా
పంచదార - 5 చెంచాలు
పెరుగు - 4 కప్పులు
కొత్తిమీర - కొంచెం
నిమ్మరసం - 2 చెంచాలు

దానిమ్మ గింజలు - 1/2 కప్పు విధానం: పెరుగులో అన్ని రకాల పండ్ల ముక్కలు, మిరియాలు, ఏలకుల పొడి, పంచదార అన్నీ చేర్చి కలిపి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. కొంచెం గట్టిపడుతుండగా తీసి కప్పులో వేసి ఇవ్వండి.

- ప్రభాకరి