రుచి

ఎండాకాలంలో మేను మెరవాలంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బయటకి వెళ్ళాలంటే చాలు మొహం ఎక్కడ పాడయిపోతుందో అనే భయం. అలాంటి భయాలు దూరంచేసి ఎండల్లోకూడా మీ మేను మెరిసిపోవాలంటే.. ఈ జ్యూస్‌లు తాగి చూడండి. మన శరీరం ఎందుకు వెలిగిపోదో చూద్దాం.
ఎండాకాలం మామూలు ఆహారంకన్నా కూరగాయలు, ఆకుకూరలు తినటం మంచిదని అందరికి తెలుసు. వాటిలో కొన్ని మనకి ఎంతో మేలుచేస్తాయి అవేంటో చూద్దామా.
బేబీకార్న్ జ్యూస్: బేబీకార్న్ సూప్ తింటాం కాని జ్యూస్ ఎక్కువగా తాగం. కాని ఈ జ్యూస్ తాగటంవల్ల శరీరానికి ఎంతో నిగారింపు వస్తుంది. ఇందులో పీచు పదార్థం ఉండటంవల్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది తాగటంవల్ల ఎక్కువసేపు ఆకలి కూడా వెయ్యదు. డైటింగ్ చేసేవాళ్ళకి ఇది ఒక మంచి జ్యూస్. స్వీట్ కార్న్‌లో కొన్ని పాలు కలిపి జ్యూస్‌లా తయారుచేసుకుని తాగటంవల్ల ఎండకి కూడా చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.
టమాటా జ్యూస్: ఇది అందరి ఇళ్ళల్లో మనం కామన్‌గా చూసే జ్యూస్. ఇందులో శరీరంలోని కొవ్వుని తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది. సన్నబడాలి అనుకునేవాళ్ళు ఉదయానే్న ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ సి ఉండటంవల్ల చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.
గ్రీన్‌పీస్ జ్యూస్: గ్రీన్‌పీస్ కూరల్లో ఎంత రుచిగా ఉంటుందో, జ్యూస్‌లా చేసినా అంతే రుచిగా ఉంటుంది. ఈ పచ్చి బఠాణిలో విటమిన్ కె, ఇంకా విటమిన్ బి6 సమృద్ధిగా ఉండటంవల్ల ఆరోగ్యానికి మంచిది. అంతేకాక యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఒక మంచి పౌష్టికాహారం కూడా. మరీ పచ్చి వాసన వస్తోందనిపిస్తే అందులో కాస్త ఉప్పుకలిపి తాగితే బాగుంటుంది.
కేరట్ జ్యూస్: విటమిన్ ఎ పుష్కలంగా ఉండే కేరట్లు కళ్ళకి మాత్రమే కాదు చర్మం నిగారింపుకు కూడా బాగా ఉపయోగపడతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే కేరట్ జ్యూస్ తాగటంవల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది. దీర్ఘకాలంపాటు చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే క్రమం తప్పకుండా కేరట్ జ్యూస్ తీసుకోవాలి. మీ వయసు కనపడనీయకుండా మిమ్మల్ని యంగ్‌గా కనిపించేలా చేస్తుంది.
పాలకూర జ్యూస్: పాలకూర ఎండాకాలంలో మనకి తల్లిలాంటి మేలు చేస్తుంది. విటమిన్ కె పుష్కలంగా లభించే పాలకూర ఎముకలని దృఢంగా ఉంచటంలో సహాయపడుతుంది. ఐరన్ కూడా ఎక్కువగా ఉండే ఈ పాలకూర తినటంవల్ల ఎర్ర రక్తకణాలు త్వరగా అభివృద్ధి చెందుతాయి. ఈ పాలకూర జ్యూస్ వాసన నచ్చక తాగలేని వాళ్ళు ఇందులో ఒక కేరట్, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగచ్చు. మన శరీరం మంచి నిగారింపు సంతరించుకుని వయసులో చిన్నగా కనిపించాలంటే ఇలాం టి జ్యూస్‌లు ట్రై చేయ క తప్పదు. అందంతోపాటు ఆరోగ్యం కూడా మన సొం తమవుతుంది. మరి మీరు ట్రై చేయటానికి రెడీగా ఉన్నారా?