రుచి

హల్వా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కజొన్న గింజలు - 2 కప్పులు
క్యారెట్ కోరు - 2 కప్పులు
నెయ్యి - 1/2 కప్పు
యాలకులు - 5
లవంగాలు - 5
జీడిపప్పు - 12
ఖర్జూరం - 1 కప్పు
కొబ్బరి పాలు - 1 కప్పు
ఉప్పు - చిటికెడు
తేనె - 1 కప్పు
బెల్లం కోరు - 1 కప్పు
మొక్కజొన్న గింజలను శుభ్రం చేసి ఉడకబెట్టి మిక్సీ పట్టాలి. బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, లవంగాలు, యాలకులు, ఖర్జూరం ముక్కలను వేపాలి.
తర్వాత ఈ మిశ్రమంలో మొక్కజొన్న ముద్ద, బెల్లం వేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. చివరగా తేనె, కొబ్బరిపాలు వేశాక, నెయ్యిరాసిన వెడల్పాటి పళ్లెంలో పోసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత నచ్చిన సైజులో ఈ హల్వాను చాకుతో కోసుకోవచ్చు.