రుచి

మునగలో మహా ఔషధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగ చెట్టును పెరట్లో పెంచడం వలన ప్రయోజనమే. మునగ ఆకు పప్పుకూరలో వాడడం ఎంతో శ్రేయస్కరం. మునగఆకు ఆకు కూరగా ఉపయోగించడం మంచిదే. విటమిన్ ఏ, మరియూ కంటికి మేలు చేసే గుణం మునగ ఆకులో మెండుగా వున్నాయి. ఆకులో విటమిన్-సి, కాల్షియం అధికంగా ఉన్నాయ. తాజా మునగకాయలో సైతం విటమిన్లు, ప్రొటీన్లు అధికంగా వున్నాయని శాస్త్ర పరిశోధనలో తేలింది. ఇవి శరీరానికి మేలు చేస్తాయ. మునగకాయను కూరలో అధికంగా వాడడంవలన లైంగికశక్తి అధికమవుతుందంటారు. ఇది తేలికగా జీర్ణం కాగలదు. తెలుగువారు ఇష్టపడే సాంబరులో సైతం మునగకాయలు ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాలలో మునగ ఆకును వేపుడుగా చేసి తింటారు. మహిళలు అధికంగా ఇష్టపడే వంటకాలలో మునగకాయల్ని ఉపయోగిస్తారు. అడవిలో కాచిన మునగలో విటమిన్లు సమృద్ధిగా వుంటాయంటారు.

- ఎల్.ప్రపుల్లచంద్ర