రుచి

ఆహారంపై అవగాహన ఆరోగ్యానికి మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకలి వేస్తోందనో, తోచకో కనబడిందల్లా తినడంవల్ల లెక్కలేనన్ని రోగాలు వచ్చి చేరుతాయి. ఎక్కడబడితే అక్కడ తినడం, సమయపాలన పాటించకపోవడం, నియమిత ఆహారం తీసుకోకపోవడంవల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సంతులితం దెబ్బతిని పోతుంది. రోజువారి తీసుకునే ఆహారం శరీరానికి శక్తి చేకూర్చడంతోపాటూ మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడాలి. అంటే అవసరమైన విటమిన్లు, ఖనిజాలు తీసుకునే ఆహారం ద్వారా చేకూరాలి. పెరిగేవయస్సుతోపాటు తీసుకునే ఆహారంలో కూడా మార్పులు అవసరం. వీరి ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్‌లు ఉండేట్టుగా చూసుకోవాలి. తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలు, నమిలేందుకు వీలుగా ఉండే పదార్థాలను మాత్రమే ఎంచుకోవాలి. ఇలా సంతులిత ఆహారం తీసుకోని నేపథ్యంలో శరీరానికి కావలసిన ఖనిజాలు, విటమిన్లు లోపించడంవల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆహారంలో కావలసినంత ఇనుము లేకపోవడంవల్ల ఎనీమియా సోకే ప్రమాదం వుంది. ఈ వ్యాధి సోకడంవల్ల రక్తప్రసరణ సజావుగా జరగదు. చాలామంది వయస్సు పెరిగేకొద్ది అరుగుదల తక్కువైందని తీసుకునే ఆహారం శాతం తగ్గిస్తారు. అలానే మంచినీరు కూడా చాలా తక్కువగా తీసుకుంటారు. నియమిత స్థాయిలో నీరు తీసుకోకపోవడంవల్ల శరీరంలో ఉండే ద్రవపదార్థాల సంతులితం దెబ్బతినడం జరుగుతుంది.
సాధ్యమైనంత వరకు ఎక్కువగా ద్రవ రూపంలో లభ్యమయ్యే ఆహార పదార్థాలు, పళ్ళరసాలు, మజ్జిగ.. తీసుకోవడం మంచిది. కొంతమంది తమకు తెలిసిన విధంగా ఆహార నియమాలు పాటిస్తుంటారు. దీనివల్ల ఆకలి తీరడం, ఆరోగ్యం సంగతలా వుంచితే నియమిత ఆహారం తీసుకోకపోవడంవల్ల నీరసించే ప్రమాదముంది. పెరిగిన వయస్సుతోపాటు వచ్చే అనారోగ్య సమస్యలు అధిగమించాలంటే ప్రణాళికాబద్ధమైన ఆహారం తీసుకోవాలని గుర్తించాలి. వయస్సు పైబడినవారు రోజుకు కనీసం 1800 కేలరీలో శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. కనుక ఆహారంలో ఆకుకూరలు, పప్పు్ధన్యాలు, చేపలు, గుడ్లు, చక్కెర తదితర పదార్థాలు తప్పక ఉండాలి.
తీసుకునే ఆహారంలో ఎక్కువ పీచు పదార్థాలుండేట్టుగా చూసుకోవాలి.
సాధ్యమైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
రోజూ కనీసం కొంతసేపు వ్యాయామం చేయడం లేదా నడక అలవరచుకోవాలి.
జీర్ణక్రియ సజావుగా వుండకపోయినా, కాలకృత్యాల్లో తేడా వున్నా వైద్య సలహా అవసరం.
మత్తు పదార్థాల వాడకంవల్ల ఆహార నియమాల్లో మార్పు వస్తుంది కాబట్టి వాటిని పూర్తిగా నిరోధించడం మంచిది.
వివిధ రకాలైన ధాన్యాలు, కూరగాయలు, పళ్లు.. ఇలా నియమిత ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు.

- ఎం.కె.