రుచి

మునగ ఆకు వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆషాఢం అనగానే మునగ ఆకు వంటలు వండే ప్రత్యేక మాసం. అటు వర్షం, ఇటు ఎండలతో వాతావరణం ప్రత్యేకంగా వుంటుంది. మునగ కాడలు అందరూ తింటారు. కాని మునగ ఆకు పల్లెటూళ్ళలో తప్ప అందరికీ లభ్యం కాదు. అందుకని ఈ మాసంలో సిటీలలో కూడా ప్రత్యేకంగా ఈ ఆకును అమ్ముతారు.

తెలకపిండితో కూర

శుభ్రపరచి కడిగిన మునగ కూర - 2 కప్పులు
ఉప్పు - 2 చెంచాలు
మినప్పప్పు - 2 చెంచాలు
శెనగపప్పు - 2 చెంచాలు
ఆవాలు - 1 చెంచా
జీలకఱ్ఱ - 2 చెంచాలు
ఎండుమిర్చి - 5
మెంతులు -4 చెంచాలు
తెలకపిండి - 2 కప్పులు
వెల్లుల్లి రేకలు - 24
నూనె - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 6
కరివేపాకు- కొంచెం

మెంతులు తెలకపిండి చేర్చి కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి. బాణలిలో నూనె వేసి పోపు దినుసులు వేయించి వెల్లుల్లి రేకలు, కరివేప వేసి వేయించి తీసి ప్రక్కన పెట్టాలి. ఈ మూకుడులో మిగిలిన నూనె మునగ ఆకు, ఉప్పువేసి మగ్గనివ్వాలి. మెత్తగా అయ్యాక దీనిలో ఉడికిన తెలకపిండి, మెంతుల మిశ్రమం నీరు బాగా పిండివేయాలి. ఇప్పుడు దీన్ని పొడి పొడిగా వచ్చేలా వేపాలి. కమ్మని వాసన వస్తుండగా వేయించిన పోపు సామాను వేసి కలిపి ఐదు నిమిషాలు మూత పెట్టి స్టౌ కట్టేయ్యాలి. ఆ తరువాత దింపి డిష్‌లో పోసుకోండి.
....................................
పెసల మొలకలతో కూర

పెసల మొలకలు - 4 కప్పులు
మునగకూర - 4 కప్పులు
ఉప్పు - 1 చెంచా
జీడిపప్పులు - 12
పోపు సామానులు -
2 చెంచాలు
ఎండుమిర్చి - 2
నూనె - 2 చెంచాలు
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - కొంచెం
కొబ్బరి కోరు - 5 చెంచాలు

మునగ ఆకు శుభ్రపరచి బాణలిలో పోపు వేయించాక దానిలో మునగ ఆకు, ఉప్పువేసి నీరు జల్లాలి. ఇది మగ్గాక దీనిపై పెసల మొలకలు, జీడిపప్పు, ఉప్పు వేసి కలియబెట్టాలి. కమ్మని వాసన వస్తుండగా కొబ్బరి కోరు వేసి కలిపి దింపాలి.
.........................................
టమోటా మునగ ఆకు కూర

శుభ్రంచేసి ఉడికించిన మునగ ఆకు ముద్ద - 2 కప్పులు
జీడిపప్పులు - 12
నువ్వులు - 1/2 కప్పు
జీలకఱ్ఱ - 1 చెంచా
అల్లం- చిన్న ముక్క
పచ్చిమిర్చి - 5
ఉల్లి ముక్కలు - 2 కప్పులు
నూనె - 5 చెంచాలు
కొత్తిమీర - కొంచెం
పోపులు - 2 చెంచాలు
టమోటా - 4, వెల్లుల్లి - 12

టమోటాలు ముక్కలు చేసుకొని ఉప్పు, మిర్చి ముక్కలు కలిపి ఉంచాలి. బాణలిలో నూనె మరిగాక జీడిపప్పు, గసగసాలు, ఉల్లి, వెల్లుల్లి దోరగా వేయించి మిక్సీ పట్టాలి. ఇపుడు ఇది బాణలిలో పోపులు వేయించి టమోటా ముక్కలు, మునగ ఆకు ముద్ద వేసి బాగా ఉడికించాలి. ఘుమఘుమ వాసన వస్తుండగా పైన మిక్సీ పట్టిన ఉల్లి జీడిపప్పు ముద్దను వేసి కలిపి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దింపాలి.
.................................................................
మునగ ఆకు, సోయావడలు

మునగ ఆకు - 4 కప్పులు
సోయ గింజలు - 2 కప్పులు
అల్లం - చిన్న ముక్క
జీలకఱ్ఱ - 2 చెంచాలు
ఉప్పు - 1 చెంచా
మిర్చి - 8
ఉల్లి ముక్కలు - 1 కప్పు
నూనె - 250 గ్రా.
బిస్కెట్ పొడి - 1 కప్పు
కార్న్‌ఫ్లార్ - 5 చెంచాలు
మసాల పొడి - 2 చెంచాలు

సోయా గింజలు నానబెట్టి తొప్పులు తీసి మిక్సీ పట్టాలి. దానిలో మునగ ఆకు, ఉప్పు, జీలకఱ్ఱ చేర్చి ముద్ద చేర్చి, మిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు చేర్చి ముద్దగా రుబ్బి మసాలా పొడి, కార్న్‌ఫ్లోర్ కలిపి దీన్ని ఉండలు చేసి బిస్కెట్ పొడిలో ముంచి వడలుగా తట్టి నూనెలో వేయించాలి. ఇలా వడలన్నీ చేసుకోవాలి.
................................
పెరుగు పులుసు పకోడి

శెనగపిండి - 1 కప్పు
మునగ ఆకు - రెండు కప్పులు
నూనె - 250 గ్రా,పెరుగు - 4 కప్పులు
జీలకఱ్ఱ - 1 చెంచా,ఉప్పు - 2 చెంచాలు
అల్లం - చిన్న ముక్క
కరివేప - 2 రెమ్మలు
బియ్యం పిండి -2 చెంచాలు
పసుపు - 1 చెంచా
ఎండుమిర్చి - 2
ఆవాలు - 1 చెంచా
పచ్చిమిర్చి - 6

పెరుగుకి పసుపు, ఉప్పు వేసి గిలక్కొట్టి, నూనెలో జీలకఱ్ఱ ఎండుమిర్చి, ఆవాలు, కరివేప వేయించి కలిపి ఉంచాలి. శెనగపిండి, బియ్యంపిండి, మునగ ఆకు, పచ్చిమిర్చి, అల్లం చేర్చి కొంచెం తొక్కాలి. ఇప్పుడు దీనికి శెనగపిండిలో కలిపి నూనె కాచి పకోడీలుగా చేసుకోవాలి. వీటిని పేపర్‌పై వేస్తే నూనె అంటుకోకుండా తినటానికి బాగుంటాయ. తరువాత ఈ పకోడీలను పెరుగు పులుసులో వేసుకోవాలి. అరగంటయినాక అన్నంలో వడ్డించుకోండి. తినటానికి చాలా రుచిగా ఉంటాయ. ఇంటికి ఎవరైనా వచ్చినా వీటిని వడ్డిస్తే బాగుం టుంది. తయారచేసుకోవటం కూడా చాలా ఈజీ. పోషకాలు పుష్కలంగా ఉంటాయ.

- వాణీ ప్రభాకరి