రుచి

వర్షాకాలంలో ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాకాలం జల్లుల్లో తడిస్తే మధురానిభూతి కలుగుతుంది. అదే సమయంలో అలెర్జీలు, ఇన్‌ఫెక్షన్లను మోసుకొస్తుందని మరువవద్దు. జలుబు, దగ్గు, జ్వరం, కీళ్లనొప్పులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇవి గనుక చుట్టుముడితే ముఖ్యంగా పిల్లలు, పెద్దల్లో రోగనిరోధక శక్తి సన్నగిల్లి నానాఇబ్బందులు పడాల్సివస్తోంది. గట్టిగా, రాయి వలే ఉండేవారు ఏ కాలాన్నైనా తట్టుకోగలరు. రోగనిరోధక శక్తి లేనివారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. దుస్తులు, ఆహార పానియాల విషయంలో శ్రద్ధవహించటం ఎంతో అవసరం. ఈ కాలంలో వేడి పదార్థాలను మాత్రమే తినాలి. దీనికితోడు పోటీ ప్రపంచంలో ఆధునిక జీవనశైలి జీవిత విధానానే్న మార్చేస్తోంది. ఆరోగ్యంగా ఉండటానికి, త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలలో నీరు అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. అంతేకాదు ఆకుకూరలలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత వీలైనంత వరకు వీటిని తీసుకోవడం తగ్గించండి. పుదీనా చట్నీ, ఉల్లి, వెల్లులితో చేసిన పదార్థాలను ఎక్కువగా వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే పులుసు పదార్థాలైన పెరుగు, మజ్జిగలాంటివి పూర్తిగా తగ్గించాలి. ఇవి కడుపులో ఆమ్ల మోతాదును పెంచుతాయి. వేడిచేసి చల్లార్చిన నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. కాయగూరల పులుసు, సాంబార్ వంటివి ఎక్కువగా తీసుకుంటే మంచిది.