రుచి

అరటిపువ్వు వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరటిపువ్వు కూర చేస్తారు. పువ్వుని రుబ్బి వడియాలు పెడతారు. ఇవి నేతిలో వేయించుకొని తింటే ఆయాసం, దగ్గు, రక్తవిరేచనాలు, అధికంగా మైల, స్తీల ఇతర వ్యాధులు తగ్గిస్తుంది. దీనితో వడలు, పులుసుకూర, ఉప్మాకూర, ఆవకూర, హల్వా, దోశెలు వంటివి చేసి తింటారు. పప్పుకూర, పాఠళీ కూడా చేస్తారు. అరటి పువ్వు దొప్పలు వలచి లోపలి పువ్వులు తీసి దానితో మాత్రం వండుతారు. ఎందుకంటే ఇవి ఉడకవు.
అరటిపువ్వు వడియాలు
మినపప్పు -2 కప్పులు
పచ్చిమిర్చి - 24
ఉప్పు - 4 చెంచాలు
అరటిపువ్వు ముద్ద - 6 కప్పులు
జీలకఱ్ఱ - 5 చెంచాలు
అల్లం ముద్ద - 5 చెంచాలు
ముందుగా మినపప్పు నానబెట్టి నీరు వాడ్చి పిండి రుబ్బి దానిలో తరిగిన పచ్చిమిర్చి, అల్లం కోరు, అరటిపువ్వు ముద్ద చేర్చి బాగా పిసికి కలిపి ప్లాస్టిక్ పేపర్‌పై వడియాలుగా పెట్టాలి. బాగా ఆరాక తిరగవేసి ఆరబెట్టి డబ్బాలో పెట్టాలి. నేతిలో వేయించి తింటే మంచి రుచిగా వుండటమే గాక ఆరోగ్యకరము.
వడలు
అరటిపువ్వు ముద్ద - 2 కప్పులు
బొబ్బరపప్పు - 2 కప్పులు
అల్లము - చిన్న ముక్క
వెల్లుల్లి - 1 గడ్డ
పచ్చిమిర్చి - 12
జీలకఱ్ఱ - 2 చెంచాలు
ఉప్పు - 2 చెంచాలు
నూనె - 250 గ్రా.
కొత్తిమీర - కొంచెం
పుదీనా - కొంచెం
బొబ్బరపప్పు నానబెట్టి నీరు వాడ్చి ముద్దగా రుబ్బి పై పదార్థాలు అన్నీ కలిపి ముద్దగా కలిపి నీటి తడితో వడలుగా తట్టి నూనెలో వేయించి పేపర్‌పై వెయ్యండి. ఇవి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది.
పులుసు కూర
చింతపండు పులుసు - 1 కప్పు
మెంతులు - 2 చెంచాలు
శెనగపప్పు, మినప్పప్పు - 2 చెంచాలు
ఎండుమిర్చి - 8
నూనె - 5 చెంచాలు
ఉప్పు - 1 చెంచా
ఆవాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు
పచ్చిమిర్చి - 5
కరివేప - కొంచెము
బెల్లం - కొంచెం
అరటిపువ్వు ముద్ద - 4 కప్పులు
మూకుడుపై పోపు సామానులన్నీ దోరగా కొంచెం నూనె వేసి వేయించి మిక్సీ పట్టాలి. ఇప్పుడు బాణలిలో మిగిలిన నూనె పోసి అరటి పువ్వు ముద్ద మగ్గించాలి. దీనిలో పులుసు వేసి కలిపి ఉడికాక బెల్లం వేసి కారం వేసి కలిపి మిర్చి ముక్కలు కరివేప చేర్చి ఐదు నిమిషాలు మూత పెట్టి కమ్మని వాసన వస్తుండగా దింపాలి.
- ఉల్లి ముక్కలు వేయించి పై కూరని కలిపి ఉల్లికారం వేస్తే కూర వస్తుంది.
- అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఉడికిస్తే అల్లం కారం కూర వస్తుంది.
- పై పులుసు కూరకి ఆవపిండి 2 చెంచాలు చేర్చితే ఆవ కూర వస్తుంది.
- నువ్వు పిండి 1/2 కప్పు వేసి కలిపితే నువ్వు పిండి కూర వస్తుంది.
- పెరుగు గట్టిది 2 కప్పులు చేర్చితే, పెరుగు కూర వస్తుంది. దీనిలో చింతపండు రసం వేయకూడదు.
హల్వా
బెల్లం - 1 కప్పు
పంచదార - 1 కప్పు
నెయ్యి- 1 కప్పు
పుట్నాల పొడి - 1 కప్పు
అరటిపువ్వు ముద్ద - 1 కప్పు
ఏలకులు - 6
జీడిపప్పులు - 12
నువ్వు పొడి - 1/2 కప్పు
కొబ్బరి - 1 కప్పు
ముందుగా బాణలిలో నెయ్యి వేసి అరటి పువ్వు ముద్ద దోరగా వేయించాలి. దీనిలో బెల్లం, పంచదార, అరకప్పు కొబ్బరి కోరు చేర్చి కలపాలి. అడుగంటకుండా నెయ్యి వేసి శెనగపొడి జల్లి కలిపి, ఏలకుల పొడి జల్లి నెయ్యి వేసి కలిపి నువ్వుల పొడి జల్లి కలిపి పళ్లానికి నెయ్యి రాసి పోసి సర్దాలి. ఇది ముక్కలుగా చేసుకోవాలి.
దోశెలు
పెసరపప్పు - 2 కప్పులు
అరటిపువ్వు ముద్ద - 2 కప్పులు
జీలకఱ్ఱ - 2
చెంచాలు
మిర్చి - 12
ఉల్లి ముక్కలు, కొబ్బరి కోరు - 5 చెంచాలు
నూనె - 1/2 కప్పు
బియ్యము - 1/2 కప్పు
నానబెట్టిన పెసరపప్పు, బియ్యం మిక్సీ పట్టాలి. దానిలో పై పదార్థాలన్నీ వేసి మిక్సీ పట్టాలి. ఈ పిండి నూనె రాసిన పెనంపై పోసి ఉల్లి ముక్కలు అద్ది వేగనివ్వాలి. ఇది అన్నంలోకి బాగుంటుంది.
పప్పు కూర
పెసరపప్పు - 2 కప్పులు
అరటి పువ్వు ముద్ద - 2 కప్పులు
ఎండుమిర్చి - 4
పచ్చిమిర్చి - 2
కరివేప - కొంచెం
నూనె - 1/2 కప్పు
ఆవాలు - 1 చెంచా
జీలకఱ్ఱ - 1 చెంచా
ఉప్పు - 1 చెంచా
నిమ్మరసం - 5 చెంచాలు
కొబ్బరి నీరు - 2 చెంచాలు
పెసరపప్పు కడిగి నానబెట్టి ఉంచాలి. బాణలిలో నూనె పోసి పోపులు ఇంగువ, మిర్చి, కొబ్బరి వేయించాక అరటిపువ్వు ముద్ద వేసి దోరగా వేగనివ్వాలి. ఇది మెత్తబడ్డాక ఉప్పు వేసి కలిపి నానిన పెసరపప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. దీన్ని దింపి నిమ్మరసం వేసి కలిపి అన్నంతో వడ్డించండి.

- వాణీ ప్రభాకరి