రుచి

చెరకు రసం పోషకాలు పుష్కలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెరకురసం త్రాగడంవలన అనేక ప్రయోజనాలున్నాయి. ఆయుర్వేద శాస్త్రం లో చెరకు రసం వాడకం అత్యంత ప్రాధాన్యత వహించింది. ఒక స్పూన్ చెరకురసంలో 4 నుండి 5 గ్రాముల వరకూ కార్బోహైడ్రేట్లు, కాల్షియం దండిగా మెండుగా వున్నాయి.
బెల్లం తయారీ చెరకుసం నుండే సిద్ధమవుతుంది. బెల్లం వాడకం ప్రాముఖ్యత ఆయుర్వేదంలో ఉపయోగించబడే కొన్ని లేహ్యాలలో సైతం చెరకు రసం నుండి తీసే బెల్లం ఉపయోగిస్తున్నారు.
చలవ చేసే గుణం కలది. లైంగిక సామర్థ్యం పెంపొందిస్తుంది. అరికాళ్లు మంటగా వున్నా, మూత్రం మంటగా వున్నా గ్లాసు చెరకురసంతో ఎంతో ఉపశమనం. శరీరానికి శక్తినిచ్చే గుణం కలది. చాలా లావుగా వున్నవాళ్ళు చెరకు రసం మోతాదు మించి త్రాగరాదు. కండరాలకు, మేధస్సుకు అద్భుత శక్తినిచ్చే దివ్య ఔషధం ‘చెరకురసం’ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మలబద్ధకం నివారిస్తుంది. వేసవికాలంలో చల్లటి పానీయం ‘చెరకురసం’. చెరకు
రసం త్రాగేవారు నిమ్మరసం, అల్లంముక్క కలుపుకుని సాయంత్రం వేళలో తీసుకోవడం ప్రయోజనకరం. మనకు నిత్యం లభించే తాజా పానీయాలతో పాటు ‘చెరకురసం’ కూడా పోషక విలువలు గలదని గ్రహించాలి. కామెర్లు, లివరు జబ్బు కలవారికి ఇది ఒక టానిక్‌లా పనిచేస్తుంది. పిల్లలకు పాలిచ్చే తల్లులకు చెరకు రసం త్రాగడం వలన మాతృదనంతోబాటు స్తన్యం నిండుగా పిల్లలకు పాలిచ్చే శక్తిని పెంపొందింపజేస్తాయి. ఫాస్పరస్, కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు దీనిలో వున్నాయి.

- ఎల్.ప్రపుల్ల చంద్ర