రుచి

పనసపొట్టుతో పసందైన వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనసపొట్టు అత్యంత ప్రీతికరమైన కూర. పెళ్లిళ్ళలో పనసపొట్టుతో చేసిన వంటలు స్పెషల్‌గా వడ్డిస్తారు. అందుకే రుచికి మహారాజు లాంటిది గనుక ఫంక్షన్ కింగ్ అంటారు. దీనితో కూర, వడలు, కట్‌లెట్స్, పులుసు, పాఠోళీ, ఆవకాయ, పనస ముక్కలతో కూర్మాకూర వంటివి తయారుచేస్తారు. ఆవపెట్టి పెరుగు కూర చేస్తారు.

పెరుగు కూర
పనసపొట్టు - 2 కప్పులు
పెరుగు - 4 కప్పులు
ఆవపిండి - 2 చెంచాలు, ఉప్పు -2 చెంచాలు, జీలకఱ్ఱ - 1 చెంచా, ఎండుమిర్చి - 4, పచ్చిమిర్చి - 4, కరివేప - కొంచెం
మినపపప్పు, శెనగపప్పు - 4 చెంచాలు
నెయ్యి - 2 చెంచాలు, పనసపొట్టు ఉడికించి ప్రక్కన పెట్టాలి. గట్టి పెరుగుకి ఉప్పు చేర్చి నేతిలో పోపులు వేయించి పెరుగుకి కలపాలి. దీనికి ఆవ పిండి చేర్చి కలిపి ఐదు నిమిషాల తర్వాత ఉడికించి, చల్లార్చిన పనసపొట్టు పిండి కలిపి కరివేపాకు చేర్చి పావు గంట మూత పెట్టి వడ్డిస్తే మంచి రుచి.

కుర్మాకూర
టమోటాలు - 4, పనసముక్కలు - 24
పెరుగు - 1 కప్పు, కారం - 4 చెంచాలు
నూనె - 5 చెంచాలు, మసాలా కారం - 2 చెంచాలు
జీడిపప్పులు - 24, ఉప్పు - 2 చెంచాలు
పుదీనా తరుగు - 5 చెంచాలు, పచ్చిమిర్చి - 6, ఉల్లిముముక్కలు - 2 కప్పులు, పసుపు - 1 చెంచా
ముందుగా పనస ముక్కలు ఉడికించి నీరు వాడ్చి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి నూరిన ఉల్లిముద్ద వేయించి కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీనిలో టమోటా తరిగిన ముక్కల ఉల్లికారం, కొంచెం నీరు చేర్చి మెత్తగా అయ్యేవరకు వేగనిచ్చి దానిలో మిగిలిన కారాలు వేయించిన జీడిపప్పులు, పిండి, పనస ముక్కలు, పుదీనా తరుగు వేసి మగ్గబెట్టి దింపాలి. కొంచెం చల్లారాక పెరుగు వేసి కలిపి పనస ముక్కలు చేర్చాలి. ఇది ఎర్రగా గ్రేవీ వుంటుంది. దీనిపై వేయించిన జీడి పలుకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి అలంకరించాలి.

వడలు
పెసలు - 1 కప్పు, ఛాయపప్పు - 1 కప్పు
పనసపొట్టు - 4 కప్పులు, పచ్చిమిర్చి - 8 కరివేప - కొంచెం, అల్లం కోరు - 5 చెంచాలు, ఉల్లిముక్కలు - 15, ఉప్పు - 2 చెంచాలు, నూనె - 250 గ్రా.
దాల్చిన చెక్కలు - 6
ముందుగా పప్పులు 4 గంటలు నానబెట్టి మిక్సీ పట్టాలి. దీనిలో పనసపొట్టు, ఉల్లి, అల్లం మిర్చి అన్నీ చేర్చి మిక్సీ పట్టి నూనె కాచి వడలుగా వేయించాలి.

పాఠోళీ
శెనగపప్పు - 2 కప్పులు, పనసపొట్టు - 2 కప్పులు, వేరుశెనగపప్పు - 1/2 కప్పు
మిర్చి - 6, కరివేపాకు - కొంచెం, ఉప్పు - 2 చెంచాలు
అల్లం కోరు - 2 చెంచాలు, ఉల్లి ముక్క లు - 2 కప్పులు
నూనె - 1/2 కప్పు, జీలకఱ్ఱ - 2 చెంచాలు
ఆవాలు - 2 చెంచాలు, ఎండుమిర్చి - 4
శెనగపప్పు నానబెట్టి నీరు వాడ్చి, రుబ్బి, పనసపొట్టు, ఉప్పు కలిపి దీన్ని ఇడ్లీ స్టాండులో ఇడ్లీగా వేయాలి. ఇది ఉడికాక దింపి పొట్టుకగా నలిపి ప్రక్కన పెట్టాలి. బాణలిలోకి నూనె పోసి వేగన తరువాత ఆవాలు జీలకఱ్ఱ వేయించి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించి దానిలో ఈ చిదిమిన పొట్టు వేసి బాగా కలపాలి. తరువాత వేగనిచ్చి దింపాలి. ఇది కరకరలాడుతూ పొడి కూరలా వస్తుంది.

కట్‌లెట్స్
బ్రెడ్ పొడి - 1 కప్పు
కార్న్‌ఫ్లోర్ - 1/2 కప్పు, బంగాళాదుంపలు - 2, శెనగపిండి, బియ్యంపిండి - 1 కప్పు, జీలకఱ్ఱ - 2 చెంచాలు, మసాలా కారం - 2 చెంచాలు, నూనె - 250 గ్రా.
ఉప్పు - 2 చెంచాలు,
ముందుగా బంగళాదుంపలు పొట్టు తీసి పనసపొట్టు చేర్చి ఉడికించాలి. నీరు వాడ్చిన తరువాత ముద్దలా చేసుకోవాలి. దీనిలో శెనగపిండి, బియ్యంపిండి, మసాలా కారం, జీలకఱ్ఱ అన్నీ చేర్చి ముద్దగా కలపాలి. కార్న్‌ఫ్లోర్, కొంచెం నీరు చేర్చి జారుగా కలపాలి. ఇప్పుడు పైపిండిని డైమన్లుగా చేసి కార్న్‌ఫ్లోర్ ముంచి బ్రెడ్ పొడిలో ముంచి బాగా అతుక్కున్నాక నూనె కాచి నూనెలో వేయించాలి.

బిర్యానీ
బాసుమతి రైసు - 2 కప్పులు మసాలా ఆకులు - 4, జీడిపప్పులు - 24, క్యారెట్ కోరు - 1 కప్పు బంగాళాదుంప ముక్కలు - 1 కప్పు, ఉల్లిముక్కలు - 1 కప్పు, బఠానీలు - 1 ప్యాకెట్, లవంగాలు - 6, దాల్చిన చెక్కలు - 2, ఏలకులు - 5
నెయ్యి - 1 కప్పు, పనస ముక్కలు పెద్దసైజువి - 24
మసాలా కారం - 2 చెంచాలు, పచ్చిమిర్చి - 12 (సన్నగా తరిగినవి)
కుక్కర్‌లో నెయ్యి వేసి మసాలాలు, ఉల్లిముక్కలు దోరగా వేయించాలి. దానిలో క్యారెట్, బంగాళాదుంప, పనస, బఠానీ, మిర్చి ముక్కలు వేసి నీళ్ళు 4 కప్పులు పోసి ఉడకనివ్వాలి. తదనంతరం మసాలా కారం వేసి కలిపి బియ్యం కడిగినవి పోసి మూతపెట్టాలి. బిర్యానీగా ఉడికాక స్టౌ సిమ్‌లో పెట్టి పైన కాల్చిన పెనం ఐదు నిమిషాలు ఉంచి తీసి పైనుంచి క్రిందకి బాగా కలపాలి. పనస ముక్కలు పెద్దగా కన్పిస్తూ బిర్యానీ రెడీ!

- వాణీ ప్రభాకరి